Income Tax Raid: నాలుగు రాష్ట్రాలలో ఇన్కమ్ టాక్స్ సోదాలు

ఎక్కడ చూసినా అవినీతి (Corruption) డబ్బు (Money) మరీ ఎక్కువ అయిపోతుంది. ఉన్నవాడు ఆక్రమంగా డబ్బు (Money) సంపాదించడానికి చూస్తుంటే, లేనివాడు ఇంకా లేనివాడిగా మారిపోతున్న క్రమం కనిపిస్తోంది. ఇలాంటి అవినీతి (Corruption)పరులను పట్టుకోవడానికి ముఖ్యంగా ఇన్కమ్ టాక్స్ (Income Tax) డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు అకస్మాత్తుగా తెలియకుండా సోదాలు (Raids) నిర్వహిస్తూ ఉంటుంది. ఇటీవల ఇన్కమ్ టాక్స్ (Income Tax) డిపార్ట్మెంట్ వాళ్లు పలు రాష్ట్రాలలో తనిఖీలు(Raids) నిర్వహించగా, సుమారు రూ. 94 కోట్లకు పైగా డబ్బు […]

Share:

ఎక్కడ చూసినా అవినీతి (Corruption) డబ్బు (Money) మరీ ఎక్కువ అయిపోతుంది. ఉన్నవాడు ఆక్రమంగా డబ్బు (Money) సంపాదించడానికి చూస్తుంటే, లేనివాడు ఇంకా లేనివాడిగా మారిపోతున్న క్రమం కనిపిస్తోంది. ఇలాంటి అవినీతి (Corruption)పరులను పట్టుకోవడానికి ముఖ్యంగా ఇన్కమ్ టాక్స్ (Income Tax) డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు అకస్మాత్తుగా తెలియకుండా సోదాలు (Raids) నిర్వహిస్తూ ఉంటుంది. ఇటీవల ఇన్కమ్ టాక్స్ (Income Tax) డిపార్ట్మెంట్ వాళ్లు పలు రాష్ట్రాలలో తనిఖీలు(Raids) నిర్వహించగా, సుమారు రూ. 94 కోట్లకు పైగా డబ్బు (Money) పట్టబడినట్లు సమాచారం. అంతేకాకుండా రూ. 8 కోట్లు విలువ చేసే బంగారం కూడా పట్టుబడినట్లు సమాచారం. ముఖ్యంగా బెంగుళూరు ప్రాంతాలలో, అదేవిధంగా తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలలో సోదరు నిర్వహించినట్లు ఇన్కమ్ టాక్స్ (Income Tax) డిపార్ట్మెంట్ వెల్లడించింది. 

నాలుగు రాష్ట్రాలలో ఇన్కమ్ టాక్స్ సోదాలు: 

కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్ల సోదాలు (Raids) నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ రూ. 94 కోట్ల నగదుతో పాటు రూ. 8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, 30 లగ్జరీ వాచీలను స్వాధీనం చేసుకున్నట్లు CBDT సోమవారం తెలిపింది. అక్టోబర్ 12న సోదాలు (Raids) ప్రారంభించడం జరిగింది. 55 బెంగళూరు సంబంధిత ప్రాంతాలలో , తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని నగరాలతో పాటు ఢిల్లీలో కవర్ చేసింది. 

సెర్చ్ ఫలితంగా సుమారుగా రూ. 94 కోట్ల అవినీతి (Corruption) సొమ్ము, రూ. 8 కోట్లకు పైగా బంగారం మరియు వజ్రాభరణాలు, మొత్తం రూ. 102 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే ఇన్కమ్ టాక్స్ (Income Tax) లో బయటపడ్డ అవినీతి (Corruption) నగదు రికవరీ తర్వాత, కర్ణాటకలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి మధ్య ఈ విషయంపై మాటల యుద్ధం ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం దొరికిన డబ్బు (Money) అంతా కూడా కాంగ్రెస్‌ అవినీతి (Corruption) సొమ్ము అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ (Nalin Kumar Katil) అన్నారు. ఆరోపణకు ఎటువంటి ఆధారాలు లేవని కొట్టి పడేశారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah). సంస్థలు, వారి సహచరులపై తనిఖీలు(Raids) నిర్వహించిన తర్వాత లూజ్ షీట్లు, డాక్యుమెంట్ల హార్డ్ కాపీలు మరియు డిజిటల్ డేటా రూపంలో పెద్ద మొత్తంలో సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపించింది.

ఇందులో భాగంగా ముఖ్యంగా కాంట్రాక్టర్లు తాము అమ్మిన కొనుక్కున్న కొన్ని అక్రమ ఆస్తులకు గాను ఎటువంటి ఆధారాలు లేకుండా చేయడం. ముఖ్యంగా ఇన్కమ్ టాక్స్ (Income Tax) కు భయపడి ఎక్కువ మొత్తంలో డబ్బు (Money)ను అవినీతి (Corruption)పరులు తమ సొంత నిధుల్లో జమ చేయకపోవడం, ఇటువంటి వాటి విషయాలు మీద అవినీతి (Corruption) సొమ్ము ఎక్కువగా ఏర్పడుతుందని ఇటీవల జరిగిన తనిఖీల ద్వారా వెల్లడించారు. 

అయితే కొనుక్కున్న వస్తువుకు సంబంధించిన నగదు, అసలైన రసీదుకు సంబంధించి నగదు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నాయని, ముఖ్యంగా ఇటువంటి వ్యత్యాసం రూపంలో దాచుకున్న ఎక్కువ మొత్తంలో డబ్బు (Money) బయటపడినట్లు అధికారులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా, సబ్-కాంట్రాక్టర్లతో బోగస్ లావాదేవీలలో కొన్ని కూడా, ప్రస్తుతం చేసిన సోదాలలో బయటపడినట్లు నివేదికను పేర్కొన్నాయి.

అవినీతి (Corruption)కి పాల్పడిన కొంతమంది కాంట్రాక్టర్లు, వ్యాపారేతర ప్రయోజనాల కోసం బుకింగ్ ఖర్చులలో కూడా పాలుపంచుకున్నారని పేర్కొంది. అసెస్సీలు, సబ్-కాంట్రాక్టర్లు మరియు అసోసియేట్‌ల ప్రాంగణాల్లో సోదాలు (Raids) నిర్వహించగా, ఖాతా పుస్తకాల్లో నమోదుకాని పెద్ద మొత్తంలో జరిగిన ఎన్నో నగదు లావాదేవీలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు కొంతమంది అధికారులు వెల్లడించారు.