నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి

మాజీ ప్రధాని అటల్ బిహారీకి నివాళులు అర్పిస్తూ, భారతదేశ పురోగతిని పెంపొందించడంలో, విస్తృత రంగాలలో 21వ శతాబ్దానికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని మోదీ అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షత వహిస్తూ ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. లోక్‌సభకు సభ్యునిగా ఎన్నికయ్యారు. మధ్యలో 3వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్‌ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు.  […]

Share:

మాజీ ప్రధాని అటల్ బిహారీకి నివాళులు అర్పిస్తూ, భారతదేశ పురోగతిని పెంపొందించడంలో, విస్తృత రంగాలలో 21వ శతాబ్దానికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని మోదీ అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షత వహిస్తూ ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. లోక్‌సభకు సభ్యునిగా ఎన్నికయ్యారు. మధ్యలో 3వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్‌ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 

అటల్ బిహారీ వాజ్పేయి గురించి మరింత: 

1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు.  ఈయన 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 నెలలు కేవలంపాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పాలనలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. అనారోగ్య కారణాల వల్ల అటల్ బిహారీ రాజకీయాల నుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చిి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ఇచ్చింది 

వాజపేయి కు 2001 లో అనారోగ్యం కారణంగా మోకాలుకు సంబంధించి  సర్జరీ అనేది బ్రీచ్ కాండీ వైద్యశాల ముంబైలో చేయించుకున్నాడు. 2009లో స్ట్రోక్ కారణంగా పక్షవాతానికి గురయ్యారు. మాట కూడా క్షీణించింది. ఆయన ఆరోగ్యపరిస్థితి మూలంగా తరచుగా వీల్ చైర్ కు పరిమితమై, మనుషులను గుర్తించలేని స్థితికి చేరారు అటల్ బిహారీ. ఆయన దీర్ఘకాలిక మధుమేహంతో పాటు డిమెంటియా వ్యాధితో బాధపడ్డారు. ఆ తర్వాత ఆయన ఏ బహిరంగ సమావేశంలోనూ హాజరు కాలేదు. అప్పుడప్పుడు వైద్య సేవల కోసం ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు వెళ్ళటం మినహాయించి బయటికి ఎక్కడికి వెళ్లేవారు కాదు.

1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన తన అన్నగారైన ప్రేమ్‌తో కలిసి 23 రోజుల పాటు అరెస్టయిన సందర్భంలో వాజపేయికి తొలిసారిగా రాజకీయాలతో పరిచయమేర్పడింది. ఏ విధమైన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొననని, క్విట్ ఇండియా ఉద్యమ నాయకులతో ఎటువంటి సంబంధాలు అసలు లేవని  హామీ యిచ్చిన తరువాతనే ఆయనను వదిలేశారు.

1951 లో క్రొత్తగా ప్రారంభమైన భారతీయ జనసంఘ్ అనే హిందూ దక్షిణ పక్ష రాజకీయపార్టీలో పనిచేయడానికి, దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజపేయిని ఆర్.ఎస్.ఎస్ లో భాగమైనట్లు తెలుస్తోంది. ఇది ఆర్.ఎస్.ఎస్ తో కలిసి పనిచేస్తున్న రాజకీయ పార్టీ. ఆయన ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పార్టీ ఉత్తర విభాగానికి జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాడు. 

వాజపేయి గ్వాలియర్లోనీ ఆర్య సమాజపు యువ విభాగమైన ఆర్య కుమార్ సభతో తన సామాజిక కార్యక్రమాలను ప్రారంభించి, 1944లో ఆ విభాగానికి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆయన 1939 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో కూడా చేరాడు. బాబా ఆమ్టే ప్రభావంతో ఆయన 1940-44 లలో అధికార్ల శిక్షణా కేంద్రానికి హాజరైయ్యారు. ఆయన 1947 లో ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ అయ్యారు. ఆయన దేశం విభజించిన తర్వాత జరిగిన అల్లర్ల వల్ల న్యాయశాస్త్ర విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశాడు. 2018 ఆగస్టు 16వ తేదీన ఆయన వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీకి వాజ్పాయ్ చేసిన కృషి చాలా కీలకమైనదని, అది తమ దేశానికి ఎంతో మేలు చేకూర్చింది తెలిపారు.