Hyderabad Biryani కి ప్రపంచ స్థాయి గుర్తింపు.. ఆ మాత్రం ఉండాలి మరి!

Hyderabad Biryani: తాజాగా ‘ట్రావెల్‌ గ్లోబల్‌.. ఈట్‌ లోకల్‌’ అంశంతో పనిచేసే ప్రముఖ ప్రపంచ పర్యాటక ఆన్‌లైన్‌ గైడ్‌ ‘టేస్ట్‌ అట్లాస్‌’ (Taste Atlas) ప్రకటించిన ఉత్తమ ఆహార పదార్థాల జాబితాలో కూడా మన హైదరాబాద్‌ బిర్యానీ చోటు సంపాదించుకుంది. 

Courtesy: x

Share:

హైదరాబాద్‌ బిర్యానీ(Hyderabad Biryani) అంటే ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ బిర్యానీకి ఫిదా కావాల్సిందే. మరికొందరైతే కేవలం బిర్యానీ తినడానికే హైదరాబాద్ పర్యటన ప్లాన్ చేసుకుంటారంటే అతిశయోక్తి కాదు. అయితే, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన బిర్యానీకి ఆహార ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఇటీవల స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు పొందిన ఆహారపదార్థంగా మన బిర్యానీ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ట్రావెల్‌ గ్లోబల్‌.. ఈట్‌ లోకల్‌’ అంశంతో పనిచేసే ప్రముఖ ప్రపంచ పర్యాటక ఆన్‌లైన్‌ గైడ్‌ ‘టేస్ట్‌ అట్లాస్‌’ (Taste Atlas) ప్రకటించిన ఉత్తమ ఆహార పదార్థాల జాబితాలో కూడా మన హైదరాబాద్‌ బిర్యానీ చోటు సంపాదించుకుంది. 

‘టేస్ట్‌ అట్లాస్‌’ సంస్థ వివిధ దేశాలకు చెందిన నగరాలు, అక్కడి ఆహారపదార్థాలపై సమీక్ష చేసి ర్యాంకులను ప్రకటించింది. అందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ 50 నగరాల్లో హైదరాబాద్‌ బిర్యానీ 39వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ముంబై 35వ స్థానం, ఢిల్లీ 56, చెన్నై 65, లక్నో 92వ స్థానంలో నిలిచాయి. ఆహార పదార్థాల జాబితాలో అగ్రస్థానంలో ఇటలీ వంటకాలు నిలిచినట్టు ఆ సంస్థ ప్రకటించింది. కాగా, ఆహార పదార్థాల జాబితాలో అగ్రస్థానంలో ఇటలీ వంటకాలు నిలిచినట్టు ఆ సంస్థ వెల్లడించింది. మన దేశ ఆహార పదార్థాల్లో పావ్ భాజీ, దోశ, వడాపావ్‌, కబాబ్స్, పానీపురి, బిర్యానీలను అధికంగా ఇష్టపడుతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇక, మన హైదరాబాద్ విషయానికి వస్తే బిర్యానీకే టేస్ట్ ఫుడ్ అట్లాస్ జై కొట్టిందని చెప్పుకొచ్చు.

ఈ ఏడాదిలో స్విగ్గీలో అత్యధికంగా అమ్ముడుపోయింది బిర్యానీనే అని ‘హౌ ఇండియా స్విగ్గీడ్ 2023’ అనే రిపోర్ట్​లో స్విగ్గీ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. తమ ప్లాట్ ఫాంపై ఎక్కువ మంది కస్టమర్లు బిర్యానీనే ఆర్డర్ చేశారని తెలిపింది. ఈ సంవత్సరం సగటున 1 సెకనుకు 2.5 బిర్యానీలు ఆర్డర్ చేశారట. ఒక్క జనవరి నెలలోనే ఏకంగా 4,30,000 బిర్యానీలు ఆర్డర్ పెట్టారట. జనవరి 1 నుంచి నవంబర్ 23 వరకు చేసిన జరిగిన విక్రయాల డేటాను బట్టి ఈ ఏడాది ఏకంగా 2.49 మిలియన్ల మంది కస్టమర్లు స్విగ్గీలో బిర్యానీ కోసం ఆర్డర్లు చేశారట. దేశంలోని అన్ని నగరాల్లోకెల్లా హైదరాబాద్​లోనే బిర్యానీని ఎక్కువ మంది ఆర్డర్ చేయడం గమనార్హం. హైదరాబాద్​ కు చెందిన ఓ వ్యక్తి అయితే ఈ ఏడాదిలో ఏకంగా 1,633 బిర్యానీ ఆర్డర్లు పెట్టడం మరో విశేషం.