Rains: ఇండియాకు మరో రెండు తుఫానులు

గత కొద్ది రోజులుగా ఇండియాలో వర్షాలు (Rains) కురవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు (Rains) కురిసినా కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా రోజుల నుంచి వర్షాలు (Rains) లేవు. దీంతో పంటలు సాగు చేసిన అనేక మంది రైతులు నిరాశలో కూరుకుపోయారు. అరే వరుణ దేవుడు కరుణించడం లేదే అని కంగారు పడుతున్నారు. కానీ తాజాగా వాతావరణ శాఖ రైతులకు అదిరిపోయే శుభవార్తను చెప్పింది. ప్రస్తుతం వాతావరణ శాఖ చెప్పిన శుభవార్తతో అన్నదాతలు ఆనందంలో […]

Share:

గత కొద్ది రోజులుగా ఇండియాలో వర్షాలు (Rains) కురవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు (Rains) కురిసినా కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా రోజుల నుంచి వర్షాలు (Rains) లేవు. దీంతో పంటలు సాగు చేసిన అనేక మంది రైతులు నిరాశలో కూరుకుపోయారు. అరే వరుణ దేవుడు కరుణించడం లేదే అని కంగారు పడుతున్నారు. కానీ తాజాగా వాతావరణ శాఖ రైతులకు అదిరిపోయే శుభవార్తను చెప్పింది. ప్రస్తుతం వాతావరణ శాఖ చెప్పిన శుభవార్తతో అన్నదాతలు ఆనందంలో మునిగిపోయారు. నైరుతి రుతుపవనాల సమయంలో దేశంలో విపరీతంగా వర్షాలు (Rains) కురిశాయి. కానీ ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అంతగా చురుగ్గా లేకపోవడంతో చాలా రోజుల నుంచి వర్షాల (Rains) జాడ లేకుండా పోయింది. అయితే మొన్నీ మధ్యే నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమించాయి. దీంతో ఇక ఈశాన్య రుతుపవనాలే దిక్కని చాలా మంది అనుకుంటున్నారు. ఇలా అనుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో అన్నదాతలు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

వర్షాలు (Rains) లేక అల్లాడుతున్న అన్నదాతలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే కొన్ని రోజుల్లో వర్షాలు (Rains) పడతాయని తెలిపింది. అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతంలో జంట తుఫానులు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు, గతంలో 2018లో గమనించిన అరుదైన దృశ్యాలే ఇప్పుడు కనిపిస్తున్నాయని తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడబోయే తుఫానుకు ‘తేజ్’  (Tej) తుఫాను అని నాకరణం చేసింది. అదీ కాక బంగాళాఖాతంలో ఏర్పడబోయే తుఫానుకు ‘హమూన్’ (Hamoon) తుఫాను అని నామకరణం చేసింది. ఇది తొలి దశలో ఉందని ప్రకటించింది.

నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘తేజ్’ (Tej) తుఫాను మరింత బలపడింది. ఇది చివరికి ఒమన్ యొక్క దక్షిణ తీరం మరియు దానిని ఆనుకుని ఉన్న యెమెన్ వైపు కదులుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) (IMD) తెలిపింది. అదే సమయంలో హామూన్ (Hamoon) తుఫాను కూడా తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ఇది ఆంధ్ర తీరానికి దగ్గరగా కదులుతోందిని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అక్టోబరు 23 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుఫాను అభివృద్ధి చెందితే దానికి హమూన్ (Hamoon) అని పేరు పెట్టనున్నారు. ఈ వ్యవస్థ అక్టోబరు 24 నాటికి తుఫానుగా మారే ప్రముఖ సంకేతాలను చూపించిందని వాతావరణ సూచనలు తెలిపే ప్రైవేట్ కంపెనీ ‘స్కైమెట్’ పేర్కొంది. ఈ రెండు తుఫానులు వాతావరణంపై పెద్దగా ప్రభావాన్నిచూపవని వాతావరణ శాఖ పేర్కొంది. చెన్నై మరియు తమిళనాడు తీర ప్రాంతాలలో తుఫానులు దూరంగా కదులుతున్నందున స్వల్పంగా వాతావరణ మార్పు ఉండవచ్చని సూచించింది. అయితే, ప్రైవేట్ వాతావరణ అంచనాల ప్రకారం, సాయంత్రం ఉరుములతో కూడిన వర్షాలు కేరళ (Kerala) మరియు తమిళనాడు (Tamil Nadu) లోని కొన్ని ప్రాంతాలలో కురిసే అవకాశం ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫానులకు నామకరణం చేయడానికి అనుసరించిన ఫార్ములా ఆధారంగా తుఫానులకు పేరు పెట్టారు. ఎటువంటి తుఫానులు పుట్టుకొచ్చినా కానీ వాటికి నామకరణం చేయడానికి ఒక పద్ధతి అంటూ ఉంది. తీరం వెంబడి ఉండే కొన్ని దేశాలు తుఫానులకు కొన్ని పేర్లను సూచిస్తుంటాయి. వాటిని బట్టి ఈ తుఫానులకు పేర్లను ప్రతిపాదిస్తారు. తీర రేఖకు ఇరువైపులా ఉష్ణమండల తుఫానులు ఏకకాలంలో సంభవించడం అరుదైన విషయం. అయితే.. ఈ తుఫానులు తేజ్ మరియు హమూన్ 2,500 కి.మీ దూరం ద్వారా వేరు చేయబడతాయి. మరియు ప్రత్యేక మార్గాల్లో ప్రయాణిస్తాయి. ఈ వార్తతో అన్నదాతలు ఆనందంగా ఉన్నారు. హమ్మయ్యా.. చాలా రోజుల తర్వాత తుఫానులు ఎంట్రీ ఇచ్చాయని అన్నదాతలు అనుకుంటున్నారు. వర్షాలు (Rains) లేక అనేక రోజుల నుంచి ఇబ్బందులు పడ్డామని ప్రస్తుతం వర్షాలు (Rains) కురిస్తే ఆ ఇబ్బందులు తొలిగిపోతాయని చెబుతున్నారు.