చంద్రుడిపై స్పాట్స్‌కి పేర్లు ఎలా పెడ‌తారు?

ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా చంద్రయాన్-3 గురించిన కథలే. ఇస్రో సాధించిన విజయాన్ని అంతా కొనియాడుతున్నారు. ఇంతటి ఘన విజయం సాధించి దేశ కీర్తిని మరింత పెంచారని ఇస్రో సైంటిస్టులను కొనియాడుతున్నారు. దేశంలోని సామాన్య పౌరుడి నుంచి ప్రధాని, రాష్ట్రపతి వరకు అంతా ప్రతి ఒక్కరూ ఇస్రోను అభినందిస్తున్నారు. అంతే కాకుండా విదేశాల నుంచి డైరెక్ట్ గా వచ్చిన ప్రధాని బెంగళూరులోని ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. అంతే కాకుండా చంద్రుడి మీద మన రోవర్ దిగిన ప్రాంతానికి […]

Share:

ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా చంద్రయాన్-3 గురించిన కథలే. ఇస్రో సాధించిన విజయాన్ని అంతా కొనియాడుతున్నారు. ఇంతటి ఘన విజయం సాధించి దేశ కీర్తిని మరింత పెంచారని ఇస్రో సైంటిస్టులను కొనియాడుతున్నారు. దేశంలోని సామాన్య పౌరుడి నుంచి ప్రధాని, రాష్ట్రపతి వరకు అంతా ప్రతి ఒక్కరూ ఇస్రోను అభినందిస్తున్నారు. అంతే కాకుండా విదేశాల నుంచి డైరెక్ట్ గా వచ్చిన ప్రధాని బెంగళూరులోని ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. అంతే కాకుండా చంద్రుడి మీద మన రోవర్ దిగిన ప్రాంతానికి శివశక్తి అని నామకరణం కూడా చేశారు. మోదీ నామకరణం అయితే  చేశారు కానీ చంద్రుడి  మీద ప్రాంతానికి పేరు పెట్టడం ఇంత సింపులా అని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అసలు దీనికి ఓ ప్రక్రియ అంటూ ఏమీ ఉండదా అని సెర్చ్ చేస్తున్నారు. చట్టాలేం చెబుతున్నాయి.. 

చంద్రుడి మీద మన రోవర్ దిగిన ప్రదేశానికి మోదీ శివ శక్తి పాయింట్ అని పేరు పెట్టారు. దీంతో ఇలా పేరు పెట్టాలంటే చట్టాలు ఏం చెబుతున్నాయని అంతా ప్రశ్నిస్తున్నారు. ఏ దేశం కూడా చంద్రుడి మీద సార్వభౌమాధికారాన్ని చలాయించలేదని యునైటెడ్ నేషన్స్ 1966 ఔటర్ స్పేస్ ట్రీటీలో స్పష్టంగా ఉంది. ఒకానొక సమయంలో చంద్రుడి మీద ఆధిపత్యం కోసం ఇటు రష్యా, అటు అమెరికా కొట్లాడుతున్న రోజుల్లో ఈ చట్టాలను తయారు చేశారు. అన్ని దేశాలకు ఈ చట్టాలు ప్రయోజనాలు కల్పిస్తాయని ఆనాడే వెల్లడించారు. అంతే కాకుండా 1979లో మూన్ గురించి జరిగిన ఒప్పందం ప్రకారం చంద్రుని యొక్క ఏ భాగంలో కూడా ఏ రాష్ట్రం, అంతర్జాతీయ ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థ, జాతీయ సంస్థ గుత్తాధిపత్యం చెలాయించేందుకు అనుమతులు లేవు. అందుకోసం ఎవరైనా సరే ఇలా పేర్లు పెట్టి తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తే అది చెల్లదని ఆ చట్టం చెప్పింది. అయినప్పటికీ వారు కొన్ని కార్యకలాపాలను నిర్వహించవచ్చని చట్టాలు వెల్లడించాయి. 

మరి ఎవరు పేరు పెట్టొచ్చు?? 

చంద్రుని ఉపరితలాలకు ఎవరు పడితే వారు పేర్లను పెట్టలేరని తెలుసుకున్న జనాలు మరి ఎవరు పేర్లను పెడతారని ఆతృత పడుతున్నారు. చంద్రుని ఉపరితలాలపై ఉన్న లోయలు మరియు స్థలాలకు పేరు పెట్టడం అనే సాంప్రదాయం యూరప్ లో 17వ శతాబ్దంలోనే  ప్రారంభమైంది. ఇక 20వ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యా చంద్రుని అన్వేషణలను పంపే దేశాలుగా నిలిచాయి. దీంతో అవి కూడా చంద్రుడి మీద ఉపరితలాలకు పేర్లను పెట్టడం స్టార్ట్ చేశాయి. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (IAU) అంతరిక్ష కార్యకలాపాల కోసం కొన్ని నియమాలను నిర్ణయిస్తుంది. ఆ సంస్థలో కొన్ని సభ్య దేశాలు ఉన్నాయి. మొత్తం 92 సభ్యదేశాలు అందులో ఉన్నాయి. ఆ సభ్య దేశాలలో  భారతదేశం ఒకటి. IAU 1919లో ప్రారంభమైనప్పటి నుంచి  గ్రహ మరియు ఉపగ్రహ నామకరణానికి మధ్యవర్తిగా ఉందని దాని వెబ్సైట్ చెబుతోంది. వెబ్సైట్ లో పేర్కొన్న ప్రకారం కేవలం ఇది మాత్రమే నేమ్స్ ఖరారు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. చంద్రుడి మీద ప్రయోగాలు చేసిన చాలా దేశాలు చంద్రునిపై ప్రాంతాలకు అనధికారిక పేర్లను పెడుతున్నాయి.  అపోలో మిషన్ల సమయంలో యునైటెడ్ స్టేట్స్ చంద్రుడి మీద ప్రదేశాలకు అనధికారిక పేర్లను ప్రకటించింది. 2010 నుంచి చంద్రునిపై ఉన్న భౌగోళిక సంస్థలకు చైనా కూడా పేర్లు పెడుతూ వస్తోంది. కానీ ఈ పేర్లు ఆ దేశ ప్రజలు పిలుచుకునేందుకు తప్ప మిగతా వాటికి ఉపయోగపడవు. అందుకోసమే ఇలా ఎవరు పడితే వారు చంద్రుడి మీద పేర్లను పెడుతూ చంద్రుడి మీద స్థలాలను ఆక్రమించుకోవడం బంద్ చేయాలని పలు సంస్థలు చెబుతున్నాయి. ప్రధాని మోదీ శివశక్తి పాయింట్ అని పేరు అనౌన్స్ చేయగానే.. కొంత మంది చంద్రుడి ఉపరితలాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలనే డిమాండ్ ను తెరమీదకు తెచ్చారు. ఇలా ప్రకటించుకుంటూ పోయేందుకు ఎవరికీ అనుమతి లేదని పలు చట్టాలు చెబుతున్నాయి.