ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 గూగుల్ డూడుల్

నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రపంచ కప్ 2023 ప్రారంభాన్ని, యానిమేటెడ్ డూడుల్‌తో గూగుల్ సెలబ్రేట్ చేసింది. ప్రపంచ కప్ 2023 గురించి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. గూగుల్ ప్రతిరోజు జరగబోయే ప్రత్యేకమైన సందర్భాలు గురించి డూడుల్ ద్వారా తెలియచేస్తూ ఉంటుంది. విదేశీ దేశాలు ఆడబోతున్న మొదటి మ్యాచ్ గురించి గూగుల్ తన డూడుల్ ద్వారా తెలియజేస్తుంది. అయితే అక్టోబర్ 5న […]

Share:

నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రపంచ కప్ 2023 ప్రారంభాన్ని, యానిమేటెడ్ డూడుల్‌తో గూగుల్ సెలబ్రేట్ చేసింది. ప్రపంచ కప్ 2023 గురించి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. గూగుల్ ప్రతిరోజు జరగబోయే ప్రత్యేకమైన సందర్భాలు గురించి డూడుల్ ద్వారా తెలియచేస్తూ ఉంటుంది. విదేశీ దేశాలు ఆడబోతున్న మొదటి మ్యాచ్ గురించి గూగుల్ తన డూడుల్ ద్వారా తెలియజేస్తుంది. అయితే అక్టోబర్ 5న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభయిన వరల్డ్ కప్ విశేషాలు గురించి మరింత తెలుసుకుందాం రండి.. 

వరల్డ్ కప్ విశేషాలు: 

డూడుల్ బ్యాక్ గ్రౌండ్ లో ప్రేక్షకుల మధ్యలో రెండు బాతులు వికెట్ల మధ్య నడుస్తున్నట్లు చూపిస్తుంది. Google హోమ్‌పేజీలో డూడుల్‌పై క్లిక్ చేసిన తర్వాత, మొత్తం టోర్నమెంట్ సంబంధించిన పూర్తి షెడ్యూల్‌, అదేవిధంగా స్కోర్ విషయాలు గురించి ప్రత్యేకమైన పేజీ ఓపెన్ అవుతుంది.

ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రపంచ కప్, ప్రపంచంలోని ప్రముఖ, అత్యధికంగా, అత్యంత ప్రజాదరణ పొందిన వన్డే అంతర్జాతీయ (ODI) క్రికెట్ మ్యాచ్‌లలో ఒకటి. టోర్నమెంట్‌లో, పది జట్లు కప్ కోసం పోటీపడతాయి. ఈ సంవత్సరం, చతుర్వార్షిక ఫ్లాగ్‌షిప్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం వంతు వచ్చింది, 1975లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ 13వ ఎడిషన్. ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమైంది, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ ప్రస్తుతం జరుగుతున్న క్రమం కనిపిస్తుంది.. అయితే మొదటి బ్యాటింగ్ ఇంగ్లాండ్ ఎంచుకున్నట్లు సమాచారం.

జట్టు వివరాలు: 

గ్రూప్ దశలో 45 మ్యాచ్‌లు జరగనున్నాయి, ఒక్కో జట్టు మిగతా అందరితో ఒకసారి తలపడాల్సి ఉంది. ఈ ఏడాది టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పాల్గొంటున్నాయి. అహ్మదాబాద్‌లో రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు మరియు ఒక కప్ ఫైనల్‌నాకౌట్ దశకు కేవలం నాలుగు జట్లు మాత్రమే చేరుకుంటాయి.

ఇదిలా ఉండగా, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, లక్నో, ధర్మశాల మరియు పూణెతో సహా వివిధ నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు కనిపిస్తుంది. అక్టోబరు 5న ICC క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ సందర్భంగా మోటేరా ప్రాంతంలోని నరేంద్ర మోదీ స్టేడియం, అదేవిధంగా అహ్మదాబాద్‌లోని ఇతర ప్రాంతాలలో సుమారు 3,500 మంది పోలీసులను మోహరించారు. జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, సెక్టార్ 1, చిరాగ్ కొరాడియా ప్రాంతంలో భద్రత మరింత పెంచుతున్నట్లు తెలపడం జరిగింది.

భద్రతా సెటప్‌ను పర్యవేక్షించడానికి 16 మంది ఐపిఎస్ అధికారులు స్టేడియం దగ్గరగా ఉంటారని… వివిధ జట్లు మధ్య జరగబోయే మ్యాచ్లకు సంబంధించి నరేంద్ర మోదీలో జరిగే తదుపరి మ్యాచ్‌లలో కూడా అమలు చేయడం జరుగుతుందని.. జాయింట్ కమీషనర్ చెప్పుకొచ్చారు.

అహ్మదాబాద్‌లో ప్రారంభ మ్యాచ్, అదేవిధంగా మరో నాలుగు టైలకు ముందు, BRTS జంక్షన్ నుండి స్టేడియంకు వెళ్లే రహదారిపై ఉదయం 11 గంటల నుండి అర్ధరాత్రి వరకు వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ పోలీసులు నోటిఫికేషన్ కూడా ఇప్పటికే జారీ చేశారు. ఏది ఏమైనాప్పటికీ ప్రతి ఒక్కరు ఎదురు చూసిన ప్రపంచ కప్ మొదలైపోయింది. ఇక అందరూ ఆశిస్తున్నట్లుగానే, ఎటువంటి ఆటంకం కలగకుండా భారతదేశ జట్టు ఎప్పటిలాగే తనదైన శైలిలో ఆడుతూ ముందుకు సాగాలని, ప్రపంచ కప్ సాధించి చూపించాలని మనమందరం కోరుకుందాం.