వైసీపీ నాయకులకు ట్రైనింగ్ ఇస్తున్న ఐప్యాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు వాలంటీర్లు (Grama Volunteer) గురించి సంచలన ఆరోపణలు చేశారు, ప్రజల వద్ద నుండి వాలంటీర్లు ముఖ్యమైన డేటా సేకరిస్తున్నారు అని వారి వలనే హ్యుమన్ ట్రాఫికింగ్ పెరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు.  ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కోసం పని చేస్తుంది, వివిధ పథకాలు గురించి, అలాగే విపక్షాలను […]

Share:

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు వాలంటీర్లు (Grama Volunteer) గురించి సంచలన ఆరోపణలు చేశారు, ప్రజల వద్ద నుండి వాలంటీర్లు ముఖ్యమైన డేటా సేకరిస్తున్నారు అని వారి వలనే హ్యుమన్ ట్రాఫికింగ్ పెరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. 

ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కోసం పని చేస్తుంది, వివిధ పథకాలు గురించి, అలాగే విపక్షాలను ఎదుర్కోవడానికి ఐ ప్యాక్ వివిధ వర్గాల నుండి కొంత సమాచారాన్ని సేకరించి వైసీపీ కు అందించింది. జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద చేసిన ఆరోపణలు వైసీపీ పార్టీకి నష్టం కలిగించే లాగా ఉన్నాయి, దాంతో ఆ వ్యాఖ్యలపై కౌంటర్ ఇవ్వడానికి మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐ-ప్యాక్ (I-PAC) సభ్యులు రంగలోకి దిగారు. 

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాత కొంతమంది ప్రజలు వాలంటీర్లకు వారి సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు మరికొంతమంది వాలంటీర్ల వ్యవస్థ ను వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితి చక్కదిద్దే పనిలో ఐ ప్యాక్  (I-PAC)ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఉన్న వైసీపీ(YCP) నాయకులతో చర్చలు జరుపుతున్నారు, వాలంటీర్లు డేటా సేకరిస్తున్నారు అనే విమర్శలను ఎదుర్కోవడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు ఇలా అందరి వైకాపా నాయకులను సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వంతో పోల్చితే వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన పథకాల గురించి అవగాహన కల్పిస్తున్నారు, అంతే కాకుండా వైకాపా నాయకులు , కో ఆర్డినేటర్ లు మీడియా తో ఎలా మాట్లాడాలి అని మార్గనిర్దేశం చేస్తున్నారు. 

రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు, బడ్జెట్ కేటాయింపులు, ప్రజలకు వివిధ పథకాల ద్వారా అందిస్తున్న రుణాలు, సంక్షేమ పధకాలు వాటితో ప్రజలకు అందుతున్న లాభాన్ని వివరంగా చెప్పడానికి డేటాను ప్రజా ప్రతినిధులకు ఇస్తున్నారు. 

ముందుగా మేము ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి మీడియా కు అవగాహన కల్పించాలి అనుకుంటున్నాము, నాయకులకు కూడా రాబోయే ఎన్నికల్లో తమ స్థానాలను బలోపేతం చేయడానికి కావాల్సిన వ్యూహాలను అందిస్తున్నాము అని ఒక ఐ ప్యాక్ ప్రతినిధి వెల్లడించారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం వలన రాష్ట్రంలో మహిళల కిడ్నాపింగ్ పెరిగింది అని ఆరోపించారు, కేంద్రం ఇచ్చిన గణాంకాల ఆధారంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను అని ఆయన అన్నారు. తాను వాలంటీర్ వ్యవస్థ కు వ్యతిరేకం కాదు అని కానీ వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం ఎవరి దగ్గర ఉంది అని ప్రశ్నిస్తున్నాను అని అన్నారు. వాలంటీర్లకు బాస్ ఎవరూ అని ప్రభుత్వం చెప్పడం లేదు, అలాంటప్పుడు వాలంటీర్లకు ద్వారా సమాచారం ఎలా సేకరిస్తారు అని అన్నారు. 

పుట్టుమచ్చలు తప్ప ప్రజల గురించిన పూర్తి సమాచారం వాలంటీర్ల దగ్గర ఉంది అని తెలుగుదేశం పార్టీ( Telugudesam Party) ప్రతినిధి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దాంతో రాష్ట్ర ప్రజల్లో వాలంటీర్ వ్యవస్థ మీద వ్యతిరేకత వ్యక్తమైంది, దీనిని సరిదిద్దుకునే ప్రయత్నంగా ఐ ప్యాక్ వివిధ రకాల పోల్స్ కూడా నిర్వహిస్తుంది.