హైదరాబాద్లో అరుదైన కిడ్నీ ఆపరేషన్

కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ట్రాన్స్ ప్లాంటేషన్ కి మెయిన్ ప్రాబ్లమ్స్ ఆర్గాన్స్ దొరకకపోవడమే. వాటి సైజ్ ఎంతున్నా పర్వాలేదు ఆర్గాన్స్ మార్పిడి పెంట ఎంత వయసు వాళ్లకైనా చేయొచ్చని డాక్టర్ తెలిపాడు.  సక్సెస్ అయిన కిడ్నీ ఆపరేషన్ హైదరాబాద్లో బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారి కిడ్నీలను 58 ఏళ్ల మహిళకు పెట్టారు. హార్వెస్టెడ్ కిడ్నీస్ సైజు తో పాటు, ఇక సర్జరీ విషయానికి వస్తే పేషెంట్ ఏడు సంవత్సరాలుగా డయాలసిస్ లో ఉన్నారు, అందుకే […]

Share:

కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ట్రాన్స్ ప్లాంటేషన్ కి మెయిన్ ప్రాబ్లమ్స్ ఆర్గాన్స్ దొరకకపోవడమే. వాటి సైజ్ ఎంతున్నా పర్వాలేదు ఆర్గాన్స్ మార్పిడి పెంట ఎంత వయసు వాళ్లకైనా చేయొచ్చని డాక్టర్ తెలిపాడు. 

సక్సెస్ అయిన కిడ్నీ ఆపరేషన్

హైదరాబాద్లో బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారి కిడ్నీలను 58 ఏళ్ల మహిళకు పెట్టారు. హార్వెస్టెడ్ కిడ్నీస్ సైజు తో పాటు, ఇక సర్జరీ విషయానికి వస్తే పేషెంట్ ఏడు సంవత్సరాలుగా డయాలసిస్ లో ఉన్నారు, అందుకే కిడ్నీ మార్పిడి కాస్త కష్టంగా మారింది. కానీ కిడ్నీ సైజ్ అనేది మార్పిడికి అడ్డే కాదని డాక్టర్ తెలిపాడు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఉమామహేశ్వరరావు కిడ్నీ దొరకడం అతి కష్టమైన విషయమని తెలియజేశాడు, ఒకసారి కిడ్నీ దొరికితే దాని సైజ్ ఎంతున్నా దాన్ని ఎవరికైనా ట్రాన్స్ ప్లాంట్ చేయొచ్చని తెలిపాడు. ఈ సర్జరీ కిడ్నీ రోగులకు కొత్త ఆశలు చిగురించేలా చేసింది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లు ఈ సర్జరీ గురించి తెలిసి చాలా సంతోషిస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నా కూడా అవేం పెద్ద ప్రాబ్లమ్స్ కాదని డాక్టర్ తెలియజేశాడు.చనిపోయిన పాప కిడ్నీలను దానం చేసిన ఫ్యామిలీకే ఈ ఘనత దక్కుతుందని డాక్టర్ తెలిపాడు. సర్జరీ చాలా కష్టంతో చేసామని చెప్పాడు. ఈ పేషెంట్ ఏడు సంవత్సరాలుగా డయాలసిస్ లో ఉంది కాబట్టి సర్జరీ చేయడం కాస్త కష్టంగా మారిందని తెలియజేస్తాడు. 

వైద్య రంగాల్లో జరుగుతున్న మార్పులు ఏంటి? 

వైద్య రంగంలో రాను రాను చాలా అభివృద్ధి జరుగుతుంది. ఒకప్పుడు వైద్యులు కొన్ని రకాల ఆపరేషన్ మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు శరీరంలో ప్రతి అవయవాన్ని మార్చే టెక్నాలజీస్ వచ్చాయి. దీనివల్ల చాలామంది ప్రాణాలు నిలుస్తున్నాయి. డాక్టర్లు చాలా ఓపికగా ఈ ఆపరేషన్ చేయడం వల్ల చాలామంది పేషంట్లకు డాక్టర్ల మీద నమ్మకం పెరుగుతుంది. 

ఇలా ఆపరేషన్లు చేయాలంటే డోనార్లు కూడా ముందుకు రావాలి. డోనర్లు లేకుండా కిడ్నీ ఆపరేషన్ చేయడం చాలా కష్టం. మన దేశంలో ఈ మధ్య చాలామంది చనిపోయాక తమ అవయవాలు దానం చేస్తున్నారు. దీనివల్ల కొంతమంది జీవితాలు బాగు పడుతున్నాయి. 

ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ ల వల్ల కొంతమంది కిడ్నీలు, లివర్ లు మార్చుకుంటున్నారు.  ఒకప్పుడు కిడ్నీలు పడయ్యాయి అంటే బ్రతకడం చాలా కష్టంగా మారేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి వైద్య సౌకర్యాల వల్ల చాలామంది తమ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. భవిష్యత్తులో వైద్యం ఇంకా ముందుకు వెళ్లాలని చాలామంది కోరుకుంటున్నారు. మనదేశంలో కొన్ని వ్యాధులకు సరైన వైద్యం లేదు. అలాంటి వ్యాధులకు డాక్టర్లు సైంటిస్టుల సాయంతో మంచి మందులు కనిపెట్టాలని చాలామంది కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ట్రాన్స్ప్లాంటేషన్లో అవయవదానానికి ముఖ్య ప్రాధాన్యత ఉంటుంది. చాలామంది డోనర్స్ ముందుకు వచ్చి అవయవాలు దానం చేస్తున్నారు. అది అభినందించదగ్గ విషయం. మన దేశంలో వైద్యం ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుందాం. ఇలాంటి ట్రాన్స్ప్లాంటేషన్లు మరిన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.