రాష్ట్ర వ్యాప్తంగా అవర్ ఫర్ ఇన్నోవేషన్

గ్రామ స్థాయిలో ప్రజలలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం మరియు దాన్ని ఉపయోగించి సమస్యలకు పరిష్కరాలు కనుగొనడంపై వినూత్న కార్యక్రమానికి తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా T–ఇన్నోవేషన్‌ మహోత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్‌ 21ని యూనైటెడ్‌ నేషన్స్‌ ప్రపంచ క్రియేటివిటీ అండ్‌ ఇన్నోవేషన్‌ డేగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం TSIC ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.  ఈ సందర్భంగా ఐటీ శాఖ […]

Share:

గ్రామ స్థాయిలో ప్రజలలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం మరియు దాన్ని ఉపయోగించి సమస్యలకు పరిష్కరాలు కనుగొనడంపై వినూత్న కార్యక్రమానికి తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా T–ఇన్నోవేషన్‌ మహోత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్‌ 21ని యూనైటెడ్‌ నేషన్స్‌ ప్రపంచ క్రియేటివిటీ అండ్‌ ఇన్నోవేషన్‌ డేగా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం TSIC ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.  ఈ సందర్భంగా ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. సగటు మనిషికి వచ్చే సరికొత్త ఆవిష్కరణలపై అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్నట్లు తెలిపారు. టి-హబ్ మరియు వై-హబ్(యూత్ హబ్) వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యెక్క ఆవిష్కరణలను, సంస్కృతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు.

అదే విధంగా ప్రజల్లో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకురావడం మరియు సమస్యలను పరిష్కరించడంపై ఈ  కార్యక్రమం యెక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. సృజనాత్మకత అనేది అనేక ఆవిష్కరణలకు దారితీసే వనరు అని, స్థానిక స్థాయిలో సమస్యలను  పరిష్కరించడంలో ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం అభిప్రాయ పడుతోంది.

T- ఇన్నోవేషన్ మహోత్సవంలో భాగంగా TSIC బృందాలు గ్రామాలను సందర్శించి ఇన్నోవేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అదే విధంగా స్థానిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి మూస పద్ధతులను విచ్ఛిన్నం చేసే ఆవిష్కర్తల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తాయి. ఈ ప్రక్రియలో ప్రజలు తమ  సమస్యలను అక్కడికక్కడే పరిష్కారాలను కనుగొనేలా చర్యలు తీసుకో కోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తుంది.  ఈ కార్యక్రమానికి  సంబంధించిన బృందాలు.. ప్రజలు లేవనెత్తిన ప్రశ్నలకు, సమస్యలకు ఇప్పటికే ఉన్న పరిష్కారాలను చూపించారు.

ఇందులో భాగంగా 33 జిల్లాల్లోని వివిధ గ్రామాల్లోని సాధారణ సమస్యలను టీఎస్‌ఐసీ బృందాలు గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు చేపడతాయి. దీని తర్వాత ఇప్పటికే ఉన్న ఆవిష్కరణలు మ్యాపింగ్ చేయడం లేదా కొత్త వాటిని తీసుకురావడం జరుగుతుంది.

స్టేట్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం మాట్లాడుతూ.., ‘అవర్ ఆఫ్ ఇన్నోవేషన్’ అనేది అట్టడుగు స్థాయిలోని వ్యక్తులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు మరియు పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఒక రకమైన TSIC ప్లాన్ అని అన్నారు. రాష్ట్రంలోని ప్రగతిశీల పర్యావరణ వ్యవస్థ గురించి అట్టడుగు స్థాయి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించబడిందన్నారు.

పొదుపు పరిష్కారాల ద్వారా వారి దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి, సమస్యలను పరిష్కరించడానికి.. డిజైన్ ఆలోచనను ఉపయోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం మరో ఉద్దేశ్యం. ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లో భాగంగా అట్టడుగు స్థాయిలోని సామాన్యులకు చేరువయ్యేందుకు ‘అవర్ ఫర్ ఇన్నోవేషన్’ పేరుతో ప్రత్యేకమైన మెకానిజంతో ముందుకు వస్తున్నందుకు TSICని ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ అభినందించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇన్నోవేషన్‌లో ఎన్నో మైలురాళ్లను సాధించిందని, ఇప్పుడు 33 జిల్లాల్లో సమస్యలను పరిష్కరించేవారిని, ఆవిష్కర్తలను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తోందన్నారు. ఈ విధమైన ప్రోత్సాహక చర్యలు యువతకు ఎంతో ఉపయోగపడతాయని అనడంలో సందేహం లేదు. వీటిని ఉపయోగించుకొని యువత కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తుందని ఆశిద్దాం.