ప్రాణాలకు తెగించి 121 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో సాహసోపేతమైన కార్యాన్ని నిర్వహించింది, వాహీద్ సయ్యిడ్నా లోని ఉన్న ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ లో చిక్కుకున్న 121 మంది ప్రాణాలను కాపాడి సురక్షితంగా వారి నివాసాలకు చేర్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన సి – 130J హెవీ లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ ఆపరేషన్ లో రిస్క్ తీసుకొని ఇంతమంది ప్రాణాలను కాపాడింది. వీళ్ళు కాపాడిన వాళ్లలో ఎంతో మంది మెడికల్ ఎమెర్జెన్సీ అవసరం ఉన్న వాళ్ళు […]

Share:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో సాహసోపేతమైన కార్యాన్ని నిర్వహించింది, వాహీద్ సయ్యిడ్నా లోని ఉన్న ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ లో చిక్కుకున్న 121 మంది ప్రాణాలను కాపాడి సురక్షితంగా వారి నివాసాలకు చేర్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన సి – 130J హెవీ లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ ఆపరేషన్ లో రిస్క్ తీసుకొని ఇంతమంది ప్రాణాలను కాపాడింది. వీళ్ళు కాపాడిన వాళ్లలో ఎంతో మంది మెడికల్ ఎమెర్జెన్సీ అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. వీళ్ళు చేసిన ఈ గొప్ప పనికి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఈ సి – 130J ఎయిర్ క్రాఫ్ట్ రాత్రి సమయం లో ఈ రిస్క్ ఆపరేషన్ ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సమయం లో లైట్స్ కూడా పని చేయలేదట, అర్థ రాత్రి లైట్స్ లేకుండా ఒక ఎయిర్ క్రాఫ్ట్ 121 మంది ప్రాణాలను కాపాడింది అంటే పైలట్ ఎంత రిస్క్ కి తెగించాడో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో పైలట్స్ రాత్రి పూత కనిపించేందుకు నైట్ విజన్ గూగుల్స్ ని ఉపయోగించారని, ఒక చిన్న రన్వే లో ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న క్రూ మొత్తం ఎలక్ట్రో ఆప్టికల్/ ఇన్ఫ్రా రెడ్ సెన్సార్స్ ని ఉపయోగించి ఎయిర్ క్రాఫ్ట్ ని ఆ చీకటి సమయంలో నడిపారట. ఈ రన్వే కార్టోయంకి నార్త్ వైపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉందని, దీనిని ఏపీ సెంటర్ ఆఫ్ వయోలెన్స్ ఇన్ సూడన్ అని పిలుస్తారని తెలుస్తోంది. IAF సిబ్బంది మాట్లాడుతూ ‘అర్థ రాత్రి రన్వే లో ప్రయాణించడం, దానికి తోడు ఎయిర్ క్రాఫ్ట్ కి లాండింగ్ లైట్స్ పనిచేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము, ఆ సమయం లో రన్వే మీద ఏమైనా అడ్డంకులు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి ఆప్టికల్/ ఇన్ఫ్రా రెడ్ సెన్సార్స్ ని ఉపయోగించాము, అందువల్ల ఎయిర్ క్రాఫ్ట్ రన్వే మీద సురక్షితంగా లాండ్ అయ్యింది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఎయిర్ క్రాఫ్ట్ లాండింగ్ అవుతున్న సమయం లోన్ ఇంజిన్స్ ని నాన్ స్టాప్ గా రన్ చేసాము, ఆ సమయం లో మా కమాండోస్ ని ప్రయాణికులను కాపాడేందుకు నియమించాము, వాళ్ళకే కాదు వాళ్ళ లగేజ్ కి కూడా ఎలాంటి డ్యామేజీ కాకుండా చూసుకున్నాము. లాండింగ్ అయ్యేటప్పుడు మాత్రమే కాదు, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా మేము NVG సహాయం తీసుకోవాల్సి వచ్చింది, ఈ మొత్తం ఆపరేషన్ కి మాకు పట్టిన సమయం కేవలం రెండున్నర గంటలు మాత్రమే, ఇది IAF హిస్టరీ లోనే ఒక చరిత్ర’ అంటూ ఆ సిబ్బంది చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇంత ప్రమాదకర పరిస్థితిలో ఇలాంటి సాహసం చేసి ఇంతమందిని కాపాడినందుకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ పైలట్స్ ని ప్రశంసించారు. ఈ సమయం లో పైలట్స్ తెలివిగా వ్యవహరించి ఉండకపొయ్యుంటే , 121 మంది ప్రాణాలను కోల్పోయ్యే వాళ్ళు అని, ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పైలట్స్ అందరికీ నా సెల్యూట్ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇంత ప్రాణాలకు తెగించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలెట్లకు మనమూ సలాం కొట్టకుండా ఉండలేం కదా!