Amit Shah: అమిత్ షా ప్లాన్ మామూలుగా లేదుగా..

Amit Shah: బీజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న వారిలో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) ఒకరు. ఆయన కనుక ఏదైనా స్కెచ్ వేస్తే అందులో విజయం సాధించడం పక్కా అని అంతా నమ్ముతారు. అలా అమిత్ షా  (Amit Shah) సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా ఆయన ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో పర్యటిస్తున్నారు. అక్కడ ప్రస్తుతం బీజేపీ (BJP) ప్రభుత్వమే అధికారంలో ఉంది. కానీ […]

Share:

Amit Shah: బీజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న వారిలో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) ఒకరు. ఆయన కనుక ఏదైనా స్కెచ్ వేస్తే అందులో విజయం సాధించడం పక్కా అని అంతా నమ్ముతారు. అలా అమిత్ షా  (Amit Shah) సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా ఆయన ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో పర్యటిస్తున్నారు. అక్కడ ప్రస్తుతం బీజేపీ (BJP) ప్రభుత్వమే అధికారంలో ఉంది. కానీ ప్రస్తుతం టఫ్ ఫైట్ (Tough Fight) ఉండడంతో అమిత్ షా(Amit Shah)  మధ్య ప్రదేశ్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా అక్కడ పార్టీని గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. అందుకే వరుస సమావేశాల్లో పాల్గొంటూ బీజేపీకి బూస్ట్ (Boost) తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సభలు, ర్యాలీలు, సమావేశాలకు అశేష జనవాహిని హాజరవుతున్నారు. వారిలో జోష్ తగ్గకుండా షా కూడా తనదైన ప్రసంగాలతో అలరిస్తున్నారు. షా కేవలం ప్రస్తుతం చేస్తున్న పనుల గురించి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గురించి చెప్పడం లేదు. ఆయన కేంద్ర ప్రభుత్వ (Central Government) పనితీరును కూడా ఓటర్లకు వివరిస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేసిన పనులు చూసి ఓటేయాలని ఓటర్లను కోరుతున్నారు. 

అన్నీ వివరిస్తున్న షా.. 

ఓటర్లకు కేంద్ర మంత్రి అమిత్  షా (Amit Shah)  అన్నీ వివరిస్తున్నారు. వారు అధికారంలోకి వచ్చిన నుంచి చేసిన అన్ని పనులను మరియు ఆపరేషన్లను ఆయన వివరిస్తున్నారు.2024లో మళ్లీ నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రిని చేయాలని ఓటర్లను కోరుతున్నారు. ఎంపీలో బీజేపీకి (BJP) ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. మైదాన ప్రాంతం చంబల్ లోయలో ఆయన ప్రస్తుతం ప్రచారం (Campaign) చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. కేవలం ఆయన అసెంబ్లీ ఎన్నికలను మాత్రమే కాకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికలను కూడా టార్గెట్ (Target) చేసినట్లు ఉన్నారని పలువురు చెబుతున్నారు. ఇక షా తన ప్రసంగంలో రామాలయ (Ramalay) ప్రారంభోత్సవ తేదీ గురించి, అలాగే పాకిస్తాన్‌ లో ఇండియన్ ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ (Surgical Strikes) గురించి ప్రస్తావించారు. అంతే కాకుండా భారతదేశంలో బీజేపీ ఉగ్రవాద దాడులను ఎలా నిలిపివేసిందో ఓటర్లకు వివరించారు. ఎలాగైనా సరే చంబల్ లోయ ప్రాంతంలో బీజేపీని ఆధిక్యంలో నిలపాలని షా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రసంగాల్లో వేడి పెంచుతున్నారు. అక్కడి ప్రతిపక్ష పార్టీలను దుయ్యబడుతూ ముందుకు సాగుతున్నారు. 

కమల్ నాథ్ వచ్చాడో.. 

కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamal Nath) మరోమారు ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలు మొత్తం ఆగిపోతాయని షా(Amit Shah)  ప్రజలను హెచ్చరిస్తున్నారు.  కమల్ నాథ్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే సీఎం లాడ్లీ బెహనా యోజన కింద వచ్చే డబ్బును కూడా ఆపుతారని షా మహిళలతో చెప్పారు. 2018లో ఈ ప్రాంతంలోని 34 సీట్లలో కేవలం ఎనిమిది సీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది. కావునే షా ఈ ప్రాంతం మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అప్పుడు బీజేపీ గెలుచుకున్న సీట్లు కాంగ్రెస్ కంటే తక్కువే. కానీ అప్పట్లో ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా (Jyotiraditya) ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. గ్వాలియర్ లో షాతో కలిసి సింధియా కూడా బహిరంగ సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. షా మాట్లాడే కంటే ముందే సింధియా మాట్లాడి ప్రజలను ఉత్తేజితుల్ని చేస్తున్నాడు. అంతే కాకుండా షా పథకాలను గురించి వివరించేటపుడు ప్రజల్లో కొత్త ఉత్సాహం వచ్చేటట్లు సింధియా చేస్తున్నాడు. ఈ సారి ఇక్కడ బీజేపీ సింధియాను  ముందు పెట్టుకుని ఎలాగైనా ఎక్కువ సీట్లను గెల్చుకోవాలని చూస్తోంది. అందుకోసం తనకు ఉన్న అన్ని వనరులను వాడుకోవడం మొదలుపెట్టింది. షా మరియు సింధియాలు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), మరియు మధ్యప్రదేశ్ నేత కమల్ నాథ్ లపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ వచ్చే ఏడాది జనవరిలో రామమందిరం ప్రారంభిస్తారని తాను రాహుల్ బాబాకు చెప్పాలని అనుకుంటున్నట్లు షా తెలిపారు.  

మధ్యప్రదేశ్ లో మూడు దీపావళి పండుగలు..

మధ్య ప్రదేశ్ రాష్ట్ర మూడు దీపావళి పండుగలను జరుపుకుంటుందని కేంద్ర మంత్రి షా తెలిపారు. ఒకటి దీపావళి పండుగ, మరోటి డిసెంబర్ 3న రాష్ట్రంలో బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత.. ఇంకోటి వచ్చే ఏడాది జనవరి 22న రామ మందిరం ఓపెన్ అయినపుడు అని షా వివరించారు. చంద్రయాన్ నుంచి కోవిడ్‌ కు వ్యతిరేకంగా డబుల్ టీకా వరకు, నరేంద్ర మోదీ (Modi) నాయకత్వంలో దేశం సాధించిన విజయాల గురించి ప్రజలు గర్వపడుతున్నారా లేదా అని షా(Amit Shah)  ప్రజలను ప్రశ్నించారు. ఇలాగే భారతదేశం అన్ని రంగాల్లో దూసుకుపోవాలని అనుకుంటే సుస్థిర బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని షా ఓటర్లను కోరారు. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రధాని మోదీని మూడోసారి ప్రధానిని చేయాలని షా(Amit Shah)  ఓటర్లను కోరారు. తప్పకుండా బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని అభ్యర్థించారు.