జై షా ఎన్ని రన్స్ కొట్టారు అని బీసీసీఐ సెక్రటరీ అయ్యారు

తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ను వంశ పారంపర్య పార్టీగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభివర్ణించారు. దీనిపై తమిళనాడు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు.  రామేశ్వరం లోని రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై పాదయాత్రను ప్రారంభించిన అమిత్ షా డీఎంకే పార్టీ ను వంశ పారంపర్య పార్టీగా అభివర్ణించడమే కాకుండా డీఎంకే మిత్ర పక్షాలు కూడా వంశ పారంపర్యతను ప్రోత్సహిస్తున్నారు అని అన్నారు. అయితే డీఎంకే […]

Share:

తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ను వంశ పారంపర్య పార్టీగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభివర్ణించారు. దీనిపై తమిళనాడు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. 

రామేశ్వరం లోని రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై పాదయాత్రను ప్రారంభించిన అమిత్ షా డీఎంకే పార్టీ ను వంశ పారంపర్య పార్టీగా అభివర్ణించడమే కాకుండా డీఎంకే మిత్ర పక్షాలు కూడా వంశ పారంపర్యతను ప్రోత్సహిస్తున్నారు అని అన్నారు. అయితే డీఎంకే పార్టీ యువజన విభాగం మీటింగ్ లో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తాను ఎన్నికలలో పోటీ చేసే ఎమ్మెల్యే అయ్యాను అని ఆ తర్వాతే నాకు మంత్రి పదవి లభించింది అని వ్యాఖ్యానించారు. నన్ను ముఖ్యమంత్రి చేయడమే మా పార్టీ నేతల లక్ష్యం అని అమిత్ షా అన్నారు, కానీ మీ కొడుకు జై షా బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడు అని మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను అని అన్నారు. 

జై షా క్రికెట్ లో ఎన్ని మ్యాచ్ లు ఆడాడు? అతను క్రికెట్ లో ఎన్ని పరుగులు సాధించాడు అని కూడా ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. ఉదయనిధి స్టాలిన్ గతంలో పలు సినిమాల్లో హీరోగా నటించాడు, 2021 ఎన్నికలలో డీఎంకే పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచారు. ప్రస్తుతం ఆయన యూత్ వెల్ఫేర్ మరియు స్పోర్ట్స్ డెవలప్మెంట్ శాఖలకు మంత్రిగా ఉన్నారు. 

మరో వైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్ మాన్, ఎన్ మక్కల్ అని నామకరణం చేసిన పాదయాత్రను ప్రారంభించారు. తమిళనాడు బీజేపీ నాయకుడు కె. అన్నామలై ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ఆరు నెలల పాటు సాగనున్నది. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న 39 పార్లమెంట్ నియోజక వర్గాలలో ఈ పాదయాత్ర సాగానున్నది. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొడుకు జై షా 2019 అక్టోబర్ నెల నుండి జై షా బీసీసీఐ సెక్రటరీ గా కొనసాగుతున్నారు. 2021 జనవరి నెలలో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ జై షా ను ప్రెసిడెంట్ గా నియమించింది. క్రికెట్ ఆటలో ఎటువంటి అనుభవం లేని జై షా బీసీసీఐ ప్రెసిడెంట్ ఎలా అయ్యారు అంటూ ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. 

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడంతో దక్షిణ భారతదేశంలో ఉన్న అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రంలో కూడా పట్టు కోల్పోయింది, దక్షిణాది లో ఉన్న రాష్ట్రాల్లో అధికారం కోసం బీజేపీ పార్టీ ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా కర్ణాటక రాష్ట్రంలో తప్ప ఎక్కడా పట్టు సాధించలేక పోయింది. బీజేపీ పెద్దలు డీఎంకే పార్టీ గురించి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం లో ఉన్న తెలుగు దేశం పార్టీ మీద కూడా గతంలో ఇదే తరహాలో కుటుంబ పార్టీలు అని, వంశ పారంపర్య పార్టీలు అని వ్యాఖ్యలు చేశారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ మీద అమిత్ షా అదే తరహా విమర్శలను గుప్పించారు. ఆ వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ గట్టి కౌంటర్ ఇవ్వడంతో వారి మధ్య మాటల యుద్ధం మొదలైంది.