‘ఇండియా’ కూటమిపై మోడీ కీలక వ్యాఖ్యలు

 ‘సనాతన ధర్మం’వివాదంపై ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటోందని మండిపడ్డారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని బినాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎంకే నేత, తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే మోదీ నుంచి స్పందన వచ్చింది. ‘‘వారు (ప్రతిపక్షాల కూటమిని ఉద్దేశించి) […]

Share:

 ‘సనాతన ధర్మం’వివాదంపై ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటోందని మండిపడ్డారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని బినాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎంకే నేత, తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే మోదీ నుంచి స్పందన వచ్చింది.

‘‘వారు (ప్రతిపక్షాల కూటమిని ఉద్దేశించి) ఇటీవల ముంబయిలో సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష కూటమి ఇండియాకు నాయకుడు లేడు… ఘమండియా (దురహంకారి) కూటమిని నడిపేందు కోసం వ్యూహాలను వారు సిద్ధం చేసుకొని ఉంటారని అనుకుంటున్నా.  భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహం. వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన భారతీయుల విశ్వాసాలు, సంప్రదాయాలపై దాడి చేయాలని వారు నిర్ణయానికొచ్చారు. లోకమాన్య తిలక్‌, స్వామి వివేకానంద వంటివారికి స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటున్నారు’ అంటూ మోదీ మండిపడ్డారు.

సనాతన ధర్మంలో మహాత్మా గాంధీ గొప్ప ప్రాముఖ్యతను పొందారని, ఇది భారతదేశంలోని పురాతన, సాంప్రదాయ జీవన విధానాన్ని మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుందన్నారు. గాంధీ తన జీవితాంతం హిందూ పురాణాలలో పూజ్యమైన వ్యక్తి అయిన రాముడి నుండి నిరంతరం ప్రేరణ పొందాడని కూడా మోదీ పేర్కొన్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆయన మరణించే ముందు గాంధీ చెప్పిన చివరి మాటలు “హే రామ్”, ఇది రాముడితో మరియు అతని ఆధ్యాత్మికతతో ఆయనకున్న లోతైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ తెలిపారు.

అలాగే జీ20 శిఖరాగ్ర సదస్సు విజయంపై ఈ సందర్భంగా ప్రధాని స్పందించారు. ఈ విజయం 140 కోట్లమంది భారతీయులకు చెందుతుందన్నారు. ఇది ఈ దేశ సామూహిక శక్తికి  ఉదాహరణ అని చెప్పారు. మన దేశంలో భిన్నత్వం, సాంస్కృతిక సంపదను చూసి జీ20 నేతలు అబ్బురపడ్డారన్నారు.

అలాగే ఒక దేశం లేక రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనించాలంటే ప్రభుత్వాలు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని, అవినీతికి అడ్డుకట్ట వేయాలని చెప్పారు. అప్పట్లో మధ్యప్రదేశ్‌ను వెనకబడిన రాష్ట్రంగా చెప్పేవారన్నారు.  స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్‌ను సుదీర్ఘకాలం పాలించిన ప్రభుత్వాలు అవినీతి, నేరాలు తప్ప ఇంకేం ఇవ్వలేదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ‘ఈ రాష్ట్ర ప్రజలను కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు రూ.50 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం. ఈ మొత్తం కొన్ని రాష్ట్రాల బడ్జెట్‌ కంటే కూడా ఎక్కువ’ అని మోదీ తెలిపారు. 

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న మ‌ధ్య‌ప్రదేశ్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని బినా కార్యక్రమంలో రూ.50,700 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దీని తర్వాత, ప్రధాని మోడీ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించి వరుస అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌లో కార్యక్రమాన్ని ముగించిన తర్వాత, రైలు రంగ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌కు చేరుకుంటారు.

బీనా రిఫైనరీలో ‘పెట్రోకెమికల్ కాంప్లెక్స్’ నమూనాను ప్రధాని మోడీ పరిశీలించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన బినా రిఫైనరీని ప్రారంభించిన ప్రధాన మంత్రి, ఇది దాదాపు ₹ 49,000 కోట్లతో అభివృద్ధి చేయబడే అత్యాధునిక శుద్ధి కర్మాగారం. ఇది దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్రధాన మంత్రి ఆశాయాన్ని నెరవేర్చడానికి ఒక ముందడుగు కానుంది.