వెకిలి చేష్టలకు చెక్ పెడుతున్న SHE టీం

ప్రస్తుతం దేశంలో చాలా చోట్ల ఆడవాళ్లకు అసలు రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడపడితే అక్కడ ఆడవాలని వేధించడం, వెకిలి చేష్టలు వేయడం కొంతమందికి అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు షీ టీం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆడవాళ్లు ఎక్కడ ఉన్నా వారు ఒకవేళ వేధింపులకు గురి అవుతున్నట్లు తెలిస్తే వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు షీ టీం.  ఇటీవల SHE టీం క్లియర్ చేసిన కేసులు: ఒక అమ్మాయి ఫొటోస్ […]

Share:

ప్రస్తుతం దేశంలో చాలా చోట్ల ఆడవాళ్లకు అసలు రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడపడితే అక్కడ ఆడవాలని వేధించడం, వెకిలి చేష్టలు వేయడం కొంతమందికి అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు షీ టీం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆడవాళ్లు ఎక్కడ ఉన్నా వారు ఒకవేళ వేధింపులకు గురి అవుతున్నట్లు తెలిస్తే వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు షీ టీం. 

ఇటీవల SHE టీం క్లియర్ చేసిన కేసులు:

ఒక అమ్మాయి ఫొటోస్ ని వాట్సాప్ డీపీగా పెట్టుకుని, ఆమె ఫొటోస్ను బంధువులకు షేర్ చేయడం, ఆమెపై పుకార్లు పుట్టిస్తూ వేధిస్తున్న డెలివరీ బాయ్ భరత్ కుమార్, హైదరాబాద్ షీ టీమ్స్‌కు పట్టుబడి శనివారం జైలుకు వెళ్ళాడు. అయితే ఆ అమ్మాయిని వేధించిన భరత్‌కు ఎనిమిది రోజుల జైలు శిక్ష పడింది. మరో కేసులో డ్రైవర్‌గా పనిచేస్తున్న కె.చందు అనే వ్యక్తి గత ఐదు నెలలుగా ఓ మహిళను వేధిస్తూ, ఆమెను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతూ ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

అంతేకాకుండా, ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళను వేధిస్తున్న షేక్ కుతుబుద్దీన్‌కు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించడం జరిగింది. ఎప్పుడు బస్సులో ప్రయాణించే ఒక మహిళను, తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టి ట్రాప్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ ఎం. రమేష్ రెడ్డికి కూడా ఎనిమిది రోజుల జైలు శిక్ష పడింది. ఇప్పటివరకు, జూలైలో, వివిధ కేసులలో మహిళలను వేధిస్తున్న 19 మంది వ్యక్తులను షీ టీమ్స్ పట్టుకున్నాయి. 

పెరుగుతున్న అత్యాచారాలు: 

భారతదేశంలో ఇప్పటికే ఎన్నో అత్యాచారాలు ప్రతిరోజు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దేశంలో నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చినప్పటికీ, ఏదో ఒక చోట ఒక అమ్మాయి బలైపోతుంది. ఒకపక్క టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నప్పటికీ, మరో పక్క ఇలాంటి అవాంఛిత కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి. అసలు దీనంతటికీ కారణం ఏంటి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే.. మనుషులం అనే మర్చిపోవడం. దేశానికి ఆడవాళ్ళకి రక్షణ కొదవ అయిందని ఇలాంటి వార్తలు వింటేనే అర్థం అవుతుంది. ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఎక్కడికి వెళ్లాలన్నా, తమ పనులు తమ చేసుకోవాలి అన్నా, పోకిరి వాళ్ళ వెకిలి చేష్టలు కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలను కూడా విడిచిపెడుతున్నారు. 

కొంతమంది ఆడవాళ్లు ధైర్యంగా ఉన్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో, బ్లాక్ మెయిల్ చేయడం కారణంగా, తమ సొంత కుటుంబ సభ్యులను చంపేస్తాను అని బెదిరించిన కారణంగా, ఉద్యోగం పోతుందేమో అని, తన వల్ల తన కుటుంబ సభ్యుల పరువు పోతుందేమో అని, ఉద్యోగం లో మళ్ళీ కష్టమవుతుందేమో, ఇలా అనేక రకాలుగా అనేక సందర్భాలలో ఆడవాళ్లు కష్టాలకు ఎదురిదాల్సి వస్తుంది. అసలు ఆడవాళ్లు ఎందుకు ఇటువంటి కష్టాలు పడాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ ఆడవాళ్ళకి స్వతంత్రం ఎందుకు లేదు? ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? వీటన్నిటికీ చెక్ పెట్టేందుకే షీ టీం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి సమస్య ఎదురైనా ఆడవాళ్లు తమ కష్టాలను స్వేచ్ఛగా చెప్పుకునే వెసులుబాటు షీ టీం కల్పిస్తుంది. అదే విధంగా కష్టపెట్టిన వారికి తప్పకుండా శిక్ష పడేలా చేస్తుంది షీ టీం.