సముద్ర భూగర్భంలో పరిశోధనలకు సిద్ధమవుతున్న సముద్రయాన్

చంద్రుడు మీద పరిశోధనలు జరపడానికి చంద్ర మిషన్, అదే విధంగా సూర్యుడు మీద పరిశోధనలు జరపడానికి ఆదిత్య మెషిన్ అనే రెండు మిషన్లను విజయవంతంగా నింగిలోకి పంపించిన తర్వాత, ఇస్రో ఇప్పుడు సముద్ర అడుగున మరింత రీసెర్చ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం తనదైన విశేషాలతో సముద్రయాన్ మిషన్ వార్తల్లో నిలుస్తోంది. సముద్రయాణ్- మత్స్య-6000 మిషన్ గురించిన మరిన్ని విశేషాలు ఈరోజు తెలుసుకుందాం..  సముద్రయాణ్- మత్స్య-6000 మిషన్:  సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతులో రీసెర్చ్ […]

Share:

చంద్రుడు మీద పరిశోధనలు జరపడానికి చంద్ర మిషన్, అదే విధంగా సూర్యుడు మీద పరిశోధనలు జరపడానికి ఆదిత్య మెషిన్ అనే రెండు మిషన్లను విజయవంతంగా నింగిలోకి పంపించిన తర్వాత, ఇస్రో ఇప్పుడు సముద్ర అడుగున మరింత రీసెర్చ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం తనదైన విశేషాలతో సముద్రయాన్ మిషన్ వార్తల్లో నిలుస్తోంది. సముద్రయాణ్- మత్స్య-6000 మిషన్ గురించిన మరిన్ని విశేషాలు ఈరోజు తెలుసుకుందాం.. 

సముద్రయాణ్- మత్స్య-6000 మిషన్: 

సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతులో రీసెర్చ్ చేసేందుకు సముద్రయాన్ని మిషన్ రూపుదిద్దుకోంటోంది. అత్యాధునిక సబ్‌మెర్సిబుల్ ‘మత్స్య 6000’ నీటి అడుగున పరిశోధనలో భాగం అవుతుందని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కిరెన్ రిజిజు ఇటీవల వెల్లడించారు. చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో అభివృద్ధి చేసిన ఈ మిషన్లో సుమారు ముగ్గురు ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది. సముద్ర వనరులపై సమగ్ర అధ్యయనం మరియు సముద్ర జీవవైవిధ్యాన్ని అంచనా వేయడంపై మత్స్య 6000 మిషన్ అధ్యయనం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

‘సముద్రయాన్’ మిషన్ ‘బ్లూ ఎకానమీ’కి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించిన మిషన్. సముద్ర పర్యావరణ వ్యవస్థ లోటుపాట్లను అంచనా వేసే విధంగా తయారు చేయబడింది సముద్రయాన్ మిషన్. అంతే కాకుండాఈ ప్రాజెక్ట్ సముద్ర పర్యావరణ వ్యవస్థకు ఎటువంటి హాని తలపెట్టదు అని హామీ ఇస్తూ, రిజిజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

చంద్రయాన్-3: 

ఇస్రో ద్వారా ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ ఇప్పటికే సగం పని పూర్తి చేసుకుందని చెప్పుకోవాలి. ఆగస్టు 5కి ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క కక్ష్య(ఆర్బిట్)లోకి ప్రవేశించి మొదటి విజయాన్ని సాధించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మెల్లమెల్లగా చంద్రుడికి దగ్గరవుతూ చివరి కక్ష్య (ఆర్బిట్)లోకి ప్రవేశించడమే కాకుండా ఆగస్టు 23 సాయంత్రం సమయంలో, చంద్రుడు మీద అడుగు పెట్టబోతోంది చంద్రయాన్-3. 

ఆగస్టు 23న చంద్రుడు మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే క్షణాలు దగ్గర పడుతున్నాయి. భారతదేశం యావత్తు కూడా చంద్రయాన్-3 చంద్రుడు మీద సురక్షితంగా అడుగు పెట్టాలని తమ వంతు ప్రార్థనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతానికి లూనార్ లాండర్ పనితీరు సవ్యంగానే ఉన్నట్లు సమాచారం అందింది. ఇంకో కొన్ని గంటలలోనే, సాయంత్రం సమయం నాటికి చంద్రుడు మీద, చంద్రయాన్-3 లాండర్ సురక్షితంగా, విజయవంతంగా అడుగుపెట్టే అవకాశం ఉంది అని ఇస్రో తెలియజేస్తుంది.

ఆదిత్య L1: 

సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి ఆదిత్య L లాంచ్ చేయడం జరిగింది. ఇది అంతరిక్షంలో భారతదేశం యొక్క మొట్టమొదటి సౌర అబ్జర్వేటరీ. 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థలోని మొదటి ‘లాగ్రాంజ్ పాయింట్’ (L1) చుట్టూ హాలో ఆర్బిట్ లో తిరగబోతోంది ఆదిత్య L1. సోలార్ స్టోర్మ్స్ వంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టనుంది ఆదిత్య L1. 

L1 పాయింట్ అంటే ఎల్ వన్ చుట్టూ ఉండే హాలో ఆర్బిట్ మీదగా తిరిగే ఆదిత్య L1 అంతరిక్ష నౌక ద్వారా మనం సూర్యుని యొక్క అధిక-రిజల్యూషన్ ఫొటోస్ అదేవిధంగా సూర్యుడు చుట్టూ ఉండే మరిన్ని లేయర్స్ గురించి రీసెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సూర్యుడు భూమి నుండి 150 మిలియన్ కి.మీ దూరంలో ఉన్నప్పటికీ మరియు L1 పాయింట్ కేవలం 1.5 మిలియన్ కి.మీ దూరం. అంతరిక్ష నౌక సూర్యుడిని అత్యంత దగ్గర నుంచి అదే విధంగా 24 గంటలు రీసెర్చ్ చేయడానికి సరిగ్గా సరిపోతుంది. మొదటిది, తెల్లవారుజామున నుండి సాయంత్రం వరకు మాత్రమే సూర్యుని చూసి అవకాశం ఉంటుందని.. రెండవది, సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో మాత్రమే మనం సూర్యుని బయటి పొర =లేకుండా చూడగలమని.. కానీ ఇప్పుడు ఆదిత్య మిషన్ ద్వారా 24 గంటలు సూర్యుడి మీద పరిశోధన జరిపే అవకాశం ఉంటుందని విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, ఆదిత్య-ఎల్1లో ప్రైమరీ పేలోడ్ అయిన VELCకి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అయిన రమేష్ అన్నారు.