రాబోయే ఐదు రోజుల్లో ఏపీకి వర్ష సూచన..ఈ జిల్లాల్లో..

గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోతున్నాయి. పిల్లలు, పెద్దలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో భూమి చల్లబడాలి అంటే కాస్త వర్షం రావాల్సిందే. ఇక వర్షం కోసం అటు రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వర్షం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త తెలిపింది. రాబోయే ఐదు రోజుల్లో కొన్ని జిల్లాలకు ప్రత్యేకించి వర్షం పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం […]

Share:

గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోతున్నాయి. పిల్లలు, పెద్దలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో భూమి చల్లబడాలి అంటే కాస్త వర్షం రావాల్సిందే. ఇక వర్షం కోసం అటు రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వర్షం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త తెలిపింది. రాబోయే ఐదు రోజుల్లో కొన్ని జిల్లాలకు ప్రత్యేకించి వర్షం పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.. ఇకపోతే ఏపీ ప్రజలు విపరీతమైన వడదెబ్బకు గురైన తర్వాత ఉష్ణోగ్రతను తగ్గించడానికి వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

మరొకవైపు కొన్ని జిల్లాల్లోని రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA హెచ్చరించింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) కూడా మచిలీపట్నం, అనంతపురం వంటి కొన్ని జిల్లాలలో సాధారణంగా మేఘవృతమైన ఆకాశం కనిపిస్తుంది. ఇక ఏప్రిల్ 21 నుండి 26 వరకు సాధారణ వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

APIMD నివేదికల ప్రకారం విజయవాడ, కర్నూలు, నెల్లూరు , తిరుపతి మరియు విశాఖపట్నంలో పాక్షికంగా మేఘవృతమైన వాతావరణం ఉంటుందని.. ఏప్రిల్ 21, 22, 23 తేదీలలో ఒకటి లేదా రెండు వర్షాలు మాత్రమే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  అయితే ఈ ప్రాంతాలలోని రైతులు ఒకవేళ పంట వేసి ఉంటే తమ పంటను కాపాడుకునే ప్రయత్నం చేయాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒక ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది.

ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో 42 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. మధ్యాహ్నం వేళల్లో ఎండవేడికి ప్రజలు ఇబ్బంది పడుతుండగా.. సాయంత్రం,  రాత్రివేళల్లో వర్షాలు కురుస్తుండడంతో చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఎండ వేడితో సతమతమవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణలో కూడా రానున్న ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఈనెల 22వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది..ముఖ్యంగా నగరంలో రాత్రి పలుచోట్ల వర్షాలు కురవగా నేడు కూడా పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా భూమి కాస్త చల్లబడితే వేడి తాకిడి నుండి కాస్త ఉపశమనం పొందుతారు. ఏది ఏమైనా ముఖ్యంగా తెలంగాణ ప్రజలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత అప్రమత్తం అవ్వాలి అని ముఖ్యంగా రైతులు తమ పంటలను కాపాడుకోవాలని వాతావరణ శాఖ చెబుతోంది. ఇకపోతే వర్షాలు వస్తాయని తెలిసి అటు ప్రజలు ఇటు పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.