రాహుల్ ప్రధానమంత్రి అయితే అవినీతి మాత్రమే ఉంటుంది

రాజస్థాన్లో అమిత్ షా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా టార్గెట్ చేశారు. అంతేకాకుండా ఒకవేళ రాహుల్ గనుక ప్రైమ్ మినిస్టర్ అయితే మన భారతదేశంలో స్కామ్స్ అలాగే కరప్షన్ ఎక్కువ అవుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా గత సంవత్సరంలో ఉదయ్పూర్ లో మరణించిన కన్హయ్య లాల్ కేస్ గురించి తను ఒక స్పెషల్ కోర్టుని సెటప్ చేయాలి అనుకుంటున్నారు.  అమిత్ షా మాటల్లో:  యూనియన్ మినిస్టర్ అమిత్ షా శుక్రవారం తీవ్రవాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ […]

Share:

రాజస్థాన్లో అమిత్ షా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా టార్గెట్ చేశారు. అంతేకాకుండా ఒకవేళ రాహుల్ గనుక ప్రైమ్ మినిస్టర్ అయితే మన భారతదేశంలో స్కామ్స్ అలాగే కరప్షన్ ఎక్కువ అవుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా గత సంవత్సరంలో ఉదయ్పూర్ లో మరణించిన కన్హయ్య లాల్ కేస్ గురించి తను ఒక స్పెషల్ కోర్టుని సెటప్ చేయాలి అనుకుంటున్నారు. 

అమిత్ షా మాటల్లో: 

యూనియన్ మినిస్టర్ అమిత్ షా శుక్రవారం తీవ్రవాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేస్తూ, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే మన భారతదేశంలో కరెక్షన్ అలాగే స్కాంలు తప్ప ఇంకేమీ ఉండవు అని పేర్కొన్నారు. ఒకవేళ నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గా మళ్లీ సభలోకి అడుగుపెడితే దుర్మార్గులు తప్పకుండా కటకటాల పాలవుతారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గత సంవత్సరంలో ఉదయ్పూర్ లో మరణించిన కన్హయ్య లాల్ కేస్ గురించి తను ఒక స్పెషల్ కోర్టుని సెటప్ చేయాలి అనుకుంటున్నారు. 

అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న అశోక్ గెహ్లాట్ గవర్నమెంట్ ఒక దొంగ గవర్నమెంట్ గా ఉందని, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో వారు దిగిపోవడం పక్కా అంటూ ధైర్యంగా చెప్పారు. అంతేకాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గవర్నమెంట్ని సృష్టించి సత్తా చూపనుందని, అంతేకాకుండా లోక్ సభ ఎన్నికలలో మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధానమంత్రి అవుతారని, తమకే 300 సీట్లు పక్కా అని చెప్పారు. 

ఉదయపూర్ సభ: 

ఉదయపూర్ లో జరిగిన పబ్లిక్ మీటింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ సాధించిన విజయాల గురించి ఆయన పేర్కొన్నారు గత తొమ్మిది సంవత్సరాలలో మన భారతదేశం ఎంతో గొప్పగా ఆఉద్భవించిందని ఆయన పేర్కొన్నారు. 

కన్నయ్య మర్డర్ కేస్: 

సస్పెండ్ అయిన బీజేపీ నేత నూపుర్ శర్మకు మద్దతుగా కంటెంట్ పోస్ట్ చేసినందుకు ఇస్లాం మతాన్ని అవమానించారని ఆరోపించి, గత ఏడాది జూన్ 28న ఉదయపూర్‌లో టైలర్గా జీవనాన్ని కడుపుతున్న కన్హయ్య  లాల్ను ఇద్దరు కత్తులతో తరిమి హత్య చేశారు. ప్రభుత్వం కన్హయ్య లాల్‌కు భద్రత కల్పించలేదని ఆరోపించిన షా, “సిగ్గుపడాలి” అని అన్నారు.

“కన్హయ్యకు భద్రత ఎవరు ఇవ్వలేదు? చనిపోయే వరకు పోలీసులు అసలు ఎందుకు మౌనంగా ఉన్నారు. మీరు (నిందితులను) పట్టుకోవాలని కూడా అనుకోలేదు, NIA వారిని పట్టుకుంది. గెహ్లాట్ జీ ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని అబద్ధం చెప్పకండి, ఛార్జ్ షీట్ డిసెంబర్ 22, 2022న దాఖలు చేసిందని నేను ఈ సభ ముఖంగా చెప్తున్నాను. ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసే పని మీదే తప్పకుండా ఉంటాము, త్వరలోనే కన్నయ్య హత్య కేసులో నిన్ను నిందితులను బయటికి తీసి ఉరిశిక్ష పడేలా చేస్తాం.”

“రాజస్థాన్ ప్రభుత్వం, హైకోర్టును తమ చేతుల్లోకి తీసుకుని, మేము చెప్పినప్పటికీ, ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయలేదు, లేకుంటే కన్హయ్య లాల్ హత్య కేసులోని ఉన్న దోషులకు ఈపాటికి ఉరిశిక్ష పడి ఉండేది. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే, వారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు” అని ఆయన అన్నారు. 

300 సీట్లు బీజేపీవే: 

“థాంక్స్ గివింగ్ యాత్రను ప్రారంభించిన నరేంద్ర మోదీ పార్టీ బీజేపీలో భాగంగా నేను కూడా ప్రత్యేకించి ఈ యాత్రలో పాల్గొన్నాను. సుమారు భారతదేశంలో నలుమూలల తిరిగాను. ప్రతి ఒక్కరు బీజేపీకి ఎంతో మద్దతు దారులుగా ఉన్నారు. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో, తప్పకుండా బిజెపి వే 300 సీట్లు. మళ్లీ నరేంద్ర మోదీయే భారతదేశానికి ప్రధానమంత్రి.” అంటూ అమిత్ షా దీమాని వ్యక్తం చేశారు.