మెగా ఎయిర్ డ్రిల్స్ నిర్వహించనున్న ఇండియా.. 12 వైమానిక దళాలకు అనుమతి..

తాజాగా భారత వైమానిక దళం ఈ ఏడాది చివరి నాటికి 12 వైమానిక దళాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రకరకాల సన్నహాలు సిద్ధం చేస్తోంది.  ముఖ్యంగా ఇంటర్ ఆపరేబులిటీని మెరుగుపరచడం అలాగే ఒకదానికొకటి ఉత్తమ అభ్యాసాలను పొందడంతో పాటు మెగా ఎయిర్ డ్రిల్స్ లో పాల్గొనే దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించింది. ఇక ఈ విషయాన్ని తాజాగా అధికారులు బుధవారం వెల్లడించారు. తరంగ్ శక్తి అని పిలవబడే ఈ విన్యాసాలు దేశంలో […]

Share:

తాజాగా భారత వైమానిక దళం ఈ ఏడాది చివరి నాటికి 12 వైమానిక దళాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రకరకాల సన్నహాలు సిద్ధం చేస్తోంది.  ముఖ్యంగా ఇంటర్ ఆపరేబులిటీని మెరుగుపరచడం అలాగే ఒకదానికొకటి ఉత్తమ అభ్యాసాలను పొందడంతో పాటు మెగా ఎయిర్ డ్రిల్స్ లో పాల్గొనే దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించింది. ఇక ఈ విషయాన్ని తాజాగా అధికారులు బుధవారం వెల్లడించారు. తరంగ్ శక్తి అని పిలవబడే ఈ విన్యాసాలు దేశంలో నిర్వహించబడే అతిపెద్ద బహుళ జాతి వైమానిక విన్యాసంగా చెప్పబడుతోంది. అలాగే ఇందులో ఫైటర్ జెట్ లు,  మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్,  మిడ్ ఎయిర్ రీఫ్యూయలర్స్ అలాగే ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొనబోతున్నాయని క హెచ్ టీ స్పష్టం చేసింది. 

ఇకపోతే భారత వైమానిక దళానికి చెందిన ఫ్రెంచ్ మూలం అయిన రాఫెల్ యుద్ధ విమానాలు ఏప్రిల్ లో విదేశీ కసరత్తులలో అరంగేట్రం చేస్తూ భారత్లో ప్రాక్టీస్ చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ ఓరియన్ విన్యాసాలు ఏప్రిల్ 17 నుండి మే 5 వరకు ఫ్రాన్స్ లోని మాంటోడి మార్సన్, ఎయిర్ బేస్ లో అత్యంత అట్టహాసంగా జరిగింది. ఇక ఇక్కడ ఆతిధ్య దేశం తో పాటు యూఎస్, యూకే , జర్మనీ,  నెదర్లాండ్,  స్పెయిన్ , ఇటలీ, గ్రీస్ నుండి వైమానిక దళాలు  పాల్గొన్నాయి. ఇక్కడ నాలుగు భారత రాఫెల్ తో పాటు,  ఇద్దరూ సి 17 హెవీ లిఫ్టర్లు ఇద్దరూ ఎల్ ఎల్ 78 రీ ఫ్యూయల్లర్లు అలాగే 165 మంది వైమానిక యోధులు ఈ విన్యాసాలలో పాల్గొన్నారు. 

ఇకపోతే ఏప్రిల్ మే లో గ్రీస్లోని ఆండ్రావిడ విమానాశ్రయంలో హెల్లనిక్ ఎయిర్ఫోర్స్ నిర్వహించిన ఐ ఎన్ ఐ ఓ సి ఓ ఎస్ విన్యాసాలలో ఐఏఎఫ్ కూడా పాల్గొనింది. ఇక భారత వైమానిక దళంలో భాగంగా 4 ఎస్ యు థర్టీ ఎం కె ఐ ఫైటర్ జెట్ లు అలాగే రెండు సి 17 హెవీ లిఫ్టర్లతో ఈ విన్యాసంలో వైమానిక దళం పాల్గొనింది. అలాగే ఏప్రిల్ లో భారతదేశం యూఎస్ వైమానిక దళాలు దేశంలోని మూడు స్థావరాలలో కలైకుండ,  పనాగర్ మరియు ఆగ్రాలో జరిగిన విన్యాసాలను కూడా ఇండియా 2023లో భాగంగా నిర్వహించడం జరిగింది. ఇక కోప్ ఇండియా 2023లో కూడా భారత్ పాల్గొనడం జరిగింది.  అక్కడ ద్వైపాక్షిక విన్యాసంలో నాలుగు యుఎస్ఎఫ్ 15 ఈ స్ట్రైక్ ఈ ఫైటర్ జెట్ ను అలాగే రెండు సి 130 జే స్పెషల్ ఆపరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ లతో పాటు సి 17 లిఫ్టర్ కూడా పాల్గొన్నారు. ఐఏఎఫ్ విమానాలలో భాగంగా ఎస్ యు థర్టీలు రాఫెల్ తేజస్ జాగ్వార్ వంటి తేలిక యుద్దపాటి విమానాలు కూడా ఇందులో పాల్గొన్నాయి. అలాగే c17 మరియు సి 130 J లు కూడా ఈ విన్యాసాలలో పాల్గొనడం జరిగింది. మరి ఈసారి ఎటువంటి వైమానిక దళాలతో ఇతర దేశాల వారు పాల్గొనబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.