ఆదివాసీ కాళ్లు క‌డిగిన సీఎం

ఒక ఆదివాసీ ఇంకో ఆదివాసీ మీద మూత్రం పోయడం మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. చీఫ్ మినిస్టర్ శివరాజ్ చౌహాన్ ఆ ఆదివాసిని క్షమాపణ కోరాడు. తర్వాత ఆదివాసి కాళ్లను కడిగి క్షమాపణ కోరాడు.  ఆదివాసీ పై దారుణం: ద‌శ‌ర‌థ్‌ రావత్ అనే వ్యక్తిపై శుక్లా ఇంకో వ్యక్తి మూత్రం పోయడం రాష్ట్రంలో పెద్ద కలకలమే రేపింది. స్వయంగా ముఖ్యమంత్రి చౌహన్ తన ఇంటికి వెళ్లి క్షమాపణ కోరాడు. ఇంకా చౌహాన్ ఆ ఆదివాసీకి గవర్నమెంట్ బెనిఫిట్స్ […]

Share:

ఒక ఆదివాసీ ఇంకో ఆదివాసీ మీద మూత్రం పోయడం మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. చీఫ్ మినిస్టర్ శివరాజ్ చౌహాన్ ఆ ఆదివాసిని క్షమాపణ కోరాడు. తర్వాత ఆదివాసి కాళ్లను కడిగి క్షమాపణ కోరాడు. 

ఆదివాసీ పై దారుణం:

ద‌శ‌ర‌థ్‌ రావత్ అనే వ్యక్తిపై శుక్లా ఇంకో వ్యక్తి మూత్రం పోయడం రాష్ట్రంలో పెద్ద కలకలమే రేపింది. స్వయంగా ముఖ్యమంత్రి చౌహన్ తన ఇంటికి వెళ్లి క్షమాపణ కోరాడు. ఇంకా చౌహాన్ ఆ ఆదివాసీకి గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయా లేదా అని అడిగాడు. తన ప్రాబ్లమ్స్ ఏంటో అడిగి తెలుసుకున్నాడు. చౌహాన్ ట్విట్టర్లో ఆదివాసి  ఫోటో షేర్ చేస్తూ దస్మత్ జీ ఇప్పటినుండి మీరు నా ఫ్రెండ్, మీకు జరిగినదానికి నేను సిగ్గు పడుతున్నాను, నేను మీకు సారీ చెప్తున్నాను అని రాశాడు. సీఎం ని కలిసాక తనకు ఆనందంగా ఉందని రావత్ తెలియజేశాడు. రావత్ మీద మూత్రం పోసిన ప్రవేశ్ శుక్లాని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్లా రావత్ మీద మూత్రం పోస్తూ స్మోకింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది దీనికి పొలిటికల్ సెగ కూడా తగిలింది. శుక్లా మీద గట్టి చర్య తీసుకోవాలని పోలీసులకు సీఎం ఆదేశాలు జారీ చేశాడు.

ఆదివాసీలపైనై ఎందుకిలా? :

ఆదివాసీలు చాలా వెనుకబడి ఉంటారు. వారికి సరైన సదుపాయాలు కూడా ఉండవు. అయినప్పటికీ వాళ్లు కష్టపడుతూ బతుకుతుంటారు. మన సొసైటీలో ఎప్పటినుండో వీరి మీద చిన్నచూపు ఉంది. వీళ్లకు సరైన తిండి ఉండదు. సరైన విద్య ఉండదు. సరైన సదుపాయాలు ఉండవు. వీళ్లకు ఏదైనా ప్రమాదం వస్తే రోడ్డు కూడా దగ్గరలో ఉండదు. అయినప్పటికీ వీళ్ళు కష్టపడతూ జీవిస్తున్నా ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం. దాదాపుగా ప్రతిరోజు సరైన సదుపాయాలు లేక ఎంతోమంది ఆదివాసీలు అసౌకర్యానికి గురవుతున్నారు. మన దేశం చాలా విషయాల్లో ముందడుగులు వేస్తున్నా వీళ్ళ విషయంలో మాత్రం ఇంకా వెనకబడే ఉంది. ఇకమీదటైనా ప్రభుత్వాలు వీళ్ళ మీద దృష్టి పెడితే బాగుంటుంది.  ఆదివాసీలను ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ముందుగా వాళ్లకు సరైన చదువు అందించాలి. చదువుకోవడం వల్ల వాళ్లలో నాగరికత పెరుగుతుంది. వాళ్లకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్ని విషయాలు ఆలోచించి చేస్తారు. అప్పుడు ఇలాంటి సంఘటనలు జరగవు. ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి మూత్రం పోయడం అంటే ఎంత అనాగరిక చర్యనో ఆలోచించండి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం అన్ని విషయాల్లో ముందుకు వచ్చి వీళ్ళని ఆదుకుంటే వీళ్ళకి ఎంతో కొంత ఆసరా లభిస్తుంది. దేశం మొత్తం శివరాజ్ చౌహాన్ లాగా ముందడుగు వేస్తే అప్పుడు ఇటువంటి దుర్ఘటనలు జరగవు. ఏది ఏమైనా ఆదివాసీల ని జాగ్రత్తగా చూసుకొని వాళ్లకు నాగరికత నేర్పి మన సొసైటీలో ఒక మంచి ప్లేస్ లో ఉంచడం మనందరి బాధ్యత. ఇప్పటినుంచైనా ఆదివాసీల విషయంలో ఇలాంటివి జరగకుండా ఉండాలని ఆశిద్దాం. ఈ మధ్యప్రదేశ్ లో జరిగిన ఘటనే ఆఖరిది అవ్వాలని కోరుకుందాం.