తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఈద్‌-ఉల్‌-ఫితర్‌ వేడుకలు

భారతదేశంలో ముస్లింల పవిత్ర పండుగ ఈద్ ఉల్ ఫితర్. ఈ పండుగను నెలవంక దర్శనం తరువాతే జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నెలవంక కనబడటంతో ఏప్రిల్ 21వ తేదీన శుక్రవారం నాడు ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు జరిగాయి. ఆ తరువాత మనదేశంలో ఏప్రిల్ 22వ తేదీన శనివారం జరుపుకున్నారు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం ఈద్- ఉల్ -ఫితర్ రోజున ఉపవాసం ఉండకూడదు. రంజాన్ మాసంలో మసీదులలో ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. ఇస్లాం క్యాలెండర్ […]

Share:

భారతదేశంలో ముస్లింల పవిత్ర పండుగ ఈద్ ఉల్ ఫితర్. ఈ పండుగను నెలవంక దర్శనం తరువాతే జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నెలవంక కనబడటంతో ఏప్రిల్ 21వ తేదీన శుక్రవారం నాడు ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు జరిగాయి. ఆ తరువాత మనదేశంలో ఏప్రిల్ 22వ తేదీన శనివారం జరుపుకున్నారు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం ఈద్- ఉల్ -ఫితర్ రోజున ఉపవాసం ఉండకూడదు. రంజాన్ మాసంలో మసీదులలో ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం షవ్వాల్ నెలలో తొలిరోజు అంటే ఈద్ ఉల్ ఫితర్ రోజున ఉపవాసం ఉండకూడదు. నెలవంక కనిపించే సమయాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో పండుగ తేదీలు మారుతూ ఉంటాయి. రంజాన్ మాసం తొమ్మిదో నెలలో వస్తుంది. ఈ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. ఈ కాలంలో కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తుంటారు. తప్పనిసరిగా ఖురాన్ పఠిస్తారు. ఉపవాసాలు ఉండేవారు ఖచ్చితంగా రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పండగ పూట నమాజ్ కు ముందే పేదలకు ఇచ్చే దానాన్నే ఫితర్ అంటారు. అందుకే ఈ పండుగకు ఈద్ ఉల్ ఫితర్ అనే పేరు వచ్చింది. ఈద్ ఉల్ ఫితర్ ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణాలో రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఈద్‌-ఉల్‌-ఫితర్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా మీర్ ఆలమ్‌లో సుమారు 2 లక్షల మంది ప్రజలు ప్రార్థనలకు హాజరయ్యారు. ఖతీబ్ మక్కా మసీదు, మౌలానా హఫీజ్, ముఫ్తీ రిజ్వాన్ ,ఖురేషీ సాహబ్, ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలకు నాయకత్వం వహించారు. మక్కా మసీదు, ఖాదీమ్ ఈద్గా మాదన్నపేట, మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్స్, ఫస్ట్ లాన్సర్ వద్ద ఈద్గా మొదలైన చోట్ల భారీ సమావేశాలు జరిగాయి.

ఈద్గా దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. రంజాన్ పండుగ దుస్తులు ధరించి పెద్దలు, పిల్లలు ప్రార్థనలకు హాజరు కావడానికి తెల్లవారుజాము నుంచే ఈద్గాలు, మసీదుల వద్ద గుమిగూడారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా మీర్ ఆలం వద్ద రాష్ట్ర వక్ఫ్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈద్గా వద్ద హాజరైన పోలీసు ఉన్నతాధికారులు సమాజానికి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈద్గా మీర్ ఆలం వద్ద ప్రార్థనలకు హాజరై ప్రజలను కలిశారు. ఈద్‌ శుభాకాంక్షలు తెలిపేందుకు కుటుంబీకులు తమ బంధువులు, శ్రేయోభిలాషులను కలిసేందుకు వెళ్లడంతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈదుల్‌ ఫితర్‌ వేడుకలు శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. 30 రోజుల పాటు ఉపవాసాలు ఉన్న ముస్లింలు నెలవంక దర్శనం తర్వాత ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. నాగర్‌ కర్నూల్‌ లో వర్షం కారణంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి, తెలంగాణ డెంటల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ కూచకుళ్ల రాజేష్‌ రెడ్డి ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్‌రావు, కల్వకుర్తిలో ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదయ్‌ మైనార్టీలకు రంజాన్‌ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో నాగర్‌కర్నూల్‌ మార్కెట్‌ చైర్మన్‌ కురుమయ్య, నాగర్‌కర్నూల్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కల్పన, వైస్‌ చైర్మన్‌ బాబురావు, దొడ్ల ఈశ్వర్‌ రెడ్డి, కౌన్సిలర్‌ ఖాజాఖాన్‌, బాదం రమేష్‌, బురాన్‌ఖాన్‌, పాలమూర్‌ ప్రసాద్‌, మడిగల గోపాల్‌, ఎంపీటీసీ కావలి శ్రీను పాల్గొన్నారు.