పెళ్లికి ఒప్పుకోలేద‌ని ప్లాన్ చేసి హ‌త్య‌

ప్రేమిస్తున్న అని వెంటపడడం ప్రేమను ఒప్పుకోకపోతే చంపడం వంటి గోరాలు ఇంకా ఆగనేలేదు..  ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో 25 ఏళ్ల కాలేజీ విద్యార్థిని తన వివాహ ప్రతిపాదనను నిరాకరించినందుకు ఆమెను హత్య చేసాడు ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.  విజయ్ మండల్ పార్క్ సమీపంలో మహిళ మృతదేహం కనుగొనబడింది అని  మరియు సమీపంలో ఒక రాడ్ కూడా కనుగొనబడింది, వారు తెలిపారు .. .దక్షిణ ఢిల్లీలోని మాల్వీయనగర్‌లో శుక్రవారం  […]

Share:

ప్రేమిస్తున్న అని వెంటపడడం ప్రేమను ఒప్పుకోకపోతే చంపడం వంటి గోరాలు ఇంకా ఆగనేలేదు..  ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో 25 ఏళ్ల కాలేజీ విద్యార్థిని తన వివాహ ప్రతిపాదనను నిరాకరించినందుకు ఆమెను హత్య చేసాడు ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. 

విజయ్ మండల్ పార్క్ సమీపంలో మహిళ మృతదేహం కనుగొనబడింది అని  మరియు సమీపంలో ఒక రాడ్ కూడా కనుగొనబడింది, వారు తెలిపారు .. .దక్షిణ ఢిల్లీలోని మాల్వీయనగర్‌లో శుక్రవారం  ఉదయం ఓ 25 ఏళ్ల యువతిని ఇనుప రాడ్డుతో తలపై కొట్టి చంపాడు.ఘటనపై కేసు నమోదు చేసి తరువాత  ముమ్మరంగా గాలించిన ఢిల్లీ పోలీసులు ఇర్ఫాన్‌ జాడ కనిపెట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

మూడు రోజుల క్రితమే మృతురాలు నర్గీస్‌ను హత్య చేదాం అని నిందితుడు ఇర్పాన్‌ ప్రణాళిక వేశాడని పోలీసులు తెలిపారు.

హత్య చేయడానికి ఉపయోగించిన రాడ్డును ఇంటినుంచే తెచ్చినట్లు నిందితుడు వెల్లడించాడు. అతడు సోమవారమే నర్గీస్‌ను కలవాలనుకున్నాడు అయితే కొన్ని కారణాలవల్ల అది సాధ్యం కాలేదంటూ అతడు చెప్పాడు. ఆ విషయాలను మేం పరిశీలిస్తున్నాం’ అని పోలీసులు

వెల్లడించారు. త్వరలో అతడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. ఇర్ఫాన్‌ అరెస్ట్‌ అనంతరం దక్షిణ ఢిల్లీ డీసీపీ చందన్‌ చౌదరి మీడియాకు వివరాలను వెల్లడించారు

నర్గీస్‌ ఈ ఏడాది గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. అనంతరంఆమె స్టైనోగ్రఫీ నేర్చుకుంటోంది. డెలివరీ బాయ్ గా పనిచేసే ఇర్ఫాన్‌ ఆమెను వివాహం చేసుకోవాలని అని అనుకున్నాడు కానీ అతడికి సరైన ఉద్యోగం లేకపోవడంతో ఆమె అందుకు నిరాకరించింది. అలాగే అతడితో ఫోన్లోమాట్లాడటం కూడా మానేసింది. దాంతో ఆమెతో మాట్లాడేందుకు ఫాలో చేసేవాడు. అయితే ఆమె తిరస్కరణను అతడు తట్టుకోలేకపోయాడని విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ముందస్తు ప్రణాళిక ప్రకారం.. పార్క్‌లో ఆమెను కలుసుకు అతడు వెంట తెచ్చుకున్న రాడ్డుతో దాడిచేశాడు. దాంతో నర్గీస్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకునేసరికి.. నిందితుడు పారిపోయాడు. రాడ్డును మాత్రం అక్కడేవదిలేసి వెళ్లిపోయాడు. 

ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు డీసీపీ చందన్‌ చౌదరి చెప్పారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఇర్ఫాన్, మృతురాలు ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. ఇద్దరూ వరుసకు బావ, మరదలు కూడా అవుతారు అని  అయితే, ఇర్ఫాన్‌కు ఉద్యోగం లేకపోవడంతో వారి పెళ్లికి మృతరాలి కుటుంబసభ్యులు నిరాకరించారు.

దాంతో అప్పటి నుంచి మృతురాలు ఇర్ఫాన్‌ను దూరం పెడుతూ వచ్చింది.పోలీసుల కథనం ప్రకారం, నిందితుడు “మానసిక పరిస్థితి బాలేదు అని..  అతను డెలివరీ బాయ్‌గా చేస్తూ ఉంటాడు అని  మరియు అమ్మాయి కోచింగ్ తీసుకుంటున్న ప్రదేశం గురించి సమాచారం అతనికి తెలిసి ఉండడం తో  ఇర్ఫాన్‌ శుక్రవారం ఉదయం ఆమెను బలవంతంగా మాల్వీయనగర్‌లోని అరబిందో కాలేజీ సమీపంలోగల విజయ్‌ మండల్‌ పార్కుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవ పెట్టుకుని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు అక్కడి నుంచి జారుకున్నాడు.

అనంతరం పార్కుకు వెళ్లిన కొందరు యువతి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. అనంతరం సీసీ పుటేజీ, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ఆధారంగా నిందితుడు ఇర్ఫాన్‌గా గుర్తించారు. ఆపై ముమ్మరంగా గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలి తండ్రి మాట్లాడుతూ  బాధితురాలి తండ్రి విలేకరులతో మాట్లాడుతూ నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నాకు ఒక్కతే కూతురు.నా కూతురి ప్రాణాలు తీసినవాడిని నేను క్షమించను అతనిని విడిచిపెట్టను అని ఆయన అన్నారు