IKEA: బ్యాగ్‌కు రూ.20 వ‌సూలు చేసిన ఐకియా.. షాక్ ఇచ్చిన కోర్టు

ఐకియా(IKEA)కు వినియోగ‌దారుల కోర్టు షాక్ ఇచ్చింది. క‌స్ట‌మ‌ర్ ద‌గ్గ‌ర బ్యాగ్ కోసం రూ.20 వ‌సూళు చేసినందుకు కోర్టు ఫైన్(Fine) విధించింది. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా షాపింగ్ మాల్స్‌, సూప‌ర్ మార్కెట్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. చిన్న చిన్న‌దుకాణాల‌కు వెళ్లి షాపింగ్‌లు చేయ‌డం ఈ కాలంలో చాలా త‌క్కువైపోయింది. ఐకియా(IKEA), బిగ్‌బజార్(Big Bazaar), డీమార్ట్‌(DMart)ల వంటివాటికి ఎక్కువ ఆక‌ర్షితుల‌వుతున్నారు ప్ర‌జ‌లు. ఇక పండ‌గ సీజ‌న్ల‌లో ఎక్కువ శాతం మంది వీటికే ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అయితే, మాల్స్‌లో కానీ, సూప‌ర్ మార్కెట్ల‌లో కానీ […]

Share:

ఐకియా(IKEA)కు వినియోగ‌దారుల కోర్టు షాక్ ఇచ్చింది. క‌స్ట‌మ‌ర్ ద‌గ్గ‌ర బ్యాగ్ కోసం రూ.20 వ‌సూళు చేసినందుకు కోర్టు ఫైన్(Fine) విధించింది.

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా షాపింగ్ మాల్స్‌, సూప‌ర్ మార్కెట్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. చిన్న చిన్న‌దుకాణాల‌కు వెళ్లి షాపింగ్‌లు చేయ‌డం ఈ కాలంలో చాలా త‌క్కువైపోయింది. ఐకియా(IKEA), బిగ్‌బజార్(Big Bazaar), డీమార్ట్‌(DMart)ల వంటివాటికి ఎక్కువ ఆక‌ర్షితుల‌వుతున్నారు ప్ర‌జ‌లు. ఇక పండ‌గ సీజ‌న్ల‌లో ఎక్కువ శాతం మంది వీటికే ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అయితే, మాల్స్‌లో కానీ, సూప‌ర్ మార్కెట్ల‌లో కానీ షాపింగ్ చేసిన‌ప్పడు, ఆ మాల్ వారే ఒక క్యారీ బ్యాగ్‌ను ఇస్తారు. దానికి కూడా మ‌నం డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, కొన్ని మాల్స్‌లో క్యారీబ్యాగ్‌(Carrybag)లకు వాటి లోగో(Logo)లు ఉంటాయి. లోగోలు ఉన్న క్యారీ బ్యాగ్‌ల‌కు మ‌నం డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండదు. అయితే, బెంగుళూరు(Bangalore)లోని ఐకియా మాల్‌(IKEA Mall)లోని క్యారీబ్యాగ్‌ల‌కు లోగోలు ఉన్నాయి. అయినా స‌రే, వినియోదారుల‌ నుంచి ఆ మాల్ సిబ్బంది డ‌బ్బులు వ‌సూలు చేశారు. ఈ విష‌యంపై ఓ మ‌హిళ వినియోగ‌దారుల క‌మీష‌న్ ను సంప్ర‌దించింది. ఆ మాల్‌పై 20 రూపాయ‌ల క్యారీబ్యాగ్ కోసం 3 వేల రూపాయ‌ల ఫైన్(Fine) విధించింది వినియ‌యోగుదారుల కోర్టు.. ఆ వివ‌రాలేంటో చూద్దాం..    

ప‌ట్టించుకోని ఐకియా మాల్ యాజ‌మాన్యం: 

బెంగుళూరుకు చెందిన సంగీత బోహ్ర(Sangeet Bohra) అనే మ‌హిళ అక్టోబ‌ర్ 6న ఐకియా మాల్‌లో షాపింగ్(Shopping) చేసింది. ఆ షాపింగ్‌లో సంగీత 2 వేల 428 రూపాయ‌ల విలువైన వ‌స్తువుల‌ను కోనుగోలు చేయ‌డం జ‌రిగింది. అయితే, ఈ మాల్‌లో షాపింగ్ చేసేవారు ఇంటినుంచి బ్యాగ్‌ల‌ను తెచ్చుకోకూడ‌దు. అందుకోసం ఆమెకు ఓ క్యారీ బ్యాగ్ అవ‌స‌ర‌మైంది. అయితే అక్క‌డ వున్న సిబ్బందిని క్యారీ బ్యాగ్(Carry bag) అడిగింది సంగీత‌. అయితే ఐకియా లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌ను ఇచ్చి ఆమె నుంచి 20 రూపాయ‌ల‌ను వ‌సూలు చేశారు అక్క‌డి సిబ్బంది.

కంపెనీ లోగో(Logo) వున్న బ్యాగ్‌ల‌కు కూడా డ‌బ్బులు ఎలా వ‌సూలు చేస్తారంటూ సిబ్బందిపై వాద‌న‌కు దిగింది సంగీత‌. అయినా, అక్క‌డి యాజ‌మాన్యం ఏమాత్రం దాని గురించి ప‌ట్టించుకోలేదు. దాంతో ఆ మ‌హిళ స్టారో లోగో ఉన్న బ్యాగ్‌కు 20 రూపాయ‌లు ఎలా వ‌సూలు చేస్తారంటూ వినియోగ‌దారులు క‌మీష‌న్‌(Consumers Commission)ను ఆశ్ర‌యించింది. ఆ బ్యాగ్‌కు ఛార్జీ వ‌సూలు చేసినందుకు ప‌రిహారంగా మూడు వేల రూపాయ‌లు చెల్లించాలంటూ కోర్టును ఆశ్ర‌యించింది ఆ మ‌హిళ‌.

ఇర‌వై రూపాయ‌ల క‌వ‌రుకు వ‌డ్డీతో క‌లిపి న‌ష్ట‌ప‌రిహారంగా వెయ్యి రూపాయ‌లు, న్యాయ‌ప‌ర‌మైన ఖ‌ర్చులకు రెండువేల రూపాయ‌లు చెల్లించాలంటూ కోర్టును ఆదేశించింది. వ‌స్తువుల‌ను డెలివరీ చేసే క్ర‌మంలో అవ‌స‌ర‌మైన అన్నీ ఖ‌ర్చుల‌ను యాజ‌మాన్య‌మే భ‌రించాలంటూ స్టేట్ క‌మీష‌న్(State Commission) పేర్కొంది. ఇందులో ఇచ్చిన తీర్పు ప్ర‌కారం జ‌రిమానా విధించిన 30 రోజుల్లో న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలంటూ కోర్టు తీర్పు స్ప‌ష్టం చేసింది.

గతంలో… కెవిన్‌ సుకీర్తి అనే లా విద్యార్థిని 2020, జనవరి 26న హైదరాబాద్, హైటెక్ సిటీలోని ఐకియా స్టోర్(IKEA store)కు వెళ్ళారు. రూ.1,071 విలువజేసే వస్తువులను కొనుక్కున్నారు. అయితే, వాటికిగాను క్యారీ బ్యాగ్ ఇవ్వాలంటే రూ.20 ఇవ్వాల్సిందేనని బిల్లింగ్ కౌంటర్ వద్ద సిబ్బంది చెప్పారు. ఆ క్యారీ బ్యాగ్ పై ఐకియా లోగో ఉంది. ఈ తీరు దేశంలో వినియోగదారులకు సంబంధించిన పలు కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు ఇది విరుద్ధమని కెవిన్ సుకీర్తి అన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ ను ఆశ్రయించారు. కెవిన్ అన్ని ఆధారాలను సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఐకియాకు కమిషన్ రూ.6,020 జరిమానా విధించింది.

ఐకియా దేశంలోనే అతిపెద్ద స్టోర్‌ను తెరిచింది. 12.2 ఎకరాల విస్తీర్ణంలో 4,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్ సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కర్నాటకలోని బెంగళూరులో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేసిన ఐకియా.. భారీగా ఉద్యోగాల ప్రకటనను, భారీగా పెట్టుబడులను ప్రకటించింది. త్వరలోనే మరిన్ని ఐకియా స్టోర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.