సమకాలీన సమయానికి అనుగుణంగా భారత్, గయానా భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటున్నాయి: విదేశాంగ మంత్రి జైశంకర్

భారతదేశం, గయానా దేశాలు సమకాలీన శకానికి అనుగుణమైన చక్కని భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటున్నాయని విదేశాంగ మంత్రి శ్రీ ఎస్. జైశంకర్ ఈ సందర్భంగా తెలిపారు. తన గయానా తొలి పర్యటనలో ఉన్న జైశంకర్, గయానా అధినాయకత్వంతో తన చర్చల గురించి, తమ భాగస్వామ్య స్థాయిని పెంపొందించే రెండు దేశాల ఉమ్మడి సంకల్పం గురించి కూడా ఇక్కడ ఉన్న భారతీయ సమాజానికి తెలియ పరిచారు. “ఈ రోజు సాయంత్రం గయానాలోని భారతీయ సమాజంతో మాట్లాడటం నాకెంతో సంతోషంగా ఉంది. ఉప […]

Share:

భారతదేశం, గయానా దేశాలు సమకాలీన శకానికి అనుగుణమైన చక్కని భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటున్నాయని విదేశాంగ మంత్రి శ్రీ ఎస్. జైశంకర్ ఈ సందర్భంగా తెలిపారు. తన గయానా తొలి పర్యటనలో ఉన్న జైశంకర్, గయానా అధినాయకత్వంతో తన చర్చల గురించి, తమ భాగస్వామ్య స్థాయిని పెంపొందించే రెండు దేశాల ఉమ్మడి సంకల్పం గురించి కూడా ఇక్కడ ఉన్న భారతీయ సమాజానికి తెలియ పరిచారు.

“ఈ రోజు సాయంత్రం గయానాలోని భారతీయ సమాజంతో మాట్లాడటం నాకెంతో సంతోషంగా ఉంది. ఉప రాష్ట్రపతి భరత్ జగదేవ్, స్పీకర్ మంజూర్ నాదిర్‌లు మాతో కలసి వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు. సమకాలీన యుగానికి అనువైన భాగస్వామ్యాన్ని మేము సృష్టిస్తున్నామని” ఆదివారం నాడు ప్రవాస భారతీయ సంఘాలతో మాట్లాడిన అనంతరం ఆయన పై విధంగా ట్వీట్ చేశారు.

ముందు రోజు, ఆయన భారతదేశంలో శిక్షణ పొందిన గయానీస్ సర్వీస్ అధికారులతో కూడా సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి జైశంకర్, గయానా  అధ్యక్షులు ఇర్ఫాన్ అలీతో కలిసి భారతదేశంలో తయారు చేసిన ఫెర్రీ MV MA లిషాను ప్రారంభించారు. “MA లిషా స్నేహానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ ఇంకా ఇంజనీర్స్ చేసిన ఫెర్రీ దాని ఆచరణాత్మక వ్యక్తీకరణ. ఈ ఫెర్రీ గయానాలో అనుసంధానాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది సుదూర లోతట్టు ప్రాంతాలకు రవాణా ఇంకా ఆర్థిక అవకాశాలను అందిస్తుంది,” అని ఆయన అన్నారు.

“గయానాలోని బెర్బిస్‌లో భారతీయుల రాకను తెలియజేసే ఉద్వేగభరితమైన స్మారక చిహ్నాన్ని సందర్శించాను. వారి కృషి ఇంకా విజయాలకు ప్రవాస భారతీయ ప్రజలకి నా ప్రశంసలను, అభినందనలను తెలియజేశాను. మాతో కలిసి వచ్చిన సాంస్కృతిక, యువజన మరియు క్రీడల మంత్రి చార్లెస్ రామ్‌సన్ జూనియర్‌కు ధన్యవాదాలు” అని ఆయన మరొక ట్వీట్‌లో తెలిపారు. విదేశాంగ మంత్రి జైశంకర్, మహాత్మా గాంధీ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. అంతేకాకుండా భారతదేశం-గయానా స్నేహం కోసం ఒక మొక్కను కూడా నాటారు. వాతావరణ అవగాహన గురించి గాంధీజీ ఇచ్చిన సందేశం సార్వత్రికమైనదని, అది కాలానికి అతీతమైనదని ఆయన కొనియాడారు.

మంత్రి జైశంకర్ ఇక్కడ ఉన్న రామ్ కృష్ణ ధార్మిక మందిర్‌లో ప్రవాస భారతీయులతో కలిసి ఉదయం పూట ప్రార్థనలు చేసి, అందులో పాల్గొన్నందుకు మానవ సేవల మంత్రి అయిన వింధ్యా వాసినీ పెర్సాద్‌కు తన ధన్యవాదాలు తెలుపుకున్నారు. “సంప్రదాయాలు, వారసత్వపు ఆచారాలు ఎలా చక్కగా పాటిస్తున్నారో చూడడం ఎంతో ఆనందంగా ఉంది” అని ఆయన అన్నారు. జైశంకర్ శుక్రవారం జార్జ్‌టౌన్‌లో తన జమైకన్ కౌంటర్ కమీనాజ్ స్మిత్‌తో కలిసి 4వ ఇండియా-కారికామ్ మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.

శుక్రవారం నాడు గయానా, పనామా, కొలంబియా మరియు డొమినికన్ రిపబ్లిక్‌లకు తన తొమ్మిది రోజుల పర్యటనను ప్రారంభించే ముందు, మంత్రి జైశంకర్ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో, సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌ను కలిశారు. ఆయన విదేశాంగ మంత్రిగా ఈ లాటిన్ అమెరికా ఇంకా కరేబియన్ దేశాలకు చేసిన తొలి పర్యటన ఇది.