ఖలిస్తాన్ ఉద్యమాన్ని తిప్పికొడుతున్న భారత్

నిజ్జర్ హత్యపై ట్రూడో చేసిన అభియోగంతో, భారత జాతీయ భద్రతా ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎదుర్కోవడం కొనసాగిస్తూనే ఉంది. అంతేకాకుండా, ఇక మీదట ఎటువంటి ఆరోపణలను, భారతదేశ ప్రజల మీద, కెనడాలో ఉన్న భారతీయుల మీద ఆంక్షలు సహించబోమని, ఇప్పటికే భారతదేశం కెనడాకు చెప్పడం జరిగింది.  ఆరోపణలను సహించబోము:  ఈ జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చిన మూడు రోజులలో సిక్కు ఫర్ జస్టిస్ కన్వీనర్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎక్కడా కనిపించకపోవడంతో.. ఖలిస్తానీ తీవ్రవాదులతో ప్రమేయం […]

Share:

నిజ్జర్ హత్యపై ట్రూడో చేసిన అభియోగంతో, భారత జాతీయ భద్రతా ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎదుర్కోవడం కొనసాగిస్తూనే ఉంది. అంతేకాకుండా, ఇక మీదట ఎటువంటి ఆరోపణలను, భారతదేశ ప్రజల మీద, కెనడాలో ఉన్న భారతీయుల మీద ఆంక్షలు సహించబోమని, ఇప్పటికే భారతదేశం కెనడాకు చెప్పడం జరిగింది. 

ఆరోపణలను సహించబోము: 

ఈ జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చిన మూడు రోజులలో సిక్కు ఫర్ జస్టిస్ కన్వీనర్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎక్కడా కనిపించకపోవడంతో.. ఖలిస్తానీ తీవ్రవాదులతో ప్రమేయం ఉందని ఫైవ్ ఐస్ కూటమికి స్పష్టమైంది. గురుద్వారా రాజకీయాలలో మునిగిపోయి, సిక్కు యువకులకు రాజకీయ ఆశ్రయం కల్పించే పేరుతో వారిని రాడికలైజర్ చేసేవాడు, పన్నూ పాకిస్తాన్ మరియు ఐరోపా దేశాలలో తీవ్రవాదులతో సంబంధాలతో నిజ్జర్‌ కీలక మద్దతుదారు.

ఏది ఏమైనప్పటికీ, ట్రూడో ఆరోపణలకు ఊరుకునేది లేదు అని తేల్చి చెప్పడం జరిగింది భారత జాతీయ భద్రతా స్థాపన. అంతర్జాతీయ చట్టాల పరిధిలో ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటుందని స్పష్టంగా తెలుస్తోంది. నిజ్జర్‌ను కాల్చిచంపడంతో మోదీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి, ఖలిస్తానీ రాడికల్‌లు విదేశాల్లో లేదా భారతదేశంలోని భారతీయ ఆస్తులకు ముప్పు కలిగిస్తే వారిపై చర్యలు తీసుకోవడం కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. అంతేకాకుండా నిజానికి భారతదేశం వెనక్కి తగ్గడం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీయనివ్వదని స్పష్టమవుతోంది.

అయితే దేశ పరువు తీయడానికి ట్రూడో చేసిన ప్రయత్నంపై భారత రాజకీయ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. 

బెదిరింపులకు దిగడమే కాకుండా, ప్రస్తుతం కెనడా, భారతదేశానికి ఒక వైపు నుంచి హాని కలిగించాలి అనుకునే కొన్ని దేశాలు చైనా, రష్యా, టర్కీ, పాకిస్తాన్ వంటి దేశాలతో జతకట్టడానికి ప్రయత్నిస్తుంది. ఒబామా పరిపాలనలో 2013 చట్టం ప్రకారం US కూడా అదే ప్రింప్షన్ సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది.

ఉగ్రవాది నిజ్జర్ హత్య: 

గత జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటుకు తెలియజేశారు. 

ఏదిఏమైనాప్పటికీ కెనడాలో ఒక అటాక్ ద్వారా ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగిందని తెలిసిన విషయమే. అయితే సరైన ఆధారాలు డాక్యుమెంట్స్ చూపించకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని జయశంకర్ అభిప్రాయపడ్డారు.. అంతేకాకుండా సరైన సమాచారం ఉంటే ముందడుగు వేయచ్చని ఎటువంటి ఆధారాలు లేకుండా, ముందుకు సాగడం కష్టమని మరొకసారి గుర్తు చేశారు జయశంకర్. మరి ముఖ్యంగా భారతీయులకు కొత్త వీసాలను సస్పెండ్ చేసినందుకు కెనడా ప్రభుత్వం మీద మండిపడ్డారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్.

ఎక్స్ పెంటగన్ అఫీషియల్ మాటల్లో: 

కెనడా తన దేశంలో చనిపోయిన ఉగ్రవాది నిజానికి కెనడాలోకి ఒక ఫ్రాడ్ పాస్పోర్ట్ ద్వారా వచ్చాడంటూ గుర్తు చేశారు. అదే విధంగా ఒక ఉగ్రవాది కోసం దేశాల మధ్య చిన్నపాటి యుద్ధం జరగడం సబబు కాదు అన్నారు.  ఎక్స్ పెంటగన్ అఫీషియల్ చెప్పుకొచ్చారు. ముందు ముందు జరిగే వాటి గురించి ఆలోచించకుండా, కెనడా ప్రధానమంత్రి భారతదేశం మీద ఒక ఉగ్రవాది మరణం గురించి ఆరోపణలు చేయడం చాలా మందికి నచ్చలేదని కూడా చెప్పుకొచ్చారు. ఒకవేళ యూఎస్ తన సపోర్ట్ ని కేవలం ఒకే దేశానికి ఇవ్వాలనుకుంటే అది కచ్చితంగా భారతదేశమే అవుతుందని గుర్తు చేశారు.