అభివృద్ధికి బాట‌లు వేస్తున్న అమెరికా, ఇండియా

ఆర్థిక మరియు అభివృద్ధి సమస్యలపై పరిష్కారానికి ఇండియా-యుఎస్ మధ్య మంచి సంబంధాలు ఏర్పడాలని, అంతేకాకుండా ఇరుదేశాల మధ్య మంచి ఉద్దేశాలు, ఒప్పందాలు ఉండడం ద్వారా, ఇరుదేశాల అభివృద్ధి సక్రమంగా జరుగుతుందని భావించి ఇప్పుడు యూఎస్ MDBల తమ వంతు కృషి చేయాలని నిర్ణయం తీసుకుంది. భారతదేశం-యునైటెడ్ స్టేట్స్ ఇటీవల అభివృద్ధి బ్యాంకులను బలోపేతం చేయడం, వాతావరణ చర్యను ప్రోత్సహించడం, ఇంధన పరిశ్రమలలో ఇంకాస్త అభివృద్ధిని సులభతరం చేయడం వంటి వివిధ రంగాల్లో తమ వంతు సహకారాన్ని పెంపొందించుకోవడానికి […]

Share:

ఆర్థిక మరియు అభివృద్ధి సమస్యలపై పరిష్కారానికి ఇండియా-యుఎస్ మధ్య మంచి సంబంధాలు ఏర్పడాలని, అంతేకాకుండా ఇరుదేశాల మధ్య మంచి ఉద్దేశాలు, ఒప్పందాలు ఉండడం ద్వారా, ఇరుదేశాల అభివృద్ధి సక్రమంగా జరుగుతుందని భావించి ఇప్పుడు యూఎస్ MDBల తమ వంతు కృషి చేయాలని నిర్ణయం తీసుకుంది.

భారతదేశం-యునైటెడ్ స్టేట్స్ ఇటీవల అభివృద్ధి బ్యాంకులను బలోపేతం చేయడం, వాతావరణ చర్యను ప్రోత్సహించడం, ఇంధన పరిశ్రమలలో ఇంకాస్త అభివృద్ధిని సులభతరం చేయడం వంటి వివిధ రంగాల్లో తమ వంతు సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంగీకరించాయి. 

నిర్మలా సీతారామన్: 

కేంద్ర ఆర్థిక మంత్రి, నిర్మలా సీతారామన్, US ట్రెజరీ సెక్రటరీ, జానెట్ యెల్లెన్‌తో G20 కార్యక్రమంలో తమ దేశాల  ప్రయోజనాల గురించి చర్చించడానికి, అంతేకాకుండా ఇంధనంలో కొత్త పెట్టుబడి అవకాశాలను సృష్టించేందుకు సమావేశమయ్యారు. అయితే ట్రాన్స్పోర్ట్ చైనా బలోపేతం చేయడం, అదే విధంగా ఎనర్జీ రీనోవేషన్పై దృష్టి సారించి, రెండు దేశాల మధ్య సహకారం అనేది ఆర్థిక, వాణిజ్య మరియు సాంకేతిక సమస్యలపై మరింత స్పష్టత కల్పించేందుకు సమావేశం అయింది.

కీలక అంశాలు చూసినట్లయితే: 

ఇంధన రంగంలో ప్రోత్సాహం: ఇంధనంలో కొత్త పెట్టుబడి అవకాశాలను సృష్టించేందుకు సమావేశమయ్యారు. అయితే ట్రాన్స్పోర్ట్ చైనా బలోపేతం చేయడం, అదే విధంగా ఎనర్జీ రీనోవేషన్పై దృష్టి సారించి, అభివృద్ధి వేగవంతం చేయడానికి తక్కువ మూలధన వ్యయాన్ని అందించడానికి మరియు ప్రైవేట్ పెట్టుబడిని పెంచడానికి పెట్టుబడి వేదిక అవకాశాన్ని కల్పిస్తుంది. 

మల్టిలేటరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లను (MDBలు) బలోపేతం చేయడం: 

MDBల పరిణామాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారతదేశాన్ని, US ప్రశంసించింది. G20లో భాగంగా రుణ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రస్తుతం మెరుగుపరచడంలో రెండు దేశాలు చురుకుగా నిమగ్నమై ఉన్నాయి. 

గ్లోబల్ టాక్స్ డీల్: 

భారతదేశం-యుఎస్ ప్రపంచ పన్ను ఒప్పందంపై ఒక ఒప్పందానికి రావడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యంత్రాంగం బహుళజాతి సంస్థలపై పన్ను విధించే దేశాల అధికారాన్ని పెంచడం. అదేవిధంగా ఈ సంస్థలపై ప్రపంచ కనీస పన్నును అమలు చేయడం అనేది ఉంటుంది. 

ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వివాదాలు: 

భారతదేశం-US తమ ఆరు WTO వివాదాలను పరిష్కరించుకున్నాయి, రెండు దేశాల మధ్య మెరుగైన వాణిజ్య సంబంధాలను పెంపొందించాయి. 

ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పిరిటీ (IPEF): 

ఆర్థిక సంబంధాలు మరియు స్థితిస్థాపకతను పెంపొందించుకునే IPEF కింద చైనాకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ షైన్ విషయంలో రిస్క్ చేయడానికి భారతదేశం మరియు US చర్చలు జరుపుతున్నాయి. 

సంపన్నమైన మరియు సమానమైన భవిష్యత్తు: 

భారతదేశం మరియు యుఎస్ మధ్య సహకారం ప్రపంచవ్యాప్తంగా సానుకూల మార్పుకు శ్రీకారం అని చెప్పుకోవాలి. ఒకరి నైపుణ్యం, మరొకరి వనరులను మరొకరు ఉపయోగించుకోవడం ద్వారా, హీరో దేశాలకు సంపన్నమైన మరియు సమానమైన భవిష్యత్తును సృష్టించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఆర్థిక వృద్ధి, స్థిరమైన అభివృద్ధిపై దృష్టి అనేది ఇరుదేశాల అభివృద్ధికి తోడ్పడుతుంది.జో బైడెన్ అమెరికా అధ్య‌క్షుడు అయ్యాక  భార‌త్‌తో అమెరికా స‌త్సంబంధాలు మెరుగుప‌డ్డాయి. ఇప్పుడు ఏ సాయం కావాల‌న్నా అమెరికా చేయ‌డానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు అమెరికా కూడా ఏదైనా సాయం కావాలంటే ఇండియా వైపు చూసే స్థాయిలో ఉంది మ‌న దేశం.