పాస్‌పోర్ట్ కార్యాలయంలో ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్

కరోనా తర్వాత పాస్‌పోర్టులకు మళ్లీ డిమాండ్ పెరిగింది. దాదాపు మూడేళ్ల పాటు విదేశాలకు రాకపోకలు నిలిపివేయడంతో ఇళ్లలోనే కూర్చున్న వారు మళ్లీ విదేశీ బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. దీంతో స్టడీ, జాబ్, టూరిస్టు వీసాలకు డిమాండ్ పెరిగింది. ఉపాధి కోసం ఎక్కువగా దుబాయ్, మస్కట్, అమెరికా, లండన్ తదితర దేశాలకు ఎక్కు మంది వెళుతూ ఉంటారు. కరోనా తర్వాత పాస్‌పోర్ట్ ధరఖాస్తు చేసుకుంటే కేవలం రెండు మూడు రోజుల్లోనే స్లాట్ దొరికేది. కానీ ప్రస్తుతం.. ఒక […]

Share:

కరోనా తర్వాత పాస్‌పోర్టులకు మళ్లీ డిమాండ్ పెరిగింది. దాదాపు మూడేళ్ల పాటు విదేశాలకు రాకపోకలు నిలిపివేయడంతో ఇళ్లలోనే కూర్చున్న వారు మళ్లీ విదేశీ బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. దీంతో స్టడీ, జాబ్, టూరిస్టు వీసాలకు డిమాండ్ పెరిగింది. ఉపాధి కోసం ఎక్కువగా దుబాయ్, మస్కట్, అమెరికా, లండన్ తదితర దేశాలకు ఎక్కు మంది వెళుతూ ఉంటారు. కరోనా తర్వాత పాస్‌పోర్ట్ ధరఖాస్తు చేసుకుంటే కేవలం రెండు మూడు రోజుల్లోనే స్లాట్ దొరికేది. కానీ ప్రస్తుతం.. ఒక స్లాట్ బుక్ కావడానికి 30 నుండి 40 రోజులు సమయం పడుతోంది. దీంతో వేలాది మంది వివిధ కారణాలతో ఇతర దేశాలకు వెళ్లాలను కునే వారు తీవ్ర అసహనానికి గురి అవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టులను జారీ చేసే అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దరఖాస్తుదారుల వేచి చూసే సమయం తగ్గించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి.

 ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఇకపై శనివారం కూడా సేవలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు. తెలంగాణలలో ఏప్రిల్ 29 నుండి స్పెషల్ పాస్‌పోర్ట్ డ్రైవ్ చేపట్టనున్నట్లు పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమ విభాగం తెలిపింది. అదే విధంగా ఏపిలోనూ ఏప్రిల్ 29 నుండి స్పెషల్ పాస్‌పోర్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. 

తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు కరీంనగర్, నిజామాబాద్ లలో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతి లలో ఈ స్పెషల్ డ్రైవ్ ను ఏర్పాటు చేసుతున్నారు. ఈ మేరకు ఈ నెల 29 నుండి నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్ కు సంబంధించి అపాయింట్మెంట్లు గురువారం 27వ తేదీ నుండి విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఇలా స్పెషల్ డ్రైవర్ ను ఏర్పాటు చేయడం వల్ల ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ల టైమ్ సేవ్ అవ్వడమే కాకుండా రద్దీ తగ్గడం, పాస్‌పోర్ట్ పని తొందరగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ 29 నుండి ప్రతి శనివారం పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు తెరిచి ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాటి ద్వారా 3,056 కొత్త స్లాట్లను విడుదల చేస్తారు. ఈ డ్రైవ్ వల్ల కొత్త వారితో పాటు.. ఎక్కువ రోజుల గ్యాప్ తో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లు రీషెడ్యుల్ చేసుకోవచ్చు. ఏపిలో ప్రతి శనివారం 2,200 స్లాట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.  

పాస్‌పోర్ట్ డ్రైవ్ లు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్ నగరం లో బేగంపేట, అమీర్ పేట, టోలీచౌకీ ప్రాంతాల్లో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఏపిలోని విశాఖపట్నం, భీమవరం, తిరుపతి, విజయవాడ సేవా కేంద్రాలు ప్రతి శనివారం పని చేస్తాయి. దరఖాస్తు చేసుకునే వారు ఏప్రిల్ 27 గురువారం సాయంత్రం 4 గంటల నుండి పాస్ పోర్ట్ సేవా వెబ్ సైట్ లేదా mPassportseva  యాప్ ద్వారా అపాయింట్మెంట్ కోసం నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 29 నుండి చేపట్టనున్న స్పెషల్ పాస్‌పోర్ట్ డ్రైవ్ కోసం పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం విభాగం తగిన ఏర్పాట్లను చేస్తుంది. తత్కాల్, నార్మల్, పీసీసీ పాస్‌పోర్ట్‌లకు స్పెషల్ డ్రైవ్ లో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.