లోగో మార్చిన ట్విట్టర్.. ఇండియ‌న్ రైల్వే శాఖ ట్వీట్ వైర‌ల్

సోషల్ మీడియా లో నెటిజెన్స్ అత్యధికంగా వాడే మాధ్యమం ట్విట్టర్. ఈ ట్విట్టర్ వాడకం అనేది మన దినచర్యలో ఒక భాగం అయిపోయింది. ఎలాంటి వార్త అయినా క్షణాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఒకప్పుడు కుర్రాళ్లందరూ ఫేస్ బుక్ ని ఆ రేంజ్ లో వాడేవారు. కానీ ట్విట్టర్ వచ్చిన తర్వాత ఫేస్ బుక్ క్రేజ్ తగ్గింది. 2006 వ సంవత్సరం సాన్ ఫ్రాన్సిస్కో లో జాక్ డోర్సే, నోవా గ్లాస్, బిజ్ స్టోన్ మరియు ఎవాన్ […]

Share:

సోషల్ మీడియా లో నెటిజెన్స్ అత్యధికంగా వాడే మాధ్యమం ట్విట్టర్. ఈ ట్విట్టర్ వాడకం అనేది మన దినచర్యలో ఒక భాగం అయిపోయింది. ఎలాంటి వార్త అయినా క్షణాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఒకప్పుడు కుర్రాళ్లందరూ ఫేస్ బుక్ ని ఆ రేంజ్ లో వాడేవారు. కానీ ట్విట్టర్ వచ్చిన తర్వాత ఫేస్ బుక్ క్రేజ్ తగ్గింది. 2006 వ సంవత్సరం సాన్ ఫ్రాన్సిస్కో లో జాక్ డోర్సే, నోవా గ్లాస్, బిజ్ స్టోన్ మరియు ఎవాన్ విల్లియమ్స్ ఈ ట్విట్టర్ యాప్ ని ప్రారంభించారు. మొదట్లో నెటిజెన్స్ కి ఈ ట్విట్టర్ యాప్ వాడకం అంటే ఏంటో తెలియదు. చాలా తికమక గా ఉండేది, కానీ ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ ట్విట్టర్ లో మార్పులు చేర్పులు జరిగాయి. ఆలా క్రమేణా యూజర్లు పెరుగుతూ పోయారు. ఇప్పుడు సోషల్ మీడియా లోనే అత్యంత పవర్ ఫుల్ మీడియం గా మారిపోయింది ట్విట్టర్.

ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత ట్విట్టర్ లో అనూహ్యమైన మార్పులు :

ట్విట్టర్ జాక్ చేతిలో ఉన్నన్ని రోజులు చాలా బాగుండేది. కానీ ఎప్పుడైతే ఎలాన్ మాస్క్ చేతిలో ఈ ట్విట్టర్ యాప్ వెళ్లిందో, అప్పటి నుండి అన్నీ మారిపోయాయ్. ట్విట్టర్ ఫీచర్స్ లో ఎన్నో పరిమితులు పెట్టేసాడు. కనీసం ఇప్పుడు ట్విట్టర్ లో రోజుకు 5000 ట్వీట్స్ కూడా చూసే వెసులుబాటు లేకుండా చేసాడు. ఒకప్పుడు బ్లూ టిక్ మార్క్ రావాలంటే చాలా పాపులర్ అవ్వాల్సి వచ్చేది. సెలెబ్రెటీలకు మాత్రమే ఈ బ్లూ టిక్ ఇచ్చే వాళ్ళు. కానీ ఎలాన్ మాస్క్ వచ్చిన తర్వాత ఎవరైనా బ్లూ టిక్ మార్కు ని పొందొచ్చు, కానీ నెలకి వెయ్యి రూపాయిలు కట్టాలి అంటూ ఒక సరికొత్త ఫీచర్ తెచ్చాడు. బ్లూ టిక్ మార్క్ ఉన్నవాళ్లకు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ వస్తాయి. లేని వాళ్లకు ఉన్న ఫీచర్స్ కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. అంటే ట్విట్టర్ ని వ్యసనం లాగ మార్చుకున్న నెటిజెన్స్ ని వ్యాపారం గా మార్చేసుకున్నాడు. ఇప్పుడు చివరికి డైలీ మెసేజిలకు కూడా లిమిట్ పెట్టేసాడు. ఒకప్పటిలాగా  అన్ లిమిటెడ్ మెసేజిలు పంపుకోవాలంటే కచ్చితంగా బ్లూ టిక్ మార్క్ ఉండాల్సిందే. ఇదంతా పక్కన పెడితే ట్విట్టర్ ని సూచించే పిట్ట లోగో ని కూడా తీసేసి ఇప్పుడు ‘X’ అనే లోగో ని పెట్టాడు. దీని అర్థం ఏంటో తెలియక నెటిజెన్స్ జుట్టు పీక్కుంటున్నారు.

ట్విట్టర్ సరికొత్త లోగో ‘X’ పై ఇండియన్ రైల్వేస్ షాకింగ్ ట్వీట్స్ :

అయితే  ఈ లోగో ‘X’ పై ఇండియన్ రైల్వేస్ ఒక ట్వీట్ వేసింది. వాళ్ళు మాట్లాడుతూ ‘మా ట్రైన్స్ కి కూడా ఈ లోగో X ని వాడుతాం. చివరి బోగి కి ఈ X కలర్ పెయింటింగ్ వేస్తాం , ఎందుకంటే అది చివరి బోగి అని అందరికీ అర్థం అవ్వడానికి ఉపయోగిస్తాము. కానీ ట్విట్టర్ లో X అంటే అర్థం ఏమిటి’ అని అడుగుతారు. అందరూ ఎవరికీ వారు దీని అర్థం ఏంటో చెప్పుకుంటూ వచ్చారు కానీ, అసలు అర్థం ఏమిటో మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే అత్యధిక శాతం మంది నెటిజెన్స్ చెప్పేది ఏమిటంటే, ఈ X లోగో అనేది స్వేచ్ఛ గా ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు అనే దానికి అర్థం అని చెప్తున్నారు. మరికొంతమంది అనేది ఏమిటంటే ట్విట్టర్ కి ఇదే ఆఖరి అంకం. అందుకే ఈ X లోగో ని ఉపయోగించారు అని అంటున్నారు, ఇలా ఎలాన్ మస్క్ పూర్తి వివరణ ఇచ్చే వరకు ఎవరికీ వారు తోచింది అనుకుంటూనే ఉంటారు.