TSSPDCL అధికారిణి ప‌ట్ల పోలీస్ అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

చైతన్యపురి పోలీస్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ కిషన్ సింగ్, నెల రోజుల క్రితమే విధుల్లోకి అడుగుపెట్టాడు. అయితే కిషన్ సింగ్ పై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, కిషన్ సింగ్ తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL)లో ఒక లేడీ ఎంప్లాయి ని,  రొమాంటిక్ వీడియోలు, పాటలు, మెసేజ్లు ద్వారా పంపిస్తూ ఇబ్బంది పెడుతున్నట్లు ఆవిడ చేసిన ఫిర్యాదు ప్రకారం  పోలీస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విషయమేమిటి:  […]

Share:

చైతన్యపురి పోలీస్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ కిషన్ సింగ్, నెల రోజుల క్రితమే విధుల్లోకి అడుగుపెట్టాడు. అయితే కిషన్ సింగ్ పై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, కిషన్ సింగ్ తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL)లో ఒక లేడీ ఎంప్లాయి ని,  రొమాంటిక్ వీడియోలు, పాటలు, మెసేజ్లు ద్వారా పంపిస్తూ ఇబ్బంది పెడుతున్నట్లు ఆవిడ చేసిన ఫిర్యాదు ప్రకారం  పోలీస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

విషయమేమిటి: 

గత కొంతకాలం క్రితం కిషన్ సింగ్ కు ఆమెకు పరిచయం ఉంది. అయితే ఈమె రక్షణ కొరకు కిషన్ సింగ్ కు ఫోన్ నెంబర్ ఇచ్చినట్లు, అప్పటినుంచి ఆమె ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులు అతని ఫోన్ కాల్స్ మెసేజెస్ ఇగ్నోర్ చేశానని ఆమె చెప్పారు. అయితే ఈ విషయంపై బాధితురాలు పోలీసులను సంప్రదించడం జరిగింది, ప్రస్తుతం కిషన్ సింగ్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

27వ సంవత్సరం కిషన్ సింగ్, రంగారెడ్డి జిల్లాలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తుండగా, లొంగిపోయిన లేడీ మావోయిస్టునీ చంపిన ఘటనలో, అతనికి వివిధ శిక్షణలపై కేసు నమోదు అయినట్లు పోలీసులు చెప్పారు. మావోయిస్టు తో కిషన్ సింగ్ కి సంబంధాలు ఉన్నట్లు కిషన్ సింగ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తప్పినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, ఆమె పెళ్లి విషయం ప్రస్తావించినందున ఆమెను కిషన్ సింగ్ చంపారని పోలీస్ వర్గాలు తెలిపాయి.

ఆడవారికి రక్షణ కరువు: 

ఇలాంటి సంఘటనలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి పోలీస్ వర్గాల్లోనే కాక అన్ని వర్గాల్లో కూడా ఆడవారిపై అత్యాచారాలు దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు. దీనిపై ప్రత్యేక దృష్టి చూపిన సుప్రీంకోర్టు గతంలో కొన్ని మార్పులను చట్టాల ద్వారా తెచ్చింది కానీ ఏమీ తేడా కనిపించలేదు. ఇలాంటివి దేశమంతా ఎన్నో జరుగుతున్న నోరు మెదిపే వారు ఎవరూ లేరు.

కిషన్ సింగ్ కేసులో పోలీసు వారికి అందిని రిపోర్ట్ ప్రకారం, ఇతను గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగినిని మానసికంగా వేధిస్తున్నట్లు, అయితే ఆమె బిజెపిని మరియు కమిషనర్ ని పేర్కొంటూ, ఈమెకు న్యాయం జరగాలని వాళ్లని గట్టిగా ప్రశ్నించినట్లు కంప్లైంట్ లో ఉందని పోలీస్ రిపోర్ట్ చెప్తుంది.

ఎందుకు ఈ నటన?: 

కొంతకాలం క్రితం మహారాష్ట్రలో చైన్ గ్యాంబ్లింగ్ కేసులో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళలపై ఇన్స్పెక్టర్ అసభ్యంగా ప్రవర్తించడం వల్ల కేసు నమోదు అయింది. కేసు దర్యాప్తు చేసి అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. 

కొన్ని సెక్షన్ల పై కేసు నమోదు చేసినట్లు సృష్టించి వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసినట్లు తదుపరి విచారణలో తేలింది. దీన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో కేసు క్లోజ్ చేశారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.

కిషన్ సింగ్ ఇటీవల కేసులో, పోలీసులకు లభించిన ఆధారాల ప్రకారం, కిషన్ సింగ్ మొబైల్ ఫోన్ మెసేజెస్ స్క్రీన్ షాట్స్, ఇంకా మరిన్ని వివిధ ఆధారాలను సేకరించి, ఆమె వద్ద నుంచి కూడా ఆధారాలను సేకరించి కిషన్ రెడ్డి పై అండర్ సెక్షన్ 354d కింద కేసు నమోదు చేశారు. అయితే ఆమెకు ఇష్టం లేకపోయినా కొన్ని విషయాలలో బలవంతం పెట్టినట్లు ఆమె దాని వల్ల చాలా ఇబ్బంది పడినట్లు తెలిపారు. పోలీస్ వర్గాలు అతన్ని కస్టడీలోకి తీసుకొని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కిషన్ సింగ్ ఇది వరకే పాత నేరస్తుడని, ఇతను క్రిమినల్ చరిత్రలో, 2007లో ఒక హత్య చేసినందుకు ఇతను ఒక శిక్ష పడిందని, మళ్లీ ఇంచుమించుగా అటువంటివి ఇప్పుడు కూడా పాల్పడుతున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతానికి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో తెలియాల్సి ఉంది. పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు