Operation Ajay: భారతదేశానికి చేరుకున్న మొద‌టి విడ‌త భార‌తీయులు

ఆరు గంటల ఫ్లైట్(Flight) ప్రయాణం చేసిన తర్వాత ఇజ్రాయిల్(Israel) నుంచి సుమారు 212 మంది భారతీయులు సురక్షితంగా న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆపరేషన్ అజయ్(Operation Ajay) ద్వారా పూనుకున్న మొదటి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇంకా సుమారు ఇజ్రాయిల్(Israel) లో 18,000 మంది భారతీయులు చిక్కుకున్నారని, కేవలం 6000 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సమాచారం.  ఇంకా చెవుల్లో మోగుతున్న సైరెన్లు:  ఆపరేషన్ అజయ్(Operation Ajay) ద్వారా ఇజ్రాయిల్(Israel) నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన కొంత మంది, తాము […]

Share:

ఆరు గంటల ఫ్లైట్(Flight) ప్రయాణం చేసిన తర్వాత ఇజ్రాయిల్(Israel) నుంచి సుమారు 212 మంది భారతీయులు సురక్షితంగా న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆపరేషన్ అజయ్(Operation Ajay) ద్వారా పూనుకున్న మొదటి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇంకా సుమారు ఇజ్రాయిల్(Israel) లో 18,000 మంది భారతీయులు చిక్కుకున్నారని, కేవలం 6000 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సమాచారం. 

ఇంకా చెవుల్లో మోగుతున్న సైరెన్లు: 

ఆపరేషన్ అజయ్(Operation Ajay) ద్వారా ఇజ్రాయిల్(Israel) నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన కొంత మంది, తాము ఇజ్రాయిల్(Israel) లో పడిన కష్టాల గురించి వెల్లడించారు. సుమారు మూడు రోజులపాటు నిద్రలేని రాత్రులు గడిపామని. ఒక పీడకలలా ఉందని వెల్లడించారు. నిజంగా ఇశ్రాయేల్లో చాలామంది చిన్నపిల్లలుసైతం ఆకలితో ఆర్తనాతలు చేస్తున్నట్లు తమ ఆవేదనను బయటపెట్టారు. ఇంకా చెప్పాలంటే యుద్ధానికి సంబంధించి సైరన్లు తమ చెవుల్లో ఇంకా మోగుతూనే ఉన్నాయని, భారతి చేరుకున్న భారతీయులు వెల్లడించారు. తమ స్నేహితులకు కూడా సురక్షితంగా తిరిగి భారత చేరుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమను ఇక్కడికి సురక్షితంగా తీసుకువచ్చినందుకు భారత ప్రభుత్వానికి తమ వైపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Read More: Gaza: యుద్ధ పరిస్థితి చూసి విలపిస్తోన్న గాజా

ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా యుక్రేన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్(Israel) వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకమైన ఆపరేషన్ అజయ్(Operation Ajay) అనే పేరుతో ఇజ్రాయిల్ (Israel) లో చిక్కుకున్న భారతీయులను భారతదేశ తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

భారతీయులకు ప్రత్యేక ఫ్లైట్ (Flight): 

ఇజ్రాయెల్-హమాస్(Hamas) యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి విమానం గత రాత్రి టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరుతుంది. సహాయం కోరుతూ రాయబార కార్యాలయంలో నమోదు చేసుకున్న వారిలో, చాలా మంది ఇజ్రాయెల్ విద్యాసంస్థల్లో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. 

విదేశాంగ మంత్రిత్వ శాఖ టెల్ అవీవ్ నుండి ఢిల్లీకి చార్టర్డ్ విమానాన్ని నడుపుతుందని విద్యార్థులకు మెయిల్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. ఈ విమానం ఈరోజు ఇజ్రాయెల్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 9 గంటలకు బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరుతుంది – భారతదేశం ఇజ్రాయెల్ కంటే రెండున్నర గంటలు ముందు ఉంటుంది. గత రాత్రి విమానంలో దాదాపు 212 మంది భారతీయులు, ఇజ్రాయిల్ నుంచి బయలుదేరి సురక్షితంగా భారతదేశం చేరుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చే వారు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు..వారు తిరిగి రావడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.

భారతీయ విద్యార్థులకు పంపిన మెయిల్ లోని Google ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వారు నమోదు చేసుకున్నట్లు తిరిగి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది అందుకుంటారు. ఒక చెక్-ఇన్ సామాన్లు మాత్రమే, 23 కిలోల కంటే ఎక్కువ బరువు లేనిది, ఒక క్యాబిన్ లగేజీ అనుమతించబడుతుందని మెయిల్ పేర్కొంది. అయితే ఈ ప్రత్యేకించి ఫ్లైట్(Flight) ద్వారా భారతీయులను ఇజ్రాయిల్(Israel) నుంచి భారతదేశ దేశానికి తీసుకువచ్చే ఆపరేషన్ అంటూ, దీనికి ఆపరేషన్ అజయ్(Operation Ajay) అంటూ పేరు పెట్టారు. దీని గురించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసామని, ముఖ్యంగా ప్రతి ఒక్కరిని సురక్షితంగా భారతదేశంలో తీసుకురావడమే ఆపరేషన్ అజయ్(Operation Ajay) ముఖ్య ఉద్దేశమని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ట్విట్టర్ ద్వారా ఇటీవల పేర్కొన్నారు.