టమాటాలు తినకండి.. రేటు తగ్గుతుంది

ప్రస్తుతం టమాటాల రేటు ఆకాశాన్ని అంటుకుంది. బంగారం రేటు తో పోలిస్తే అసలు ఏమాత్రం తగ్గను అంటున్న టమాటా రేటు గురించి తెలిసిందే. అయితే ఇటీవల టమాటాలు రేటు తగ్గాలంటే, టమాటాలు తినడం ఆపేయండి లేదంటే టమాటా మొక్కలు ఇంట్లో పెంచుకోండి, అప్పుడు కచ్చితంగా టమాటా రేటు తగ్గుతుంది అని యూపీ మినిస్టర్ ప్రతిభా శుక్లా ఉదేశపడ్డారు.  ఇంట్లోనే మొక్కలు పెంచుకోండి:  శ్రీమతి శుక్లా యుపి ప్రభుత్వంలో నిర్వహించిన భారీ మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా ఆమె […]

Share:

ప్రస్తుతం టమాటాల రేటు ఆకాశాన్ని అంటుకుంది. బంగారం రేటు తో పోలిస్తే అసలు ఏమాత్రం తగ్గను అంటున్న టమాటా రేటు గురించి తెలిసిందే. అయితే ఇటీవల టమాటాలు రేటు తగ్గాలంటే, టమాటాలు తినడం ఆపేయండి లేదంటే టమాటా మొక్కలు ఇంట్లో పెంచుకోండి, అప్పుడు కచ్చితంగా టమాటా రేటు తగ్గుతుంది అని యూపీ మినిస్టర్ ప్రతిభా శుక్లా ఉదేశపడ్డారు. 

ఇంట్లోనే మొక్కలు పెంచుకోండి: 

శ్రీమతి శుక్లా యుపి ప్రభుత్వంలో నిర్వహించిన భారీ మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా ఆమె మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అంతేకాకుండా టమాట రేటు గురించి మాట్లాడుతూ, టమాటా రేట్లు తగ్గేందుకు చక్కని ఉపాయం కూడా చెప్పారు. ప్రస్తుతం ఉన్న టమాటో రేట్లు తగ్గాలి అంటే, టమాటాలు తినడం తగ్గించాలి లేదా టమాటా ముక్కలు ఇంట్లో పెంచుకోవాలి అంటూ చక్కని చిట్కా చెప్పారు యూపీ మినిస్టర్ ప్రతిభా శుక్ల. 

ప్రస్తుతం ఉన్న టమాటా రేట్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టమాటాలు రేటు ఆటోమేటిగ్గా తగ్గాలి అంటే, టమాటాలు ఉపయోగించడం తగ్గించాలి, టమాటాల బదులు నిమ్మకాయ ఉపయోగించాలి, అప్పుడు కచ్చితంగా టమాటా రేట్ తగ్గుతుంది అని శుక్లా చెప్పుకొచ్చారు. అయితే ఖరీదైన కూరగాయలు వంటల్లో వాడడం తగ్గించినట్లయితే, తప్పకుండా, ఆటోమేటిగ్గా ఆ కూరగాయల రేట్లు తగ్గుతాయి అని ఉద్దేశం పడ్డారు యూపీ మినిస్టర్ ప్రతిభ శుక్ల. 

టమాటా రేట్లు ఈ విధంగా ఉన్నాయి: 

ఢిల్లీలో లోకల్ మార్కెట్లలో కిలో  140 దాకా అమ్ముతున్నారు.ఉత్తర ప్రదేశ్, హర్యానాల నుండి సప్లై రానందువల్లనే ఢిల్లీలో రేట్ పెరిగింది అంటున్నారు. ఈ రేట్లు రానున్న రోజుల్లో తగ్గుతాయని గవర్నమెంట్ అంటుంది. వచ్చే నెల రోజుల్లో టమాటా రేట్లు నార్మల్ అవుతాయని గవర్నమెంట్ అంటుంది. ఒక నెల క్రితం వరకు కిలో టమాట ధర 20 రూపాయలుగా ఉండేది.

కానీ సీజన్ ఆలస్యం అవ్వడం వల్ల దీని రేటు భారీగా పెరిగింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో దాదాపు ప్రతి ఇంట్లో టమాటా వాడుతారు. ఇప్పుడు వాళ్లంతా దీని రేట్ పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. టమాటా వల్ల మన శరీరానికి కూడా చాలా లాభాలు ఉంటాయి దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరం ముడతలు పడకుండా కాపాడుతుంది. టమాటా సలాడ్స్ తో కలిపి తింటే మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. టమాట ధర హైదరాబాద్ లో దాదాపు కిలో 150 దాకా ఉంది. హైదరాబాద్ లో లోకల్ మార్కెట్లలో దీని రేటు ఇంకా ఎక్కువ చేసి అమ్ముతున్నారు. దాదాపు అన్ని మెట్రో సిటీలలో ఇదే పరిస్థితి. టమాటా ధర రానున్న రెండు వారాల్లో తగ్గాలంటే ముందుగా వర్షాలు పడాలి. వర్షాలు పడ్డాక ఆటోమెటిగ్గా దీని రేటు తగ్గిపోతుంది. ఒక నెలలో టమాటో ధర సాధారణ స్థాయికి వస్తుండొచ్చని గవర్నమెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఏదేమైనా ఈ రేట్లు చూసి చాలామంది నిరాశ చెందుతున్నారు. ఆకాశాన్నంటిన టమాట ధరలు త్వరలోనే తగ్గుముఖం పడతాయని అందరూ ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా టమాట ధరలు భారీగానే ఉన్నాయి. అక్కడ కిలో టమాటా ధర దాదాపు 120 పైగానే ఉంది. అక్కడ కూడా ప్రైవేట్ మార్కెట్లలో వీటి ధర ఎక్కువ చేసి అమ్ముతున్నారు. వీటి ధర త్వరలోనే తగ్గుముఖం పట్టాలని కోరుకుందాం.