రైలు ప్రయాణికులకు శుభవార్త

ఇక ట్రైన్ అశుభ్రంగా ఉందని ఎవరూ అనలేరు, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో తెలుసా? మన దేశంలో అతిపెద్ద రవాణా మార్గం రైల్వే. ప్రతిరోజూ చాలా రైళ్లు ప్రయాణిస్తుంటాయి. కొన్ని రైళ్లు చాలా దూరం వెళ్తాయి. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే, రైలులో ఛార్జీలు తక్కువ కనుక, చాలా మంది రైల్వే ప్రయాణాన్ని ఇష్టపడతారు. 169 సంవత్సరాల క్రితం తన సేవలను ప్రారంభించిన భారతీయ రైల్వే, దేశంలో అత్యంత చౌకైన రవాణా మార్గంగా పరిగణించబడుతుంది. 1,15,000 కి.మీ పొడవుతో […]

Share:

ఇక ట్రైన్ అశుభ్రంగా ఉందని ఎవరూ అనలేరు, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో తెలుసా?

మన దేశంలో అతిపెద్ద రవాణా మార్గం రైల్వే. ప్రతిరోజూ చాలా రైళ్లు ప్రయాణిస్తుంటాయి. కొన్ని రైళ్లు చాలా దూరం వెళ్తాయి. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే, రైలులో ఛార్జీలు తక్కువ కనుక, చాలా మంది రైల్వే ప్రయాణాన్ని ఇష్టపడతారు. 169 సంవత్సరాల క్రితం తన సేవలను ప్రారంభించిన భారతీయ రైల్వే, దేశంలో అత్యంత చౌకైన రవాణా మార్గంగా పరిగణించబడుతుంది. 1,15,000 కి.మీ పొడవుతో ఆసియాలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్ మనది.  భారతీయ రైల్వేలో రోజుకు దాదాపు 23 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇది ఆస్ట్రేలియా జనాభాకు సమానం. అయితే, రైళ్లు శుభ్రంగా లేవని, టాయిలెట్‌కి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందేనని, రైలు మొత్తం మూత్రం దుర్వాసన వస్తోందని భారత రైల్వేపై పలు ఫిర్యాదులు వస్తుంటాయి.

అధిక సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తున్న కారణంగా వీటిని సరిగ్గా నిర్వహించడం కుదరటం లేదు. అటువంటి సమస్యను పరిష్కరించడానికి భారతీయ రైల్వే శాఖ కొత్త సౌకర్యాలను ప్రవేశపెడుతుంది. ప్రస్తుతం ఉన్న టాయిలెట్ల స్థానంలో మెరుగైన సౌకర్యాలతో రూపొందించిన బయో టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు. వాసనను నియంత్రించేలా, ఆటోమేటిక్ శానిటేషన్ సిస్టమ్‌లతో మెరుగైన సౌకర్యాలు ప్రవేశపెట్టనున్నారు. 

రైళ్లలో ప్రస్తుతం ఉన్న టాయిలెట్ల స్థానంలో కొత్తగా రూపొందించిన, మెరుగైన సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేయబడిన వాటిని ఏర్పాటు చేస్తామని భారతీయ రైల్వే తెలిపింది. దీనికి సంబంధించి రైల్వేస్..  రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా కొత్తగా రూపొందించిన నాలుగు బయో- టాయిలెట్‌లతో కూడిన ఏసీ కోచ్‌ను ప్రవేశపెట్టింది. ఫీడ్‌బ్యాక్ పొందిన తర్వాత, అన్ని రైళ్లలో ఈ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని రైల్వే శాఖ తెలిపింది.

ఈ అప్‌గ్రేడ్ చేసిన మరుగుదొడ్లు.. ఆటోమేటిక్ హైజీన్, వాసన నియంత్రణ వ్యవస్థలతో అమర్చబడి ఉంటాయి. నీటి కుళాయిలు, సబ్బు డిస్పెన్సర్లు కూడా టచ్ ఫ్రీ, సెన్సార్ ఆధారితంగా ఉంటాయి. వీటిని దొంగిలించకుండా చూసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

వాష్‌రూమ్‌లతో పాటు, రైలు ప్రయాణంలో మెరుగైన సౌకర్యాలను అందించడానికి తలుపులు, గ్యాంగ్‌వేలు కూడా పునర్నిర్మించబడ్డాయి.

కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన టాయిలెట్లను పరిశీలించడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జనవరిలో న్యూఢిల్లీ స్టేషన్‌ను సందర్శించారు. అన్ని కోచ్‌లలో ఉన్న వాటి స్థానంలో.. ఆధునిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

రైల్వే శాఖ అభివృద్ధి చేసిన ఈ బయో టాయిలెట్లలో ఆటోమేటిక్ శానిటేషన్, వాసన నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి. రైల్వే ప్రయాణికులు త్వరలో మెరుగైన సౌకర్యాలను పొందనున్నారు. కొత్త డిజైన్లు, మెరుగైన సౌకర్యాలతో రైళ్లలో ఇప్పటికే ఉన్న టాయిలెట్లను అప్‌గ్రేడ్ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.

ఈ మార్పులు జరిగితే.. భారతీయ రైల్వే రూపురేఖలు మారిపోతాయి. అయితే ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎన్ని మార్పులు చేసినా ప్రజలలో మార్పు లేకపోతే దేశాభివృద్ధి సాధ్యం కాదు. అందువల్ల, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త మార్పులు జరిగినప్పుడు దేశ ప్రజలు క్రమశిక్షణతో, శుభ్రత పాటిస్తే..  వాటిని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మంచి పౌరులే దేశాభివృద్ధిని ముందుకు తీసుకొని వెళ్ళగలరు.