రక్షణ శాఖకు భారీగా బడ్జెట్ కేటాయించిన మోడీ ప్రభుత్వం.. కొత్త ఆయుధాలు, టాక్స్ బెనిఫిట్

చైనా విసురుతున్న సవాళ్లను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆయుధాలు, ఇతర సామాగ్రిని మన సైనికులకు సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో కేటాయింపులు జరపడం సర్వసాధారణమైన విషయమే. లడక్ తూర్పు ప్రాంతంలో చైనా సైనికుల దుస్సాహసానికి పాల్పడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గల్వాన్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించినప్పుడు.. మన సైనికులు తరిమికొట్టారు. ఈ నేపథ్యంలో రక్షణ రంగానికి మెరుగైన […]

Share:

చైనా విసురుతున్న సవాళ్లను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆయుధాలు, ఇతర సామాగ్రిని మన సైనికులకు సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో కేటాయింపులు జరపడం సర్వసాధారణమైన విషయమే. లడక్ తూర్పు ప్రాంతంలో చైనా సైనికుల దుస్సాహసానికి పాల్పడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గల్వాన్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించినప్పుడు.. మన సైనికులు తరిమికొట్టారు. ఈ నేపథ్యంలో రక్షణ రంగానికి మెరుగైన సౌకర్యాలు, సమర్థవంతమైన ఆయుధాలను సమకూర్చాల్సిన అవసరం చాలానే ఉంది. చైనా విసురుతున్న సవాళ్లను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆయుధాలు, ఇతర సామాగ్రిని మన సైనికులకు సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మోడీ ప్రభుత్వం.. రక్షణ శాఖకు భారీగా బడ్జెట్ ను కేటాయించింది.

భారీగా నిధులు

పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. సైన్యానికి కొత్త ఆయుధాలు కొనుగోలు సహా.. సరిహద్దులో మౌలిక వసతుల కల్పనకు ఎక్కువగా ఖర్చు చేయడానికి బడ్జెట్ ను కేటాయించింది. అదే విధంగా కొత్తగా సైన్యంలో చేరే అగ్ని వీరులకు కార్పస్ ఫండ్ నుంచి కేటాయింపులపై పన్ను నుంచి మినహాయింపులు కూడా అందించింది. 

13 శాతం అధికంగా..

గత ఐదు సంవత్సరాలలో రక్షణ బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తోంది. ఈసారి కూడా గతేడాడితో పోలిస్తే 13 శాతం అధికంగా బడ్జెట్ ను కేటాయించింది. ముఖ్యంగా ఆయుధాల కొనుగోలు, సబ్ మెరైన్లు, డ్రోన్లు, యుద్ధ విమానాల సంఖ్యను పెంచుకునేందుకు అధికంగా నిధులను ఖర్చు చేయునుంది. మిలిటరీలో చేరే అగ్ని వీరులకు ట్యాక్స్ బెనిఫిట్ ను కల్పించింది.

బడ్జెట్ లో రక్షణ రంగానికి కేటాయింపులు

2023-24 వార్షిక బడ్జెట్లో డిఫెన్స్ సెక్టార్ కు ఈసారి ఏకంగా రూ.5.93 లక్షల కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. గత సంవత్సరంతో పోలిస్తే 13 శాతం ఎక్కువ. ఈ బడ్జెట్ లో కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, నౌకలు, ఇతర సైనిక సామాగ్రి కొనుగోలు చేసేందుకు రూ. 1.62 లక్షలు కేటాయించారు. అలాగే సిబ్బంది జీతాలు, నిర్వహణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 2.70 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

ఇంకా సరిహద్దుల్లో కనెక్టివిటీని పెంచేందుకు బార్డర్ రోడ్స్ సంస్థ బీఆర్ఓ కు ఈ బడ్జెట్ లో నిధులను పెంచారు. సరిహద్దుల్లో టన్నెల్స్, వంతెనలు నిర్మించేందుకు రూ. 4,500 కోట్లు కేటాయించారు. రక్షణ రంగంలో పరిశోధనల కోసం రూ.12.85 కోట్లు కేటాయించారు. ఇక దేశ తయారీ పరిశోధనలకు ప్రోత్సాహం అందించేలా 25 శాతం ప్రైవేటు సంస్థలు పొందేలా వీలు కల్పించారు. రక్షణ శాఖలోని ఉద్యోగుల పెన్షన్ ఖర్చు కోసం రూ.1.38 కోట్లు కేటాయించగా, సివిల్ సర్వీస్ కోసం రూ. 8.7 కోట్లు మూలధనం కేటాయించారు. ఇక రూ.13.83 కోట్లను మూలధనం కింద రిజర్వ్ చేశారు.