Narendra Modi: 2040 నాటికి భారతీయుడిని చంద్రుడి పైకి పంపాలి

చంద్రుడి(Moon) దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌక చంద్రయాన్‌-3(Chandrayaan 3)ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా అవతరించిన ఇండియా(India) అంతరిక్షం, పరిశోధనలు విషయంలో మరింత వేగం పెంచింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) సర్కార్‌ సరికొత్త వ్యూహంతో దూసుకుపోనుంది. 2040 నాటికి చంద్రుని(Moon)పైకి వ్యోమగామి(Astronaut)ని పంపే లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తల(scientists)కు ఆదేశాలు జారీ చేశారని కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో (ISRO)చరిత్రలో 2023 సంవత్సరం […]

Share:

చంద్రుడి(Moon) దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌక చంద్రయాన్‌-3(Chandrayaan 3)ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా అవతరించిన ఇండియా(India) అంతరిక్షం, పరిశోధనలు విషయంలో మరింత వేగం పెంచింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) సర్కార్‌ సరికొత్త వ్యూహంతో దూసుకుపోనుంది. 2040 నాటికి చంద్రుని(Moon)పైకి వ్యోమగామి(Astronaut)ని పంపే లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తల(scientists)కు ఆదేశాలు జారీ చేశారని కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో (ISRO)చరిత్రలో 2023 సంవత్సరం చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఇస్రో చంద్రయాన్ 3(Chandrayaan 3), ఆదిత్య ఎల్1(Aditya L1) మిషన్లను విజయవంతం చేసింది . ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 శాటిలైట్‌ను అంతరిక్ష ప్రయాణం సజావుగా సాగుతోంది. త్వరలో అది లాగ్రాంజ్ పాయింట్‌ను చేరుకోనుంది. ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు ఈ రెండింటి వద్దే ఆగట్లేదు. మరో సంచలన మిషన్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. అదే- గగన్‌యాన్(Gaganyan.). మానవ సహిత ప్రయోగం ఇది. మనుషులను అంతరిక్షంలోకి పంపించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్. 2024 మార్చి నాటికి ఇది కార్యరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 21వ తేదీన గగన్‌యాన్ శాటిలైట్‌(Gaganyan satellite)ను అంతరిక్షంలోకి(Space) ప్రయోగించనుంది ఇస్రో.

ప్రస్తుతం గగన్‌యాన్‌(Gaganyan)కు సంబంధించిన ప్రయోగాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రయోగం కోసం జీఎస్ఎల్వీ ఎంకే 3(GSLV MK3) రాకెట్‌ను వినియోగించనుంది. రాకెట్ క్రయోజెనిక్ ఇంజిన్‌ సామర్థ్యాన్ని ఇస్రో(ISRO) పరీక్షించింది కూడా. తమిళనాడులోని మహేంద్రగిరి వద్ద గల లిక్విడ్ ప్రొపల్షన్ రీసెర్చ్ సెంటర్‌లో రాకెట్ ఇంజిన్‌ సీఈ-20ని 720 సెకెండ్ల పాటు మండించింది. ఈ టెస్ట్ విజయవంతంమైనట్లు తెలిపింది.  గగన్‌యాన్‌లో భాగంగా మనుషులను లో- ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెడుతుంది ఇస్రో. భూఉపరితలంపై నుంచి 400 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్తారు. అయిదు నుంచి ఏడు రోజుల పాటు అక్కడే గడుపుతారు. అనంతరం మళ్లీ భూమిపైకి తిరిగి వస్తారు. క్రూ మాడ్యుల్ అంటే.. మనుషులను తీసుకెళ్లడానికి వీలుగా ఉండే క్యాబిన్, సర్వీస్ మాడ్యుల్ అంటే.. రెండు లిక్విడ్ ప్రొపెల్లంట్ ఇంజిన్స్‌‌ను పేలోడ్స్‌గా పంపిస్తుంది.

ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తరువాత మానవ సహిత మిషన్‌ను చేపట్టిన నాలుగో దేశంగా నిలుస్తుంది భారత్(India). మనుషులను అంతరిక్షంలోకి పంపించడం.. మళ్లీ వారిని విజయవంతంగా భూమిపైకి తీసుకుని రావడం, అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సేవలను అందించడం.. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఇంకొద్ది రోజుల్లో గగన్‌యాన్ మిషన్‌(Gaganyan Mission)ను ప్రయోగించాల్సి ఉన్న నేపథ్యంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pm Modi) అత్యున్నత స్థాయి సమక్ష సమావేశాన్ని నిర్వహంచారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్, ఇతర ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

గగన్‌యాన్ మిషన్‌(Gaganyan Mission) వివరాలను వారు మోదీకి వివరించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ 3 అన్‌క్రూడ్ మిషన్‌లతో సహా సుమారు 20 టెస్టింగ్స్ పూర్తయ్యాయని తెలిపారు. 2025 నాటికి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు పూనుకుంటామని ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలు తెలిపారు.కాగా, టీవీ-డి1 టెస్ట్ ఫ్లైట్‌ ఆక్టోబర్ 21వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య షెడ్యూల్ చేసినట్టు ఇస్రో ఒక ట్వీట్‌లో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌(Satish Dhawan Space Centre)లో దీనిని షెడ్యూల్ చేశారు. వచ్చే ఏడాది చివర్లో మానవ అంతరిక్షయానంలో భారతీయ వ్యోమగాములను ఉంచడానికి షెడ్యూల్ చేసిన సిబ్బంది మాడ్యూల్‌ను పరీక్షించడానికి ఇది సహాయపడుతుంది. టీవీ-డి1 టెస్ట్ ఫ్లైట్ తరువాత మరో మూడు టెస్ట్ వెహికల్ మిషన్‌లను నిర్వహిస్తామని ఎస్.సోమనాథ్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారికి కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్‌ను నెలకొల్పాలని ఆదేశించారు. 2,040 నాటికి మొట్ట మొదటి భారతీయుడిని చంద్రునిపైకి పంపించాలని సూచించారు. అలాంటి ప్రతిష్ఠాత్మక మిషన్‌లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.