G20 ఆహ్వానంలో ఇండియా-భారత్ పేర్ల కాంట్రవర్సీ

ఇవాళ మన భారతదేశం తరఫున G20 ఆహ్వాన పత్రికలలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులుగా, ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని వాడడంపై ప్రస్తుతం కాంట్రవర్సీ నడుస్తోంది. ఈ నెలాఖరులో జరగనున్న ఐదు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.  ఇండియా-భారత్ పేర్ల కాంట్రవర్సీ:  విదేశీ ప్రతినిధుల కోసం ఉద్దేశించిన G20 బుక్‌లెట్‌లో కూడా ఇండియాకి బదులుగా “భారత్” అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. “భారత్, ప్రజాస్వామ్యానికి తల్లి”. […]

Share:

ఇవాళ మన భారతదేశం తరఫున G20 ఆహ్వాన పత్రికలలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులుగా, ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని వాడడంపై ప్రస్తుతం కాంట్రవర్సీ నడుస్తోంది. ఈ నెలాఖరులో జరగనున్న ఐదు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. 

ఇండియా-భారత్ పేర్ల కాంట్రవర్సీ: 

విదేశీ ప్రతినిధుల కోసం ఉద్దేశించిన G20 బుక్‌లెట్‌లో కూడా ఇండియాకి బదులుగా “భారత్” అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. “భారత్, ప్రజాస్వామ్యానికి తల్లి”. భారత్ అనేది భారతదేశం అధికారిక పేరు. ఇది 1946-48 చర్చల్లో కూడా రాజ్యాంగంలో ప్రస్తావించడం జరిగింది అంటూ బుక్‌లెట్ పేర్కొంది. US అధ్యక్షుడు జో బిడెన్, UK ప్రధాన మంత్రి రిషి సునక్ మరియు ఇతర అగ్ర ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇవ్వడానికి దేశం సిద్ధమవుతున్న ఈ సందర్భంలో, భారత్ పదం వాడకం, కొన్ని మార్పులకు దారి తీయొచ్చు అని పలు వర్గాలు వాపోతున్నాయి. 

బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా గత రాత్రి కూడా ప్రధాని ఇండోనేషియా పర్యటనపై షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ లెటర్ మీద కూడా “భారత్ ప్రధాన మంత్రి” అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 9 మరియు 10 తేదీల్లో జరిగే G20 సమ్మిట్‌లో భారత అధికారుల గుర్తింపు కార్డులపై కూడా ఇప్పుడు ‘భారత్ – అఫీషియల్’ అని ప్రింట్ చేయడం జరుగుతుంది. 

ప్రతిపక్ష నేతల ఆరోపణ: 

ఈ నెలాఖరులో సెప్టెంబరు 18న ప్రారంభమయ్యే ఐదు రోజుల పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో, భారతదేశం పేరు ఇండియా నుంచి భారత్ అనే పేరుకు మార్చే తీర్మానాన్ని, ప్రభుత్వం ముందుకు తీసుకురావచ్చని పలు వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక సమావేశానికి ప్రభుత్వం ఎటువంటి ఎజెండాను ప్రకటించకపోవడమే దీనికి కారణం అంటూ పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ చర్యపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించి, భారతదేశాన్ని రెండు ముక్కలుగా చీల్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని ప్రతిపక్ష భారత కూటమి సభ్యులు ఆరోపించారు. 

తమ కూటమి ఏర్పాటుపై జీర్ణించుకోలేని ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం, తమ వైపు నుంచి ఎత్తుగడ వేస్తుందని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నారు. ప్రతిపక్ష కూటమి, తమ కూటమి పేరుని ‘భారత్‌’గా పిలుచుకోవాలని నిర్ణయించుకుంటే, అధికార పార్టీ దేశం పేరును ‘బీజేపీ’గా మారుస్తుందా అని ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నారు. దేశానికి సంబంధించిన పేరు ‘ఇండియా’పై అధికార పార్టీ ఎందుకు కలవరపడుతుందో అర్థం కావడం లేదు అని NCP చీఫ్ అన్నారు. 

అయితే బిజెపి నాయకులు “భారత్” నామకరణాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత దేశ పేరుని ఎలా మారుస్తారని మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. “భారత్” అనే పదం రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో కూడా ఉందని, “భారత్ అంటే, రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండడం” అని చెబుతోంది అని బిజెపి ప్రభుత్వం మరొకసారి గుర్తు చేస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముర్ కూడా ‘భారత్’కి ప్రాధాన్యత ఇచ్చారు. భారతదేశం పేరుని భారత్ అని పలకడం అలవాటుగా మార్చుకోవాలని, మనం రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు భారత్ అనే పదాన్ని ఉపయోగించడం మంచిది అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఇండియా పదానికి బదులుగా ‘భారత్’ను ఉపయోగించాలనే నిర్ణయం అనేది చాలా మంచి పెద్ద ప్రకటన అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇది ఎప్పుడో జరగాల్సిన మార్పు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.