అవి గర్జించడం మొదలు పెడితే ప్రపంచపటంలో పాక్ కనిపించదు

యూపీలోని బండాలో మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ.. యూపీ డిఫెన్స్ కారిడార్‌లో నిర్మించిన ఫిరంగులు గర్జిస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్ కనుమరుగైపోతుందన్నారు.  ఇండియాలో పెద్ద రాష్ట్రం ఉత్తర్​ప్రదేశ్. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా కానీ యూపీలో ఎవరు అధికారంలో ఉంటే వారే కేంద్రంలో అధికారంలో ఉంటారని చాలా మంది నమ్ముతారు. అందుకోసమే యూపీ ఎలక్షన్లో గెలుపే లక్ష్యంగా పోరాడుతుంటారు. అటువంటి యూపీ రాష్ట్రానికి […]

Share:

యూపీలోని బండాలో మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ.. యూపీ డిఫెన్స్ కారిడార్‌లో నిర్మించిన ఫిరంగులు గర్జిస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్ కనుమరుగైపోతుందన్నారు. 

ఇండియాలో పెద్ద రాష్ట్రం ఉత్తర్​ప్రదేశ్. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా కానీ యూపీలో ఎవరు అధికారంలో ఉంటే వారే కేంద్రంలో అధికారంలో ఉంటారని చాలా మంది నమ్ముతారు. అందుకోసమే యూపీ ఎలక్షన్లో గెలుపే లక్ష్యంగా పోరాడుతుంటారు. అటువంటి యూపీ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ దాయాది పాకిస్తాన్ గురించి పలు కామెంట్లు చేశారు. మన దేశంలో ఉన్న పసిపిల్లల దగ్గర్నుంచి పండు ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరికి పాక్ అంటే ఓ రకమైన కోపం. ఈ కోపానికి అనేక కారణాలు ఉన్నాయి. కేవలం రాజకీయ నాయకులనే కాకుండా సామాన్యులు కూడా పాక్ అంటే అస్యహించుకుంటారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి మన దేశంలో చాలా మంది వ్యక్తులకే తెలుసు. మన దేశానికి తదుపరి కాబోయే పీఎం యోగి అంటూ ఆయన అభిమానులు చెప్పుకుంటారు. కాషాయం ధరించే యోగికి ఎటువంటి కుటుంబం లేదు. ఆయన సిద్ధాంతాలు నచ్చని కొందరు ఆయన మరీ నియంతలా వ్యవహరిస్తున్నాడని అంటే.. కొంత మంది మాత్రం యోగి చేస్తున్నదే కరెక్ట్ అని అంటారు. డబుల్ ఇంజిన్ సర్కారుగా యోగి ప్రభుత్వం పేరు తెచ్చుకుంది. బుల్డోజర్లు అనే పదం యోగి వల్లే ఫుల్ ఫేమస్ అయింది. యోగి యూపీకి వరుసగా రెండో సారి కూడా సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సారి గెలవడం కష్టమే అని అనుకున్న చాలా మందికి యోగి దిమ్మతిరిగిపోయే జవాబు చెప్పారు. ఆయన రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. అవే పాత ఫార్ములాలతో ప్రభుత్వాన్ని నడుపుకుంటూ కొంత మందితో శభాష్ అని మరికొంత మందితో బాగా లేదు అని అనిపించుకుంటున్నారు. ఎవరెలా కామెంట్ చేసినా కానీ తన రూట్ మాత్రం ఇంతే అంటూ యోగి చెప్పకనే చెబుతున్నారు. దాయాది పాకిస్తాన్ అంటే మన దేశంలో పసిపిల్లాడి నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికీ కోపం ఉంటుంది. అలాగే కోపంతో ఉండే యూపీ సీఎం యోగి కూడా పాక్​పై ఎలా ఫైర్ అయ్యాడో ఇది చదవండి.

అవి గర్జిస్తే..

యూపీ రాష్ట్రంలో రక్షణ కారిడార్ నిర్మాణం జరుగుతుందని తెలిపిన యోగి.. ఇక్కడ తయారు చేసిన ఫిరంగులు గర్జించడం ప్రారంభిస్తే పాక్ గుండెల్లో వణుకు పుట్టడం ఖాయమని, ప్రపంచపటం నుంచి ఆ దేశం దానంతట అదే అదృశ్యమవుతుందన్నారు. భారత్ ఏరోస్పేస్, రక్షణ విభాగాల కోసం వేరే దేశాల మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.

రూ. 3700 కోట్లతో

యూపీలో ఇండస్ట్రియల్ కారిడార్​ను కేంద్ర ప్రభుత్వం 2018 ఆగస్టులో ప్రారంభించింది. దాదాపు రూ. 3700 కోట్లతో యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్​ను నిర్మిస్తున్నారు. యూపీని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.]

బుందేల్​ఖండ్ అభివృద్ధి కోసమే..

బుందేల్​ఖండ్ రీజియన్ అభివృద్ధి కోసమే బుందేల్​ఖండ్ ఎక్స్​ప్రెస్ హైవేను నిర్మించినట్లు యోగి తెలిపారు. ఈ హైవే నిర్మాణం వల్ల ఢిల్లీ–చిత్రకూట్ మధ్య ప్రయాణ సమయం 5.30 గంటలకు తగ్గిందని పేర్కొన్నారు. ​