India : భారతదేశంలో పెరగనున్న ఎనర్జీ డిమాండ్

Energy demand in India: భారతదేశంలో గృహ ఎయిర్ కండిషన్ ( Air Conditioner) నడవడానికి కావాల్సిన విద్యుత్ డిమాండ్ 2050 సంవత్సరానికి 9 రెట్లు పెరగనుంది అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొన్నది. ఆఫ్రికా మొత్తం లో ఉన్న విద్యుత్ డిమాండ్ కంటే ఇది ఎక్కువ అని కూడా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వెల్లడించింది. తాజా ఎనర్జీ ఔట్ లుక్ లో రాబోయే మూడు దశాబ్దాల లో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్ విద్యుత్ […]

Share:

Energy demand in India: భారతదేశంలో గృహ ఎయిర్ కండిషన్ ( Air Conditioner) నడవడానికి కావాల్సిన విద్యుత్ డిమాండ్ 2050 సంవత్సరానికి 9 రెట్లు పెరగనుంది అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొన్నది. ఆఫ్రికా మొత్తం లో ఉన్న విద్యుత్ డిమాండ్ కంటే ఇది ఎక్కువ అని కూడా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వెల్లడించింది. తాజా ఎనర్జీ ఔట్ లుక్ లో రాబోయే మూడు దశాబ్దాల లో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్ విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అని IEA వెల్లడించింది. 

భారతదేశం యొక్క విద్యుత్ సరఫరా 2022 సంవత్సరంలో 42 ఎక్సా జౌల్స్ నుండి 2030 నాటికి 53.7 EJ కి, 2050 నాటికి 73 EJ కి పెరుగుతుంది అని అంచనా వేసింది. గత ఐదు దశాబ్దాల లో భారతదేశం 700 కంటే ఎక్కువ హీట్ వేవ్ సంఘటనలను చూసింది అని, వీటి కారణంగా 17,000 మంది ప్రాణాలు కోల్పోయారు అని IEA తెలిపింది. భారతీయ భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా దేశంలోని ఎయిర్ కండిషన్ వాడకం కూడా పెరుగుతున్నది. 

ఎయిర్ కండిషన్ ( Air Conditioner) అవసరాలను బట్టి విద్యుత్ వినియోగం (Energy demand in India) పెరుగుతూ ఉంటుందని పారిస్ ఆధారిత ఏజెన్సీ తెలిపింది. విద్యుత్ డిమాండ్ ఉష్ణోగ్రతను బట్టి మారుతూ ఉంటుంది. 25 డిగ్రీల సెల్సియస్ దాటినందున ఎయిర్ కండిషన్ ల వాడకం ఎక్కువగా ఉంటుంది. 

స్పేస్ కూలింగ్ కారణంగా విద్యుత్ వినియోగం 2019 మరియు 2022 మధ్య 21 శాతం పెరిగింది. నేడు దాదాపు 10 శాతం విద్యుత్ డిమాండ్ స్పేస్ కూలింగ్ అవసరాల నుండి వస్తుంది. 

2050 నాటికి ఇళ్ళల్లో వాడే టెలివిజన్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ లాంటి గృహోపకరణాల కంటే ఎయిర్ కండిషన్ కోసం విద్యుత్ డిమాండ్ 9 రెట్లు పెరుగుతుంది అని IEA తెలిపింది. 

కేవలం వీటి కోసం మాత్రమే స్తెటేడ్ పాలసీస్ సినారియో లో ( STEPS) లో 60 % విద్యుత్ డిమాండ్ పెరుగుదల కనిపించింది. బిల్డింగ్ కోడ్ అమలు, సమర్థవంతమైన ఉపకరణాల ఉపయోగం వలన ఈ డిమాండ్ కొంత వరకూ తగ్గే అవకాశం ఉంది. సోలార్ PV పగటి పూట విద్యుత్ అవసరాలను కొంత వరకూ తీరుస్తున్న అప్పటికి భారతదేశంలో రాత్రి సమయంలో కూడా ఎయిర్ కండిషన్ లకు విద్యుత్ డిమాండ్ (Energy demand in India) పెరిగింది. 

కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా 2070 నాటికి జీరో ఎమిషన్ (Zero Emission 

) లక్ష్యాన్ని అందుకోవాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్నది. భారతదేశ జనాభా పెరుగుదల స్థాయి మందగించిన అప్పటికీ కూడా పట్టణ జనాభా 74 శాతం పెరిగింది. పారిశ్రామిక ఉత్పత్తి వేగంగా విస్తరిస్తుంది. వీటి అన్నిటికీ ఎయిర్ కండిషన్ వాడకం చాలా వేగంగా పెరుగుతూ వస్తుంది. దీని ఫలితంగా 2050 నాటికి సహజ వాయువు డిమాండ్ 70 శాతం పెరుగుతుంది. సోలార్ పవర్(Solar Power) విద్యుత్ ఉత్పత్తుల్లో  భాగంగా ఉన్నా కూడా బొగ్గు కోసం డిమాండ్ 10 శాతం పెరుగుతుంది. ఫలితంగా 2050 నాటికి కర్భన ఉద్గారాలు కూడా 30% పెరుగుతాయి. 

అందుకే భారత్ క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రోత్సాహకాలు అందిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి విశేషంగా కృషి చేస్తుంది. ఫలితంగా క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ కూడా భారతదేశంలో వేగంగా పెరుగుతూ ఉంది.  2030 నాటికి 50 శాతం నాన్ ఫాజికల్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.