పార్కింగ్ చేస్తాన‌ని చెప్పి ల‌గ్జ‌రీ కార్ల దోపిడీ

అనిల్ రావిపూడి మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో గతంలో ‘సుప్రీమ్’ అనే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని కామెడీ కి మనమంతా కడుపుబ్బా నవ్వుకున్నాం. ఈ చిత్రంలోని 30 ఇయర్స్ పృథ్వి మరియు ప్రభాస్ శ్రీను కి సంబంధించి ఒక హిలేరియస్ సీక్వెన్స్ ఉంటుంది. కార్ పార్కింగ్ పేరుతో తాళాలను తీసుకొని, కార్లని దొంగలిస్తూ ‘జింగ్ జింగ్ అమేజింగ్’ అంటుంటారు ఈ తోడుదొంగలిద్దరూ. ఇలాంటి సన్నివేశాలను దర్శకులు […]

Share:

అనిల్ రావిపూడి మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో గతంలో ‘సుప్రీమ్’ అనే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని కామెడీ కి మనమంతా కడుపుబ్బా నవ్వుకున్నాం. ఈ చిత్రంలోని 30 ఇయర్స్ పృథ్వి మరియు ప్రభాస్ శ్రీను కి సంబంధించి ఒక హిలేరియస్ సీక్వెన్స్ ఉంటుంది. కార్ పార్కింగ్ పేరుతో తాళాలను తీసుకొని, కార్లని దొంగలిస్తూ ‘జింగ్ జింగ్ అమేజింగ్’ అంటుంటారు ఈ తోడుదొంగలిద్దరూ. ఇలాంటి సన్నివేశాలను దర్శకులు బయట మన నిజజీవితంలో జరిగేవాటిని ఆధారంగా తీసుకొనే తెరకెక్కిస్తారని రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఒక సంఘటన చూస్తే అర్థం అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే 29 ఏళ్ళ వయస్సు ఉన్న బి అరుణ్ రెడ్డి కుర్రాడు ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో వెబ్ డెవలపర్ గా పని చేస్తున్నాడు. ఇతగాడికి వ్యాలెట్ పార్కింగ్ పేరు తో కార్లను దొంగిలించడం అనేది సరదా అట.

పార్కింగ్ చేస్తానంటూ చోరీ :

ఇక రీసెంట్ గానే ఒక అమ్మాయి హై ఎండ్ బ్రాండెడ్ కంపెనీ కారు లో ఒక మ్యూజిక్ కన్సర్ట్ కి వచ్చిందట. అక్కడ కార్ పార్కింగ్ చేసే స్టాఫ్ గా ఎదురు చూస్తూ ఉన్న అరుణ్, కోట్ల రూపాయిల విలువ చేసే కారుని చూసి ఆయన కళ్ళు ఒక్కసారిగా జిగేలుమన్నాయట. కొడితే ఇలాంటి కార్ కొట్టేయాలని అనుకున్న అరుణ్ , ఆ అమ్మాయి దగ్గర కార్ పార్కింగ్ చేస్తానని తాళాలు తీసుకొని అనంతరం ఆ కుర్రాడు పరారు అయ్యాడట. ఆ తర్వాత తన కారు ఎటు పోయిందని ఆ అమ్మాయి మ్యూజిక్ కన్సర్ట్ ని నిర్వహిస్తున్న ఫంక్షన్ హాల్ యాజమాన్యం ని నిలదీసి పెద్ద గొడవ చేసిందట. అనంతరం ఆమె మీ స్టాఫ్ కి ఇచ్చి కార్ ని పార్క్ చెయ్యమన్నాను అని చెప్పగా, మా స్టాఫ్ వీళ్ళే అని చూపించారట. వీళ్ళలో లేరు, మీ స్టాఫ్ అతనే ఎవరో నా కారుని దొంగలించుకొని తీసుకెళ్లారు అని చెప్పుకొచ్చింది.

అప్పుడు సీసీటీవీ కెమెరా ని చెక్ చెయ్యగా , ఆ కారు దొంగలించిన వ్యక్తితో మాకు ఎలాంటి సంబంధం లేదు, అతను ఎవరో మాకు తెలియదు అని చెప్పారట. అనంతరం ఆ అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ చెయ్యగా, వెతికి పట్టుకొని కార్ ఆ అమ్మాయికి తిరిగి ఇచ్చారట. అనంతరం పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారించగా, గత ఏడాది కూడా ఆయన ఇలాగే ఒక కాస్టలీ కారుని దొంగలించి తన ఇంట్లో పెట్టుకున్నాడట, ఆ కారుని పోలీసులు అతని ఇంటి వద్ద స్వాధీన పర్చుకున్నారు. లక్షణంగా ఉద్యోగం చేసుకుంటున్న ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లోయ్ ఇలాంటి పనులు చెయ్యడం సిగ్గు చేటు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇతగాడి దెబ్బకి వ్యాలెట్ పార్కింగ్ కోసం స్టాఫ్ కి తాళాలు ఇచ్చేందుకు జనాలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇతను అంటే దొరికిపోయాడు కాబట్టి తెలిసింది, కానీ సిటీ లో ఇలాంటి సంఘటనలు గతం లో లెక్కలేనన్ని జరిగాయి, వాళ్ళందరూ దర్జాగా లగ్జరీ కార్స్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. దీనికి పోలీసులు కూడా ఏమి చెయ్యలేరు, మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. సదరు కంపెనీ కి సంబంధించిన ఐడెంటిటీ కార్డు లేకపోతే కార్ తాళాలు ఇవ్వకండి.