సముద్ర మట్టాల పెరుగుదలతో భారత్‌కు భారీ నష్టం

సముద్ర మట్టం నిరంతరం పెరగడం భారత్, చైనాలతో పాటు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, మాల్దీవులు తదితర దేశాలకు పెను ముప్పు అని డబ్ల్యూఎంఓ ప్రచురించిన నివేదిక పేర్కొంది. ముంబై, చెన్నై, కోల్‌కతాతో పాటు దేశంలోని ఇతర తీరప్రాంత నగరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదే జరిగితే భారత మ్యాప్‌‌లో ముంబై మాయం భారత్, చైనా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ దేశాలు.. పెరుగుతున్న సముద్ర మట్టం కారణంగా అత్యధిక ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని జెనీవాలోని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. కొత్త […]

Share:

సముద్ర మట్టం నిరంతరం పెరగడం భారత్, చైనాలతో పాటు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, మాల్దీవులు తదితర దేశాలకు పెను ముప్పు అని డబ్ల్యూఎంఓ ప్రచురించిన నివేదిక పేర్కొంది. ముంబై, చెన్నై, కోల్‌కతాతో పాటు దేశంలోని ఇతర తీరప్రాంత నగరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

అదే జరిగితే భారత మ్యాప్‌‌లో ముంబై మాయం

భారత్, చైనా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ దేశాలు.. పెరుగుతున్న సముద్ర మట్టం కారణంగా అత్యధిక ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని జెనీవాలోని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. కొత్త నివేదిక ‘ప్రపంచ సముద్ర మట్టం పెరుగుదల, చిక్కులు’ అనే నివేదికలో ఈ విషయాన్ని వివరించింది. సముద్ర మట్టం పెరుగుదల కారణంగా వివిధ ఖండాలలోని అనేక ప్రధాన నగరాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. వీటిలో షాంఘై, ఢాకా, బ్యాంకాక్, జకార్తా, ముంబై, మాపుటో, లాగోస్, కైరో, లండన్, కోపెన్‌హాగన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బ్యూనస్ ఎయిర్స్ మరియు శాంటియాగో ఉన్నాయి.

నివేదిక ఏం చెప్పింది

2013 నుండి 2022 వరకు ప్రపంచ సగటు సముద్ర మట్టం ప్రతీ ఏడాది 4.5 మిమీ పెరుగుతూ వస్తోంది. కనీసం 1971 నుండి సముద్ర మట్టం పెరుగుదల వెనుక మానవ తప్పిదాలే ప్రాథమిక కారణాలుగా ఉన్నాయి. 1901 నుంచి 2018 వరకు సముద్ర మట్టాలు సగటున 0.20 మీటర్ల మేర పెరిగాయి. ఈ సమయంలో 1901-1971 మధ్య సంవత్సరానికి 1.3 మిమీ, 1971-2006 మధ్య 1.9 మిమీ, 2006-2018 మధ్య 3.7 మిమీ పెరుగుదల కనబడటం అందరినీ కలవరపెడుతోంది. గ్లోబల్ వార్మింగ్ పారిశ్రామీకీకరణ ముందటి స్థాయి కంటే తక్కువకు అంటే, 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితమైనప్పటికీ సముద్ర మట్టాలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. అయితే ఈ పెరుగుదలకు ఉష్ణోగ్రత కూడా ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే ఉష్ణోగ్రతలో 2-డిగ్రీల పెరుగుదల సముద్ర మట్టాన్ని రెట్టింపు చేస్తుంది

1971-2018 మధ్య కాలంలో సముద్ర మట్టం పెరుగుదలలో 50% ఉష్ణోగ్రత కారణంగా, 22% హిమానీనదాల నుండి మంచు కరుగుదల, 20% మంచు షీట్ కరగడం, 8% భూమిలో మార్పుల కారణంగా సంభవించింది. 1992-1999, 2010-2019 మధ్య మంచు కరుగుదల రేటు నాలుగు రెట్లు పెరిగింది. 2006-2018లో గ్లోబల్ సగటు సముద్ర మట్టం పెరగడానికి మంచు, హిమానీనదాలు ప్రధాన కారణమయ్యాయి.

అది ఎలా ప్రభావం చూపుతుంది?

ఉష్ణోగ్రత 2-3 డిగ్రీల సెల్సియస్ పెరగడం కొనసాగితే గ్రీన్‌ల్యాండ్, వెస్ట్ అంటార్కిటిక్ మంచు పలకలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. దీంతో సముద్ర మట్టం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సముద్ర మట్టాల పెరుగుదల తీరప్రాంత పర్యావరణ, భూగర్భ జలాలు, వరదలు, తీరప్రాంత మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించడానికి దారి తీస్తుంది. ఇవన్నీ స్వల్ప, దీర్ఘకాలిక జీవనోపాధి, నివాసాలు, ఆరోగ్యం, శ్రేయస్సు, ఆహారం, నీటి భద్రతపై ప్రభావాన్ని చూపుతాయి.

హిందూ మహాసముద్రం అత్యంత వేగంగా వేడెక్కుతోంది 

భారత తీరం వెంబడి సముద్ర మట్టం గత శతాబ్దంలో (1900-2000) సంవత్సరానికి సగటున 1.7 మిమీ చొప్పున పెరుగుతోందని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నివేదించింది. సముద్ర మట్టం 3 సెం.మీ పెరుగుదల ఫలితంగా సముద్రం 17 మీటర్ల లోపలికి చొరబడవచ్చు. భవిష్యత్తులో దశాబ్దానికి 5 సెం.మీ. చొప్పున పెరిగి, శతాబ్దంలో సముద్రంలో కలిసిపోయే ఏరియా 300 మీటర్ల మేర ఉండవచ్చు. హిందూ మహాసముద్రంలో సముద్ర మట్టం సగం పెరగడానికి సముద్రం వేడెక్కడం ప్రధాన కారణంగా ఉంది. సముద్రపు వేడెక్కడం వల్ల పెరిగిన తేమ, వేడి కారణంగా తుఫానులు తీవ్రమవుతున్నాయి. తుఫాను ఉప్పెనలు సముద్ర మట్టం పెరుగుదలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇది వరదలకు దారి తీస్తుంది. తుఫానులు కూడా గతంలో కంటే ఎక్కువ వర్షాలను కురిపిస్తున్నాయి. కాలక్రమేణా సముద్ర మట్టాలు పెరిగి సముద్రనీరు సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి ప్రధాన నదుల డెల్టాలు తాగునీరుకు పనికిరాకుండా చేసే అవకాశం ఉంది.