నేను ఇండియాలోనే ఉంటా: పాకిస్తాన్ యువతి

నా భర్త హిందూ కాబట్టి నేను కూడా హిందువులానే ఉంటా, నేను ఇప్పుడు ఇండియన్ నే అని అంటున్న సీమా హైదర్. ఇండియాకు చెందిన సచిన్ మీనా, సీమా హైదర్  జైలు నుంచి విడుదల అవ్వగానే కలిసి ఉండాలని అనుకుంటున్నారు.  అక్రమంగా ఇండియాకు వచ్చినందుకు అరెస్ట్ చేసిన పోలీసులు: అక్రమంగా ఇండియాకు వచ్చి సచిన్ మీనా దగ్గర ఉన్నందుకు సీమాను జూలై 4న పోలీసులు అరెస్ట్ చేశారు. నా భర్త హిందూ కాబట్టి నేను కూడా హిందూలానే […]

Share:

నా భర్త హిందూ కాబట్టి నేను కూడా హిందువులానే ఉంటా, నేను ఇప్పుడు ఇండియన్ నే అని అంటున్న సీమా హైదర్. ఇండియాకు చెందిన సచిన్ మీనా, సీమా హైదర్ 

జైలు నుంచి విడుదల అవ్వగానే కలిసి ఉండాలని అనుకుంటున్నారు. 

అక్రమంగా ఇండియాకు వచ్చినందుకు అరెస్ట్ చేసిన పోలీసులు:

అక్రమంగా ఇండియాకు వచ్చి సచిన్ మీనా దగ్గర ఉన్నందుకు సీమాను జూలై 4న పోలీసులు అరెస్ట్ చేశారు. నా భర్త హిందూ కాబట్టి నేను కూడా హిందూలానే ఉంటానని సీమ ఎన్ డి టివి తో చెప్పారు. ఈ లవ్ స్టోరీ బాలీవుడ్ మూవీ కంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది. కరోనా టైంలో వీళ్ళిద్దరూ పబ్జి ఆడుతూ ఒకరికొకరు దగ్గరయ్యారు. ఈ సంవత్సరం మార్చిలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ముందు నేను కరాచీ నుండి దుబాయ్ వెళ్లాను, తర్వాత నేపాల్ కి వచ్చి తర్వాత సచిన్ ని కలిసినట్టు తను తెలిపింది. 

తర్వాత తను పాకిస్తాన్ వెళ్ళింది, సచిన్ ఇండియా వచ్చాడు. పాకిస్తాన్ వెళ్లాక సీమాకు తన మొదటి భర్తతో గొడవ అయింది. తన ఫ్లాట్ అమ్ముకుని సీమా నేపాల్ కి వచ్చింది. ఈ సంవత్సరం మే లో ఆమె దుబాయ్ నుండి నేపాల్ వచ్చింది. తర్వాత ఖాట్మండు నుండి తన పిల్లలతో కలిసి ఢిల్లీలోకి వచ్చింది. సీమా పాకిస్తానీ అని చెప్పకుండా షెల్టర్ ఇచ్చినందుకు సచిన్ ని అరెస్ట్ చేశారు. జూలై 4న వీరిద్దరు పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. 

సీమ కి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్ ని సీమాని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్ననే సీమకు బెయిల్ వచ్చింది,తను ఇప్పుడు ఆఫీషియల్ గా ఇండియాలోకి రావాలని అనుకుంటుంది. నేను చాలా రోజులు జైల్లో ఉండాల్సి వస్తుందని భయమైందని సీమా తెలిపింది. సౌదీ అరేబియా నుండి సీమ మొదటి భర్త గులాం హైదర్ తన భార్యను తన దగ్గరికి పంపాలని ఒక వీడియోలో కోరాడు, కానీ తన భర్త దగ్గరికి వెళ్లడం ఇష్టం లేదని సీమా తెలిపింది. ఇంకా పాకిస్తాన్ వెళ్తే తనకు ప్రాణహాని ఉందని సీమ తెలిపింది.

ఇండియా, పాకిస్తాన్ వైరం ఏంటి ? :

పాకిస్తాన్ మొదటి నుండి ఇండియాకు శత్రువే. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ చాలా నష్టం జరిగేలా చేసింది. తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గానే ఉన్నారు. తర్వాత ఇండియా కూడా పాకిస్తాన్ తో బాగానే ఉంది. అదే టైంలో పాకిస్తాన్లో టెర్రరిజం పెరిగింది. పాకిస్తాన్లో బాంబు దాడులు బాగా పెరిగాయి. జనాలు ప్రాణ భయంతో బతికారు. 2007 సమయంలో ఇండియాను టార్గెట్ చేసి చాలా బ్లాస్టులు ప్లాన్ చేశారు. అందులో కొన్నింట్లో సక్సెస్ అయ్యారు. తర్వాత కూడా పాకిస్తాన్ లో మార్పు రాలేదు 26/11 తరహా దాడులు చేశారు. ఈ ఘటన తర్వాత ఇండియా పాకిస్తాన్ తో పూర్తిగా సంబంధాలు తెంచుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ తో ఇండియాకు ఏ విధమైన సంబంధం లేదు. చాలా విషయాల్లో పాక్ వాళ్ళు ఇండియాకు వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే పాకిస్తాన్ వాళ్లని ఇండియా వాళ్ళు అస్సలు నమ్మరు. ఈ పబ్జి ప్రేమికులను కూడా అందుకే ఎవరు నమ్మట్లేదు.