ముస్లింలకు ఇది తీవ్ర అవమానం:అసదుద్దీన్ ఒవైసీ

బిజెపి ఎంపీ రమేశ్ బిధూరి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, నిజంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ముస్లింలకు తీవ్ర అవమానానికి గురి చేస్తున్నాయని.. ఇదిలా వదిలేస్తే పార్లమెంట్ లో ముస్లింలకు చోటు ఉండకపోవడమే కాకుండా, ముస్లింలను హత్య చేసే క్రమం కూడా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.  తీవ్రంగా స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ:  పార్లమెంట్‌లో ముస్లింపై మూకుమ్మడి హత్యలు జరిగే రోజు ఎంతో దూరంలో లేదని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ […]

Share:

బిజెపి ఎంపీ రమేశ్ బిధూరి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, నిజంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ముస్లింలకు తీవ్ర అవమానానికి గురి చేస్తున్నాయని.. ఇదిలా వదిలేస్తే పార్లమెంట్ లో ముస్లింలకు చోటు ఉండకపోవడమే కాకుండా, ముస్లింలను హత్య చేసే క్రమం కూడా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. 

తీవ్రంగా స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ: 

పార్లమెంట్‌లో ముస్లింపై మూకుమ్మడి హత్యలు జరిగే రోజు ఎంతో దూరంలో లేదని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం అన్నారు. లోక్‌సభలో ఓ ముస్లిం ఎంపీపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ రమేశ్ బిధూరి చేసిన అవమానకర వ్యాఖ్యలపై తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంటులో ఓ ముస్లిం ఎంపీని, బీజేపీ ఎంపీ తన మాటలతో దూషించడం జరిగిందని.. పార్లమెంట్‌లో ఇదంతా మాట్లాడి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇదిలాగే వదిలేస్తే, పార్లమెంట్ లోనే ముస్లింలను హత్య చేసే వైనం కూడా దగ్గరలోనే కనిపిస్తుందని మరొకసారి గుర్తు చేశారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. 

అంతేకాకుండా ఇటువంటి అవమానకరమైన మాటలు ఒక బీజేపీ ఎంపీ మాట్లాడినందుకు.. ఎవరు స్పందించకపోగా..“మీ ‘సబ్కా సాత్, సబ్కా వికాస్ ఎక్కడ ఉంది? ఈ దేశ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడరు…’’ అంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు ఒవైసీ. శుక్రవారం చంద్రయాన్-3 మిషన్‌పై చర్చ జరుగుతున్న సందర్భంగా లోక్‌సభలో బీఎస్పీ నేత కున్వర్ డానిష్ అలీపై, బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి అభ్యంతరకర వ్యాఖ్యలతో దూషించడం జరిగింది.

ఇది జరిగిన వెంటనే, బిధూరికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నుండి హెచ్చరిక వచ్చింది. ఈ విషయంలో అతని పార్టీ షోకాజ్ నోటీసును అందుకుంది. ఆయన వ్యాఖ్యలను పార్లమెంట్‌ కార్యకలాపాల నుంచి తొలగించడం కూడా జరిగింది. ఇది ఇలా ఉండగా, రమేష్ బిధూరిపై చర్యలు తీసుకోకుంటే తన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకుంటానని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ అన్నారు. మరోవైపు బీజేపీకి చెందిన రమేష్ బిధూరిపై సస్పెన్షన్‌తో సహా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ఒత్తిడి తెచ్చాయి. 

రమేష్ బిదూరి చేసిన వాక్యలు ఏమిటి?: 

సభలో చంద్రయాన్-3 గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో, రమేష్ బిదూరి అనే బిజెపి ఎంపి, సభలో సభ్యుడైన మరొక ఎంపీ అలీని ఉద్దేశిస్తూ, అతను ఒక ఉగ్రవాది అని, ఒక ఆటంక వాది అని అరుస్తూ దూషించడం జరిగింది. భర్వా (పింప్) మరియు కత్వా (సున్తీ) అని కూడా పేర్కొన్నాడు. 

ఇప్పుడు రమేష్ చేసిన వ్యాఖ్యలు నిజానికి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సభలో ఎంపీగా ఉంటూ మరొకరిని మతపరంగా దూషించడం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఒక ఎంపీని, అది కూడా ముస్లిం ఎంపీని ఉద్దేశిస్తూ, ఉగ్రవాది, టెర్రరిస్ట్, ఆటంకవాది అని చేసిన వాక్యాలు.. ముస్లింలకు తీవ్ర అవమారకరంగా మారాయి. ప్రజలకు న్యాయం చేయాల్సిన వ్యక్తి, ముస్లింలు సైతం ఓటు వేసి గెలిపించిన ఒక ఎంపీ, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అనే చాలామంది ఖండిస్తున్నారు. ఇటువంటి ఎంపీని సభ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని, ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు. ఒవైసీ, ఈ విషయం గురించి మాట్లాడుతూ మండిపడ్డారు. ప్రజలు ఓటు వేసిన వ్యక్తి, తిరిగి తమకు ఓటు వేసిన ముస్లిం ప్రజలను ఈ విధంగా దూషించడం అవమానకరం అంటూ మాట్లాడారు.