Nara Lokesh: చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోంది..!

గత నెల 9వ తేదీన చంద్రబాబును సీఐడీ(CID) అరెస్ట్‌ చేసింది.. చంద్రబాబు రిమాండ్‌ 36వ రోజుకు చేరింది.. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, టీడీపీ(Tdp) శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భద్రత లేని జైలులో బాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణ హాని తలపెడుతున్నారని నారా లోకేశ్(Nara Lokesh) ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు(Chandrababu) ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబుకు ఏ హాని జరిగినా.. జగన్ సర్కారు, జైలు అధికారులదే […]

Share:

గత నెల 9వ తేదీన చంద్రబాబును సీఐడీ(CID) అరెస్ట్‌ చేసింది.. చంద్రబాబు రిమాండ్‌ 36వ రోజుకు చేరింది.. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, టీడీపీ(Tdp) శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భద్రత లేని జైలులో బాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణ హాని తలపెడుతున్నారని నారా లోకేశ్(Nara Lokesh) ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు(Chandrababu) ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబుకు ఏ హాని జరిగినా.. జగన్ సర్కారు, జైలు అధికారులదే బాధ్యతన్నారు.

అనారోగ్య కారణాలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ.. చంద్రబాబును రిమాండ్‌లోనే ఉంచాలనే కుట్ర జరుగుతోందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉంది. భద్రతలేని జైలు(Jail)లో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం(YCP Govt.) రాక్షసంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందని.. చంద్రబాబుకు ఏ హాని జరిగినా.. జగన్‌ ప్రభుత్వం(Jagan Govt), జైలు అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యం(Chandra babu health)పై ఎందుకీ కక్ష? అని లోకేశ్‌ ప్రశ్నించారు.

జైలులో దోమలు ఎక్కువ ఉన్నాయన్నా అధికారులు పట్టించుకోలేదని.. చన్నీళ్లు ఇస్తున్నారనన్నా లెక్క చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగా తిరగని ఫ్యాన్‌ పెట్టారని.. చంద్రబాబు బరువు తగ్గిపోయారని.. అలర్జీ వచ్చిందని తెలిపారు. డీ హైడ్రేషన్‌(Dehydration)కు గురయ్యారని అన్నారు. జైలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని’ అని లోకేశ్‌ మండిపడ్డారు.

ఇప్పటికే.. ప్రభుత్వం, జైలు అధికారుల తీరుపై.. లోకేశ్(Lokesh), భువనేశ్వరి(Bhuvaneshwari), బ్రాహ్మణి(Brahmani) ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలుకి వెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై మొదట నుంచీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎండ వేడిమి కారణంగా డీహైడ్రేషన్‌కు గురి కావడంతో పాటు.. ఆయన శరీరంపై పలు చోట్ల దద్దుర్లు రావటం, అలర్జీతో బాధపడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వ పెద్దలు స్పందించిన తీరుపై అనుమానాలు నెలకొన్నాయి. చంద్రబాబు గురించి తెలుగుదేశం పార్టీ(Tdp) నేతలు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు. అదే విధంగా కొందరు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల(Sajjala) హేళన చేస్తూ మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, బ్రాహ్మణి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో తన భర్తకు అత్యవసర వైద్యాన్ని సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. స్టెరాయిడ్లు ప్రయోగించడానికి ప్రభుత్వం యత్నిస్తోందని నారా లోకేశ్‌ ఆరోపించగా.. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు.

కాగా నారా లోకేశ్ దిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గాన రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌(Judicial remand)లో ఉన్న చంద్రబాబును చూసి ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం భువనేశ్వరి, లోకేశ్‌తో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్‌ ద్వారా చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురైనట్టు సమాచారం. ములాఖత్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే భువనేశ్వరి, లోకేశ్‌ దుఃఖంతో నేరుగా బస కేంద్రానికి వెళ్లిపోయారు. ములాఖత్(Mulakat) అనంతరం కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఆయన మాట్లాడలేకపోతున్నట్లు చెప్పారు. జైల్లో ఆయన పరిస్థితి చూడగానే బాధ కలిగిందన్నారు.కాగా, తెలంగాణలో టీడీపీ పోటీకి సంబంధించి అధినేత నుంచి కాసాని పలు సూచనలు తీసుకున్నట్టు తెలుస్తోంది.