Indians: ఈ ప్రాంతాలకు భారతీయులకు అనుమతి లేదు

భారతదేశాన్ని చాలా సంవత్సరాలు బ్రిటిష్ వారు పాలించారు. 1947లో బ్రిటిష్ వాళ్ళ చేతిలో బానిసత్వం నుండి దేశం స్వాతంత్రం  (Independence) పొందింది. బ్రిటీష్ పాలనలో, భారతీయులు (Indians) హింసకు గురయ్యారు. వారి సొంత దేశంలో కూడా వారికి హక్కులు లేవు. అనేక సంవత్సరాలు పోరాడి, అనేకమంది ప్రాణాలను బలిగొన్న తర్వాత, భారతదేశ ప్రజలు ఎట్టకేలకు స్వాతంత్రం  (Independence) సంపాదించుకున్నారు. ఇప్పుడు, వారు తమ సొంత భూమి మీద స్వేచ్ఛగా తిరగచ్చు. అయితే స్వాతంత్రం  (Independence) వచ్చి 76 […]

Share:

భారతదేశాన్ని చాలా సంవత్సరాలు బ్రిటిష్ వారు పాలించారు. 1947లో బ్రిటిష్ వాళ్ళ చేతిలో బానిసత్వం నుండి దేశం స్వాతంత్రం  (Independence) పొందింది. బ్రిటీష్ పాలనలో, భారతీయులు (Indians) హింసకు గురయ్యారు. వారి సొంత దేశంలో కూడా వారికి హక్కులు లేవు. అనేక సంవత్సరాలు పోరాడి, అనేకమంది ప్రాణాలను బలిగొన్న తర్వాత, భారతదేశ ప్రజలు ఎట్టకేలకు స్వాతంత్రం  (Independence) సంపాదించుకున్నారు. ఇప్పుడు, వారు తమ సొంత భూమి మీద స్వేచ్ఛగా తిరగచ్చు. అయితే స్వాతంత్రం  (Independence) వచ్చి 76 ఏళ్లు గడిచినా, మన దేశంలోనే భారతీయులకు (Indians) ప్రవేశం లేని, ఆంక్షలు (Restrictions) ఉన్న కొన్ని ప్రదేశాలు, ఇంకా ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో చూసేద్దాం రండి. 

ఈ ప్రాంతాలకు భారతీయులకు అనుమతి లేదు: 

సకురా ర్యోకాన్ రెస్టారెంట్  (Restaurant), అహ్మదాబాద్ (Ahmedabad): సకురా ర్యోకాన్ రెస్టారెంట్  (Restaurant) జపనీస్ రుచికరమైన వంటకాలను అందించే ప్రసిద్ధ రెస్టారెంట్  (Restaurant). నివేదికల ప్రకారం, ఈ రెస్టారెంట్  (Restaurant)‌లో కేవలం జపనీస్ కు మాత్రమే వడ్డిస్తారు. రెస్టారెంట్  (Restaurant) యజమాని భారతీయుడు, అయితే కొంతకాలం క్రితం కొంతమంది భారతీయులు (Indians) ఇక్కడకు వచ్చి నార్త్ ఈస్టర్న్ వెయిట్రెస్‌ను ఆటపట్టించడంతో, అప్పటినుంచి ఈ రెస్టారెంట్  (Restaurant) భారతీయులపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.

ఫ్రీ కసోల్ కేఫ్ (Cafe), కసోల్, హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh): ఫ్రీ కసోల్ కేఫ్ (Cafe) కూడా భారతీయులను కేఫ్ (Cafe)‌ను సందర్శించడానికి అనుమతించకుండా (Restrictions) వార్తల్లో నిలిచింది. అయితే ఈ ప్రాంతంలో కూడా కొంతమంది భారతీయులు (Indians) వచ్చి, రెస్టారెంట్  (Restaurant) లో పని చేస్తున్న ఆడవాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తించడం కారణంగా ఇక్కడ భారతీయులకు (Indians) అనుమతి లేకుండా (Restrictions) పోయిందని చెప్పుకుంటూ ఉంటారు.

ఫారినర్స్ బీచ్, గోవా (Goa): అనేక నివేదికల ప్రకారం, గోవాలో విదేశీయుల కోసం ప్రత్యేకంగా కొన్ని బీచ్‌లు (Beach) ఉన్నాయి. అక్కడ భారతీయులు (Indians) సందర్శించడానికి అనుమతి (Restrictions) లేదు. విదేశీయులు స్వేచ్చగా ఆ ప్రాంతంలో తిరగొచ్చు. అయితే నిజానికి భారతీయులు (Indians) వారి సంస్కృతికి ఇంకా అలవాటుపడకపోవడమే, భారతీయులను ఆ ప్రాంతంలో అనుమతించకపోవడానికి (Restrictions) ప్రధాన కారణం.

రెడ్ లాలిపాప్ హాస్టల్, చెన్నై: చెన్నై (Chennai)లోని రెడ్ లాలిపాప్ హాస్టల్‌లో ప్రత్యేకించి నో-ఇండియన్ పాలసీ ఉంది. విదేశీ పాస్‌పోర్ట్‌లు ఉన్నవారు మాత్రమే హాస్టల్‌ కు వెళ్లడానికి.. అదేవిధంగా అక్కడ ఉండటానికి అనుమతిస్తారు. అయితే విదేశీ పాస్‌పోర్ట్‌ ఉన్న భారతీయులు (Indians) కూడా ఆ హాస్టల్లో ఉండడానికి వీలుపడతది గమనించాలి.

UNO-IN హోటల్, బెంగళూరు: భారతీయులకు (Indians) ఆంక్షలు (Restrictions) ఉన్న మరో ప్రసిద్ధ ప్రదేశం కర్ణాటకలోని బెంగళూరులోని UNO-IN హోటల్. నివేదికల ప్రకారం, ఈ హోటల్ ప్రత్యేకించి జపాన్ ప్రజలకు మాత్రమే ఆహ్వానిస్తూ ఉండేది. ఇక్కడ భారతీయులకు (Indians) అనుమతి ఉండేది కాదు. ఈ కారణంగానే ఒకప్పుడు హోటల్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ తర్వాత ఈ హోటల్ ని OYO స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు భారతీయులకు (Indians) కూడా ఇక్కడ అనుమతి ఉంది. 

దేశాలు ప్రత్యేకించి భారతీయులకు ప్రత్యేక ఆహ్వానం: 

చాలా దేశా (Countries)లు తమ దేశా (Countries)నికి ఆహ్వానం ఇస్తూ, మరింత మంది ప్రయాణికులను ఆకర్షించడానికి తమదైన శైలిలో వెసులుబాటును కల్పిస్తు, తమ దేశ పర్యాటక ఆదాయాన్ని పెంచుకుంటున్న దేశా (Countries)లలో ఇప్పుడు థాయిలాండ్ (Thailand) కూడా చేరింది. తమ దేశా (Countries)నికి భారతీయుల (India)ను ఆహ్వానిస్తూ ఎటువంటి వీసా (Visa) కూడా అవసరం లేదని ప్రకటించింది. 

వచ్చే నెల నుండి మే 2024 వరకు భారతదేశం, తైవాన్ నుండి వచ్చేవారి కోసం వీసా (Visa) అవసరాలను థాయ్‌లాండ్ మాఫీ చేస్తుందని, సీజన్ సమీపిస్తున్నందున ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నంలో, థాయ్‌లాండ్ (Thailand) ప్రభుత్వ అధికారి మంగళవారం తెలిపారు. 2019లో రికార్డు స్థాయిలో వచ్చిన 39 మిలియన్లలో 11 మిలియన్లతో దేశంలోని అగ్రగామి ప్రీ-పాండమిక్ టూరిజం మార్కెట్ అయిన చైనీస్ (China), టూరిస్టుల కోసం థాయ్‌లాండ్ (Thailand) సెప్టెంబరులో వీసా (Visa) అవసరాలను రద్దు చేసింది. జనవరి నుండి అక్టోబర్ 29 వరకు, థాయ్‌లాండ్ (Thailand)‌కు 22 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారు, తాజా ప్రభుత్వ డేటా ప్రకారం $25.67 బిలియన్లు పర్యాటికుల ద్వారా ఆదాయం వచ్చింది.