2030 నాటికి అతిపెద్ద వర్కింగ్‌ ఏజ్‌ పాపులేషన్‌ కంట్రీగా ఇండియా

2030 నాటికి జీ20 దేశాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా వర్కింగ్‌ ఏజ్ పాపులేషన్‌ (పనిచేసే వయసు ఉన్న జనాభా) కలిగిన దేశంగా ఇండియా నిలవనుంది. దీంతో పాటు  చైనా, ఇండోనేషియా కూడా ఉంటాయి. డ్రైవింగ్ సస్టయినబుల్‌ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ ఇన్ జీ20 ఎకానమీస్‌ నివేదికలో మెకిన్సే తెలిపింది. ఎకనామిక్‌ జియోగ్రఫీ తూర్పు దేశాల వైపు మారుతుండటాన్ని ప్రపంచం చూస్తోందని మెకిన్సే వెల్లడించారు. భవిష్యత్తులో ఆర్థిక కేంద్రాలు మారే అవకాశం ఉన్నప్పటికీ.. జీ20 ఆర్థిక వ్యవస్థలు  ప్రస్తుతం స్థిరంగా […]

Share:

2030 నాటికి జీ20 దేశాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా వర్కింగ్‌ ఏజ్ పాపులేషన్‌ (పనిచేసే వయసు ఉన్న జనాభా) కలిగిన దేశంగా ఇండియా నిలవనుంది. దీంతో పాటు  చైనా, ఇండోనేషియా కూడా ఉంటాయి. డ్రైవింగ్ సస్టయినబుల్‌ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ ఇన్ జీ20 ఎకానమీస్‌ నివేదికలో మెకిన్సే తెలిపింది. ఎకనామిక్‌ జియోగ్రఫీ తూర్పు దేశాల వైపు మారుతుండటాన్ని ప్రపంచం చూస్తోందని మెకిన్సే వెల్లడించారు. భవిష్యత్తులో ఆర్థిక కేంద్రాలు మారే అవకాశం ఉన్నప్పటికీ.. జీ20 ఆర్థిక వ్యవస్థలు  ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయన్నారు. 

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తీసుకున్న రుణాలు ఇప్పుడు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. జీ20 దేశాలకు రుణం నుంచి రుణాల నుచి స్థూల దేశీయోత్పత్తి నిష్పత్తి 300 శాతం కంటే ఎక్కువగా ఉంది. దేశాల్లో అసమానతలను ధనవంతులు 10 శాతం ఉండగా, దిగువన 50 శాతం ఉన్న జనాభా ఆధారంగా కొలుస్తారు. ఇది 20వ శతాబ్దం ప్రారంభమైనప్పటి నుంచి కంటే అత్యధిక స్థాయికి పెరిగిందని నివేదిక వెల్లడించింది.

జీ20 దేశాల్లో  ఇండియా, చైనా ప్రధాన వృద్ధి ఇంజిన్‌లుగా కొనసాగుతున్నాయి. అయితే, ఇతర దేశాలు చేరిక, వాటి స్థిరత్వంపై జీ20 ఇంకా బలంగా మారనుంది. యూరోపియన్‌ దేశాలు, జపాన్‌, కొరియా ఆయుర్దాయం నుంచి బ్యాంక్‌ అకౌంట్లు అత్యధిక మంది కలిగి ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తలసరి కార్బన్‌ ఉద్గారాలను అతి తక్కువగా కలిగి ఉండగా, ఐరోపాలోని దేశాలు జీడీపీలో కార్బన ఉద్గారాలు అతి తక్కువ నిష్పత్తిని కలిగి ఉన్నాయి.

ఎకనామిక్‌ ఎంపవర్‌‌మెంట్‌.. 

ప్రపంచ జనాభాలో అధిక భాగాన్ని గ్రోత్‌, ఇన్‌క్లూజన్‌, సస్టెనబిలిటీ వంటి కొలమానాలపై మెరుగైన స్కోర్‌‌ చేయడానికి ఆర్థిక సాధికారత అవసరం. ప్రపంచ బ్యాంకు  తీవ్ర దారిద్ర్య రేఖకు భిన్నమైంది. ఈ పరిశోధనలో వివరించిన ఆర్థిక సాధికారత భావన ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో యాక్సెస్‌  చేయడానికి మార్గాలను కలిగి ఉంటుందని మెకిన్సే చెప్పారు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం.. ప్రతి వ్యక్తికి రోజుకు 2.15 డాలర్ల సంపాదన ఉంటే తీవ్రమైన దారిద్ర రేఖ కింద ఉన్నట్లు అని పేర్కొంది. అయితే, మెకిన్సే ఇతర అధ్యయనాల ఉటంకిస్తూ, కొనుగోలు శక్తి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒక వ్యక్తికి రోజుకూ 12 డాలర్ల చొప్పున తన ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి ఉండాలి. ఒకవేళ ఇలా లేకపోతే తిరిగి  పేదరికంలో పడిపోయే ప్రమాదం కూడా ఉందని మెకిన్సే పేర్కొన్నారు. 

సర్దుబాటు ముఖ్యం..

ఈ ఆధునిక కాలంలో ఆర్థిక వ్యవస్థల కోసం, వారి అధిక జీవన వ్యయానికి సర్దుబాటు చేయడం ద్వారా ప్రతి వ్యక్తికి ఆర్థిక సాధికారత కింద వస్తారు. దీని ద్వారా ప్రతి వ్యక్తికి రోజుకు 47 డాలర్ల అవసరం అవుతాయి. మొత్తమ్మీద జీ20 ఆర్థిక వ్యవస్థల్లోని జనాభాలో సగానికి పైగా లేదా 2.6 బిలియన్ల మంది ఆర్థిక సాధికారత రేఖ కింద జీవిస్తున్నారని మెకిన్సే నివేదిక పేర్కొంది. ఇందులో 100 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో ఉన్నాఉ. 2.2 బిలియన్ల మంది ప్రజలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక సాధికారత రేఖ కింద నివసిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సుమారు 300 మిలియన్ల మంది ఉన్నారు. 

ఎంపవర్‌‌మెంట్‌ అంతరాన్ని తగ్గించాలే..

భారతదేశం, దక్షిణాఫ్రికాలోని జనాభాలోమూడు వంతుల కంటే ఎక్కువ మంది ఈ రేఖకు దిగువన నివసిస్తున్నారు. 2020 నాటికి భారతదేశ జనాభాలో 77 శాతం లేదా 1.07 బిలియన్ల ప్రజలు, దక్షిణాఫ్రికా జనాభలో 75 శాతం లేదా 4.4 మిలియన్ల ప్రజలు ఆర్థిక సాధికారత రేఖ కింద నివసిస్తున్నారు. చైనా, మెక్సికో, బ్రెజిల్‌, ఇండోనేషియా విషయంలో ఈ సంఖ్య 50 శాతం కంటే ఎక్కువ. ఐరోపా, ఉత్తర అమెరికాలో మరింత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో దాదాపు 20 నుంచి 30 శాతం మంది ఎంపర్‌‌మెంట్‌ రేఖకు దిగువన నివసిస్తున్నారు. జీ20 ఆర్థిక వ్యవస్థల్లో ఎంపర్‌‌మెంట్‌ అంతరాన్ని తగ్గించడానికి 2030 వరకు 21 ట్రిలియన్ల డాలర్ల మేరకు నిత్యవసరాలపై ఖర్చులో కాస్త పెరుగుదల అవసరమని తమ విశ్లేషణ సూచిస్తుందని మెకిన్సే చెప్పారు. ఇండియా విషయానికొస్తే, ఎంపర్‌‌మెంట్‌ అంతరాన్ని తగ్గించడానికి 2021, 2030 మధ్య మొత్తం అదనపు వ్యయం 5.3 ట్రిలియన్లు అవసరం అవుతాయి. ఇది ఈ దశాబ్ద జీడీపీలో 13 శాతంగా ఉంది. అదే సమయంలో చైనా కోసం 4.8 ట్రిలియన్లు అవసరమవుతాయని మెకిన్సే నివేదిక వెల్లడించింది.