మ‌ణిపూర్ బాధితుల‌ను క‌లిసిన స్వాతి మ‌లివాల్

మే 4న మణిపూర్‌లో నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళల కుటుంబాలను ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ మంగళవారం కలిశారు, దీనికి సంబంధించిన వీడియో గత వారం వైరల్‌గా మారింది. “మణిపూర్‌లో క్రూరత్వానికి గురైన కుమార్తెల కుటుంబాన్ని కలిశారు… వారి కన్నీళ్లు నన్ను ఎక్కువసేపు నిద్రపోనివ్వలేదు” అని మలివాల్ వీడియోను పంచుకుంటూ ట్వీట్ చేశారు. “ఇప్పటి వరకు వారిని కలవడానికి ఎవరూ రాలేదు,” అని ఆమె చెప్పారు. మణిపూర్ రాష్ట్రంలో సోమవారం నుంచి పర్యటనలో […]

Share:

మే 4న మణిపూర్‌లో నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళల కుటుంబాలను ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ మంగళవారం కలిశారు, దీనికి సంబంధించిన వీడియో గత వారం వైరల్‌గా మారింది. “మణిపూర్‌లో క్రూరత్వానికి గురైన కుమార్తెల కుటుంబాన్ని కలిశారు… వారి కన్నీళ్లు నన్ను ఎక్కువసేపు నిద్రపోనివ్వలేదు” అని మలివాల్ వీడియోను పంచుకుంటూ ట్వీట్ చేశారు. “ఇప్పటి వరకు వారిని కలవడానికి ఎవరూ రాలేదు,” అని ఆమె చెప్పారు.

మణిపూర్ రాష్ట్రంలో సోమవారం నుంచి పర్యటనలో ఉన్న ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.జాతుల మధ్య ఘర్షణలతో రక్తమోడుతున్న మణిపూర్‌లో పర్యటిస్తున్న ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ (డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో దూరాన ఉన్న ఢిల్లీ నుంచి తాను మణిపూర్ వచ్చి బాధితులను కలువగలిగానని, మరి, ఈ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఎందుకు కలువలేదని ఆమె ప్రశ్నించారు. సీఎం ఎన్ బీరెన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మణిపూర్‌లో మే 4వ తేదీన ఇద్దరు యువతులు నగ్నంగా ఊరేగించి ఆపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఓ వీడియో వైరల్ కావడంతో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో మరో తల్లి తన గర్భశోకాన్ని వివరిస్తూ కన్నీరైంది.ఇల్లు గడవడానికి, ఆర్థిక సహాయపడటానికి నా కూతురు ఇంఫాల్‌లోని ఓ కార్ వాష్ ఫెసిలిటీలో పని చేసేది. మా గ్రామానికే చెందిన మరో యువతితో కలిసి అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉండేది’ అని ఆమె చెప్పింది. ‘హింస చెలరేగడంతో నేను భయాందోళనలకు గురయ్యాను. నా బిడ్డకు తరుచూ ఫోన్ చేశాను. కానీ, ఆమె నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత నా ఫోన్‌ను ఓ మైతేయి మహిళ లిఫ్ట్ చేసింది. నీ బిడ్డ నీకు ప్రాణాలతో కావాలా? విగత జీవై కావాలా? అని అడిగింది. ఫోన్ కట్ చేసింది’ అని ఆ తల్లి కన్నీరు రాలుతుండగా చెప్పింది. ఆ సమయంలో తన గుండె బద్ధలైందని పేర్కొంది.

‘ఆ తర్వాత తెలిసింది నా బిడ్డను చంపేశారని.. నా కేసు గురించి కూడా పోలీసులు లేదా ఇతర ఏ అధికారుల నుంచీ సమాచారం రాలేదు’ అని ఆమె చెప్పింది.

 అదే రోజున ఇదే జిల్లాలో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వైరల్ వీడియో ద్వారా బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

మలివాల్ ఆదివారం మధ్యాహ్నం జాతి కలహాలతో దెబ్బతిన్న రాష్ట్రానికి చేరుకున్నారు మరియు మణిపూర్‌ను సందర్శించడం ద్వారా తనకు రాజకీయాలతో సంబంధం లేదు అని, ప్రజలకు సహాయం చేయాలని అన్నారు. ప్రజల కష్టాలను పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేస్తానని మలివాల్ చెప్పారు.

తన పర్యటనలో అత్యవసరంగా సమావేశం కావాలని మణిపూర్ ముఖ్యమంత్రిని కూడా కోరినట్లు మలివాల్ తెలిపారు. ‘‘మణిపూర్ సీఎం నుంచి సమయం కోరాను. అతడిని కలుసుకుని లైంగిక వేధింపుల బాధితులను పరామర్శించేందుకు తన వెంట రావాల్సిందిగా అభ్యర్థిస్తాను’ అని ఆమె ఆదివారం ట్వీట్ చేశారు.

 అయితే డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ బాధిత కుటుంబాలను కలిసి వారిని పరామర్శించారు. గుండెలకు హద్దుకుని ఓదార్చారు. వారికి సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు.  సోమవారం నుంచి ఆమె మణిపూర్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.