తెలంగాణలో 55 ట్రామా కేర్ సెంటర్లు

రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు గాయపడిన వారినీ తక్షణమే హాస్పటల్ కి తీసుకువెళ్తే జరిగే ప్రమాదం నుంచి నివారించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో వారికి వైద్యం అందించకపోతే ఒక్కోసారి వారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి మార్గనిర్దేశం మేరకు రాష్ట్రంలో ట్రామా కేర్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు వైద్యారోగ్య తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనిషియేషన్ టెర్రి కు శ్రీకారం చుట్టింది. ఎమర్జెన్సీ విభాగానికి […]

Share:

రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు గాయపడిన వారినీ తక్షణమే హాస్పటల్ కి తీసుకువెళ్తే జరిగే ప్రమాదం నుంచి నివారించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో వారికి వైద్యం అందించకపోతే ఒక్కోసారి వారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి మార్గనిర్దేశం మేరకు రాష్ట్రంలో ట్రామా కేర్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు వైద్యారోగ్య తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనిషియేషన్ టెర్రి కు శ్రీకారం చుట్టింది. ఎమర్జెన్సీ విభాగానికి వచ్చే కేసుల్లో అత్యధికంగా 24శాతం ట్రామా రోడ్డు ప్రమాద బాధితులే ఉంటున్నారు. ఇలాంటి వారికి తక్షణమే వైద్య చికిత్స అందించేందుకు టెరీలో భాగంగా అన్ని జిల్లాలలోని ప్రధాన రహదారులను కలుపుతూ 55 హాస్పిటల్స్ లో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని సామర్థ్యం, వసతుల ఆధారంగా లెవల్ 1, లెవల్2, లెవెల్ 3 హాస్పిటల్స్ గా విభజించింది. ఇందులో భాగంగా సేవలను ఫ్రీ హాస్పటల్, ఇంట్రా హాస్పటల్ కేర్ అని రెండు రకాలుగా వర్గీకరించారు. అందుకు అనుగుణంగా సదుపాయాల కల్పన సేవల మెరుగుపై దృష్టి సారిస్తారు.

 ఫ్రీ హాస్పటల్ కేర్ 

ప్రమాద బాధితులను వేగంగా హాస్పిటల్ కి చేర్చడం, మార్గం మధ్యలో ఫస్ట్ ఎయిడ్ అందించడం దీని లక్ష్యం. ప్రమాదా స్థలానికి 108 అంబులెన్సులు వేగంగా చేరేలా అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనున్నారు. వాహనంలో అత్యవసర సేవలు అందేలా శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, సివిఆర్ చేసేందుకు ఏఈడి లాంటి పరికరాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 292 ఆంబులెన్సులలో ఏఈడిలు ఉన్నారు. మిగతా 133 ఆంబులెన్సులలో త్వరలో ఏర్పాటు చేయనున్నారు. బాధితుడిని 108 వాహనంలోకి చేర్చగానే ఈఎంటి అతడి ఆరోగ్య పరిస్థితిని ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేస్తారు. ఈ వివరాలు సమీపంలోనే హాస్పటల్‌కి చేరుతాయి. దాంతో వెంటనే అక్కడ అత్యవసర విభాగం లోని వైద్యులు అప్రమత్తమై బాధితుడి లక్షణాల ఆధారంగా ఎలాంటి చికిత్స అందించాలో ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంటారు. దాంతో వైద్యుడితోపాటు పేషెంట్ కూడా సమయం మిగులుతుంది. పేషంట్‌కి సరైన సమయంలో సరైన చికిత్స అందించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. 

ఇంట్రా హాస్పటల్ కేర్ 

టెరి కేంద్రాలు ఏర్పాటు చేయనున్న హాస్పిటల్స్‌లో ప్రస్తుతం ఉన్న క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ గా మార్చుతారు. అంబులెన్స్ సులభంగా వచ్చి పోయేలా ఏర్పాట్లు చేస్తారు. వాహనం నుంచి దిగగానే ఎమర్జెన్సీ సేవలు అందేలాగా అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తారు. ఎమర్జెన్సీ విభాగం సులువుగా గుర్తించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక ఓపి సేవలు, కుర్చీలు, స్ట్రెక్చర్లు, ట్రాలీలు, వీల్ చైర్లు వంటివాటిని ఎమర్జెన్సీ వద్ద అందుబాటులో ఉంచుతారు. లోపల అత్యవసర చికిత్స అందించేందుకు ప్రత్యేకమైన స్థలం ప్రయాజ్ ఉంటుంది. ఇందులో నాలుగు క్లినికల్ మేనేజ్మెంట్ జోన్లు ఉంటాయి. నలుపు, ఎరుపు , పసుపు, ఆకుపచ్చ రంగుల సూచీలతో వాటిని విభజిస్తారు‌ పేషంట్ సమస్య తీవ్రతను బట్టి ఆయా జోన్లలోకి తీసుకువెళ్లి చికిత్స అందిస్తారు. ప్రయాజ్ లో మల్టీ పారామీటర్ మానిటర్లు, మెడికల్, గ్యాస్ అవుట్లెట్స్, ఇతర వైద్య సదుపాయాలు, ల్యాబ్ సర్జికల్ థియేటర్‌లు అందుబాటులో ఉంటాయి. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం 5000 చదరపు అడుగుల్లో 10 పడకల ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. 

లేటెస్ట్ ఎక్విప్‌మెంట్ టెరి కేంద్రాలు ఏర్పాటు చేసే టీచింగ్ హాస్పిటల్స్ లో 30 పడకలు, హాస్పిటల్స్ లో సామర్థ్యాన్ని బట్టి 5, 10, 15, 20 పడకలను ఎమర్జెన్సీ విభాగానికి కేటాయిస్తారు. బాధితులకు సత్వర చికిత్స ప్రారంభించేలా అన్ని రకాల అధునాతన పరికరాలు ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. ఆటో ప్లేయర్, మిషన్ మొబైల్ ఎక్స్రే, ఈ ఫాస్ట్ సెక్షన్ ఆపరేటర్స్, డిప్రివి, లెటర్స్ సి ఆర్మూర్, అల్ట్రా సోనోగ్రఫీ, అల్ట్రా సౌండ్, సిటి స్కాన్, వెంటిలేటర్లు, ఓటి ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచుతారు. మొత్తం 7 విభాగాలకు చెందిన స్పెషాలిటీ వైద్యులు, 7 విభాగాలకు చెందిన నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది ఉంటారు. మొత్తం 11 హాస్పిటల్స్ లో 237 మంది, లెవెల్ 2లో 101 మంది, లెవెల్ 3 లో 73 మంది చొప్పున వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. వీరికి జిల్లా స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ అందజేస్తారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, ఇతర తీవ్ర సమస్యల బారిన పడిన వారికి సరైన సమయంలో అత్యవసర వైద్యం అందక ఎన్నో విలువైన ప్రాణాలు పోతున్నాయి. దీన్ని నివారించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘టెరి’కి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 55 చోట్ల ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు, మాతా శిశు అత్యవసర సేవలు, ఇతర మెడికల్ సర్జరీ ఎమర్జెన్సీ సమయంలో తక్షణమే అత్యవసర సేవలు అందుతాయి. ప్రమాద సమాచారం తెలిపిన వెంటనే బాధితులను హాస్పిటల్స్ కు చేర్చడం మొదలుకొని వారికి అత్యవసరమైన వైద్యం అందించే వరకు అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేస్తాయి. తద్వారా ఎక్కడా ఆలస్యం జరగకుండా ప్రాణ నష్టం కాకుండా చూసుకోవడం సాధ్యమవుతుంది. ఎంపిక చేసిన హాస్పిటల్స్‌లో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ విభాగాలకు వచ్చే కేసుల ఆధారంగా ట్రామా కేంద్రాల్లో ఎవరెవరికి సేవలు అవసరమో గుర్తించి ఆయా విభాగాలను ఆరు పిల్లర్స్‌గా విభజించారు.