కోవిడ్ 19 అప్డేట్: రానున్న 10 రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం

భారత దేశంలో కరోనా వైరస్ యొక్క కొత్త వేరియెంట్ కనుగొన్నారు. అయితే ఇది అంత  ప్రాణాంతక వేరియంట్ కాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క ఉన్నత వర్గాలు బుధవారం తెలిపాయి. భారతదేశం యొక్క అపెక్స్ మెడికల్ రీసెర్చ్ ఏజెన్సీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), XBB.1.16 ఓమిక్రాన్ సబ్‌వేరియంట్‌ను వేరు చేసి, వ్యాక్సిన్ సామర్థ్యాన్ని అంచనా వేసిందని ఓ అధికారి వివరించారు. “కోవిడ్ యొక్క XBB సబ్‌వేరియంట్ వేరుచేయబడింది. వ్యాక్సిన్ సామర్థ్యాన్ని అంచనా వేయడం […]

Share:

భారత దేశంలో కరోనా వైరస్ యొక్క కొత్త వేరియెంట్ కనుగొన్నారు. అయితే ఇది అంత  ప్రాణాంతక వేరియంట్ కాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క ఉన్నత వర్గాలు బుధవారం తెలిపాయి.

భారతదేశం యొక్క అపెక్స్ మెడికల్ రీసెర్చ్ ఏజెన్సీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), XBB.1.16 ఓమిక్రాన్ సబ్‌వేరియంట్‌ను వేరు చేసి, వ్యాక్సిన్ సామర్థ్యాన్ని అంచనా వేసిందని ఓ అధికారి వివరించారు.

“కోవిడ్ యొక్క XBB సబ్‌వేరియంట్ వేరుచేయబడింది. వ్యాక్సిన్ సామర్థ్యాన్ని అంచనా వేయడం జరిగింది. ఈ వేరియంట్ అంత ప్రాణాంతకం కాదు,” అని ఓ అధికారి తెలిపారు.

భారతదేశంలో 1,000 మందికి ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంటే..  కనీసంఒక్క మరణం కూడా సంభవించలేదని ఆయన అన్నారు. “వైరస్ యొక్క ప్రాణాంతకత గణనీయంగా తగ్గింది. ఇది ఇంతకు ముందు ఉన్న దానిలో సగం కూడా లేదు అని ఆయన పేర్కొన్నారు.

అయితే, మరికొన్ని రోజులు ఈ కేసులు పెరుగుతూనే ఉంటాయని అధికారులు తెలిపారు. “రాబోయే ఎనిమిది నుండి పది రోజుల వరకు మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సాధారణంగా కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత, మరుసటి నెలలో తగ్గడం మనం చూశామని ఆయన అన్నారు. అయితే, కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుత పెరుగుదలను “వేవ్” అని పిలవలేమని ఆ అధికారి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌లను కొనుగోలు చేయదు. అయితే గత కొన్ని నెలలుగా బూస్టర్‌ల డిమాండ్ చాలా మందకొడిగా ఉన్నందున అవసరానికి అనుగుణంగా తమ సొంత స్టాక్‌లను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

ముందు రోజుతో పోలిస్తే భారతదేశంలో బుధవారం రోజువారీ కోవిడ్ -19 కేసులలో మరింత పెరిగింది. 7,830 కొత్త కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం సంఖ్య 4,47,76,002కి చేరుకుంది. ఇక ఈ ఒక్క రోజులోనే 40 శాతం కేసులు పెరిగాయి. ఇక మంగళవారం మొత్తం 5,676 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. 40,215 టోటల్ యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

భారతదేశంలో 13 ఏప్రిల్ 2023 నాటికి, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ధృవీకరించబడిన కేసులలో 4,47,76,002 కేసులతో భారతదేశం రెండవ స్థానంలో ఉండగా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి స్థానంలో ఉంది. 

ఇక భారతదేశంలో మొదటి COVID-19 కేసులు.. 30 జనవరి 2020న కేరళలోని మూడు పట్టణాలలో నమోదయ్యాయి, మహమ్మారి కేంద్రంగా ఉన్న వుహాన్ నుండి తిరిగి వచ్చిన ముగ్గురు భారతీయ వైద్య విద్యార్థులలో ఈ వైరస్ బయటపడింది. కేరళలో మార్చి 23న దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మార్చి 25న పూర్తి స్థాయి లాక్‌డౌన్‌లు ప్రకటించారు. 

భారతదేశం.. తన టీకా కార్యక్రమాన్ని 16 జనవరి 2021న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (కోవిషీల్డ్) మరియు స్వదేశీ కోవాక్సిన్‌తో ప్రారంభించింది. తరువాత, స్పుత్నిక్ V మరియు మోడర్నా వ్యాక్సిన్ అత్యవసర ఉపయోగం కోసం కూడా ఆమోదించబడ్డాయి. జనవరి 30, 2022న, భారతదేశం సుమారు 1.7 బిలియన్ డోసుల వ్యాక్సిన్‌లను అందించిందని, 720 మిలియన్ల మందికి పైగా ప్రజలు పూర్తిగా టీకాలు వేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.