రూ.30 లక్షల డైమండ్ రింగ్ దొంగలించిన హైదరాబాద్ యువతి….

హైదరాబాద్ లోని స్కిన్ అండ్ డెంటల్ క్లీనిక్ లో కస్టమర్ వద్ద రూ.30.69 లక్షల విలువైన డైమండ్ రింగును దొంగలించిన మహిళా సిబ్బంది. పట్టుబడతానేమోనని భయంతో టాయిలెట్ కమోడ్ లో పడవేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.విచారణ సమయంలో, ప్లంబర్  సహాయంతో కమోడ్ ను అనుసంధానించే పైప్ లైన్ నుండి ఉంగరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  మహిళా ఉద్యోగిని దొంగతనం చేసిన తర్వాత అసలు నిజం బయటపడ్డం తో ఆమెను పోలీసులు అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. పోలీసులు […]

Share:

హైదరాబాద్ లోని స్కిన్ అండ్ డెంటల్ క్లీనిక్ లో కస్టమర్ వద్ద రూ.30.69 లక్షల విలువైన డైమండ్ రింగును దొంగలించిన మహిళా సిబ్బంది. పట్టుబడతానేమోనని భయంతో టాయిలెట్ కమోడ్ లో పడవేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.విచారణ సమయంలో, ప్లంబర్  సహాయంతో కమోడ్ ను అనుసంధానించే పైప్ లైన్ నుండి ఉంగరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  మహిళా ఉద్యోగిని దొంగతనం చేసిన తర్వాత అసలు నిజం బయటపడ్డం తో ఆమెను పోలీసులు అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫిర్యాదుదారు జుట్టు తొలగింపు కోసం గతవారం జూబ్లీహిల్స్ లోని నాగరికత క్లీనిక్ ను సందర్శించారు. చికిత్స  చేపట్టిన మహిళా సిబ్బందితో.. ఫిర్యాదుదారు  తన ఉంగరాన్ని ఒక పెట్టెలో ఉంచమని కోరింది. ఆమె ఇంటికి చేరుకున్న తర్వాతే ఫిర్యాదుదారుడు క్లినిక్ లోనే తన ఉంగరాన్ని మరిచిపోయాడని గ్రహించి దాని గురించి సిబ్బందిని విచారించగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టి సిబ్బందిని ప్రశ్నించగా మహిళా ఉద్యోగి తానే ఉంగరాన్ని దొంగలించి తన పర్సులో ఉంచుకున్నట్లు పోలీసులతో అంగీకరించినట్లు సమాచారం.  అయితే పోలీసులకు దొరికిపోతానేమో నన్న భయంతో తాను ఆ ఉంగరాన్ని క్లీనిక్ లోని వాష్ రూమ్ లోని కమోడ్ లో విసిరినట్లు ఆమె తెలిపింది.

లక్షల విలువైన వజ్రాన్ని దొంగలించిన ఓ యువతి పోలీసులకు దొరికిపోతానని భయంతో దాన్ని కమోడ్ లో వేసింది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆమె బండారం మొత్తం బయటపడింది. హైదరాబాదులో ఈ ఘటన వెలుగు చేసింది. కళ్ళముందే లక్షల విలువైన వజ్రపు ఉంగరం కనిపిస్తే ఆమె మనసు చలించి.. తెగించి చోరీ చేసింది. కానీ దాన్ని తన వెంట తెచ్చుకునే సాహసం మాత్రం చేయలేకపోయింది.దీంతో ఆ ఉంగరాన్ని కమోడ్ లో వేసి ఫ్రెష్ చేసింది. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఆమె బండారం మొత్తం బయటపడింది.

నగరానికి చెందిన నరేంద్ర కుమార్ అగర్వాల్ కోడలు ఇటీవలి జూబ్లీహిల్స్ లోని ఓ స్కిన్ అండ్ డెంటల్ క్లినిక్, చికిత్స కోసం వెళ్లారు. చెకప్ సమయంలో ఆమె తన వేలికి ఉన్న వజ్రపు ఉంగరాన్ని తొలగించి పక్కనే ఉన్న టేబుల్ పై పెట్టారు.ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయారు.  అనంతరం ఉంగరం మర్చిపోయిన విషయం గుర్తుకు రావడంతో హుటాహుటిన క్లినికకు వచ్చారు. అక్కడి సిబ్బందికి విషయం చెప్పగా తనకేమీ తెలియదు. అని వారు సమాధానం ఇచ్చారు. అక్కడంతా వెతికినా కూడా ఆమెకు ఉంగరం దొరకలేదు.దీంతో నరేంద్ర కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్లినిక్ లోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు.ఈ క్రమంలో మహిళా సిబ్బంది ఒకరు ఈ దొంగతనానికి పాల్పడ్డట్టు వెలుగులోకి వచ్చింది. రెండు రోజులపాటు నిందితురాలని పలు కోణాలు పోలీసులు ప్రశ్నించడంతో చివరకు ఆమె నిజం చెప్పక తప్పలేదు. పోలీసులకు దొరికిపోతానేమో భయంతో తాను ఉంగరాన్ని కమోడ్లు పడేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు కార్మికుల సాయంతో క్లినిక్ లోని బాత్రూంలను తవ్వించి ఓ పైపులు ఇరుక్కుపోయిన ఉంగరాన్ని వెలికి తీసి ఆ ఉంగరాన్ని ఆమెకు అప్ప చెప్పడం జరిగింది.