ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో [PIB] కొత్త ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా పగ్గాలు పట్టిన IIS అధికారి రాజేష్ మల్హోత్రా

ప్రభుత్వ మీడియా విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌ గా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి రాజేష్ మల్హోత్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్ని రోజులుగా ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్న సత్యేంద్ర ప్రకాష్ మంగళవారం పదవీ విరమణ పొందిన తర్వాత.. 1989 బ్యాచ్ అధికారి రాజేష్ మల్హోత్రా నియమితులయ్యారు. ఇంతకు ముందు, ఆయన జనవరి 2018 నుండి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేశారు. ఈ విషయాన్ని […]

Share:

ప్రభుత్వ మీడియా విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌ గా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి రాజేష్ మల్హోత్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

ఇన్ని రోజులుగా ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్న సత్యేంద్ర ప్రకాష్ మంగళవారం పదవీ విరమణ పొందిన తర్వాత.. 1989 బ్యాచ్ అధికారి రాజేష్ మల్హోత్రా నియమితులయ్యారు. ఇంతకు ముందు, ఆయన జనవరి 2018 నుండి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేశారు. ఈ విషయాన్ని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.

 “ఆయన క్లిష్టమైన కోవిడ్ 19 మహమ్మారి సమయంలో, మంత్రిత్వ శాఖలో మీడియా, కమ్యూనికేషన్ విధానాన్ని సమర్థవంతంగా నడిపించారు. ప్రజలకు ఉపశమనం కలిగించడానికి, ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడానికి కాల క్రమేణా భారత ప్రభుత్వం ప్రకటించిన వివిధ ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడం వంటివి సమర్థ వంతంగా నిర్వహించారు.” అని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆయనకు ఈ రంగంలో 32 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఆర్థిక, కంపెనీ వ్యవహారాలు, వ్యవసాయం, విద్యుత్, బొగ్గు, గనులు, కమ్యూనికేషన్స్, ఐటి, టెక్స్‌టైల్స్, కార్మిక, కొత్త, పునరుత్పాదక ఇంధనంతో సహా అనేక కేంద్ర మంత్రిత్వ శాఖలతో పనిచేశారు. 1996 నుండి 2017 వరకు.. మల్హోత్రా భారత ఎన్నికల సంఘంతో కలిసి మీడియా, కమ్యూనికేషన్‌ను నిర్వహించారు.

శ్రీ రాజేష్ మల్హోత్రాకి ఘజియాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌ మెంట్ టెక్నాలజీ [IMT] నుండి బిజినెస్ మేనేజ్‌ మెంట్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా, హైదరాబాద్‌లోని NALSAR యూనివర్సిటీ ఆఫ్ లా నుండి మీడియా చట్టాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉన్నాయి.

బుధవారం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో ఇచ్చిన సమాచారం ప్రకారం, శ్రీ మల్హోత్రాకి ప్రభుత్వం, మీడియా మధ్య ప్రభుత్వ ప్రతినిధిగా ‘టూవే’ కమ్యూనికేషన్ ఛానెల్‌లను విజయవంతంగా స్థాపించిన అనుభవం ఉంది.

“ఆయన తన  కెరీర్‌లో వివిధ మంత్రిత్వ శాఖలలో తన వైవిధ్యమైన అసైన్‌మెంట్‌ ల సమయంలో సంక్షోభాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సరైన దృక్పథం, సమాచారం మాత్రమే మీడియాకు వ్యాప్తి చెందేలా చూసుకున్నారు” అని కూడా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తన పత్రికా ప్రకటనకు జోడించింది.

తన కెరీర్‌లో.. తను భారతదేశం నుండి వచ్చిన వివిధ మంత్రి వర్గ ప్రతినిధులలో అంతర్భాగంగా ఉన్నందున రాజేష్ మల్హోత్రా అంతర్జాతీయ సమావేశాలు లేదా ఈవెంట్‌ ల కోసం మీడియా కవరేజీని సమన్వయం చేయడంలో విస్తృత అనుభవం ఉంది. ఈయన రాక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఎటువంటి మార్పులను తేబోతోందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.