జీ-20లో భార‌తీయ దుస్తుల్లో మెరిసిన అక్షతా మూర్తి

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి కూతురే ఈ అక్షతా మూర్తి. దీంతో ఈమె ఇండియన్స్ కు సుపరిచితురాలు. రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా మన ఇండియన్ మూలాలున్న వ్యక్తి బ్రిటీష్ సింహాసనాన్ని అధిరోహించాడని అంతా ఆనందం వ్యక్తం చేశారు. అటువంటి రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఇండియా గ్రాండ్ గా […]

Share:

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి కూతురే ఈ అక్షతా మూర్తి. దీంతో ఈమె ఇండియన్స్ కు సుపరిచితురాలు. రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా మన ఇండియన్ మూలాలున్న వ్యక్తి బ్రిటీష్ సింహాసనాన్ని అధిరోహించాడని అంతా ఆనందం వ్యక్తం చేశారు. అటువంటి రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఇండియా గ్రాండ్ గా నిర్వహించిన జీ-20 సమావేశాలకు హాజరయ్యారు. దీంతో అక్షతా మూర్తి ధరించిన ఔట్ ఫిట్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ పర్యటన సందర్బంగా అక్షతా మూర్తి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పర్యటనలో ఆమె అనేక ఇండియన్ ప్రాంతాలను సందర్శించారు. దీంతో అక్కడ దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.  ఆమె ప్రస్తుతం బ్రిటన్ లో ఉంటున్నా కానీ ఈ పర్యటనలో అక్షతా ధరించిన దుస్తులు ఇండియన్ మూలాలను ప్రతిబింబేచేలా ఉన్నాయి. దీంతో అందరూ అక్షతా మూర్తిని మెచ్చుకుంటున్నారు. ఎంత ఎదిగినా కానీ అక్షతా మూర్తి తన మూలాలను మర్చిపోలేదని అంతా కామెంట్స్ చేస్తున్నారు. 

దిగుతూనే ఉట్టి పడిన భారతీయత

రిషి సునాక్, అక్షతా మూర్తి జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో అక్షతా మూర్తి ధరించిన వైట్ కోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రోకేడ్ స్వరాలుతో అలంకరించబడిన సాంప్రదాయ స్కర్ట్‌తో జతచేయబడిన స్ఫుటమైన తెల్లటి మడతల చొక్కా ధరించింది. దీంతో ఆమె ఔట్ ఫిట్ ను చూసిన అందరూ వావ్ అన్నారు.  ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విధంగా అక్షతా మూర్తి భారతీయ మూలాలను మర్చిపోకుండా భారతీయ విలువలకు గౌరవమిచ్చింది. 

ప్రదర్శనలను తిలకించే సమయంలో 

జీ- 20 సమావేశానికి హాజరైన అక్షతా మూర్తి ఢిల్లీలోని వ్యవసాయ ప్రదర్శనను సందర్శించింది. అప్పుడు కూడా ట్రెండింగ్ ఔట్ ఫిట్ ను ధరించి అట్రాక్ట్ గా నిలిచింది. ఆమె భారతీయ మూలాలు కలిగిన లండన్‌ కు చెందిన ప్రముఖ డిజైనర్ మణిమేకల డిజైన్ చేసిన స్టైలిష్ లిలక్ దుస్తులను ధరించింది. మణిమేకల కూడా ఆ ఫిట్ మీద అక్షతా మూర్తిని మెచ్చుకుంది. ఆమెకు ఆ డ్రెస్ చాలా బాగా సూట్ అయిందని తెలిపింది. అక్షతా మూర్తి డ్రెస్ పట్ల తను కూడా ఆనందం వ్యక్తం చేసింది. 

జీ- 20 డిన్నర్ సమయంలో..

ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము జీ-20 సమావేశాలకు వచ్చిన దేశాధినేతలకు మరియు దేశంలోని రాజకీయ నాయకులకు విందు ఇచ్చారు. ఈ విందుకు…. జీ-20 సమావేశానికి వచ్చిన అన్ని దేశాల వారు హాజరయ్యారు. ఈ విందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, అతడి భార్య అక్షతా మూర్తి కూడా హాజరయ్యారు. ఆ విందుకు హాజరైన అక్షతా మూర్తి ధరించిన ప్రకాశవంతమైన డ్రెస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె లండన్‌కు చెందిన భారతీయ డిజైనర్ సలోని లోధా రూపొందించిన ప్రింటెడ్ దుస్తులను ధరించింది. 

అక్షరధామ్ ఆలయ సందర్శనలో… 

రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి లండన్ ఫ్లైట్ దిగిన నుంచి లండన్ ఫ్లైట్ ఎక్కే వరకు ట్రెండింగ్ ఔట్ ఫిట్స్ తో అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేసింది. ఈ దంపతులు అక్షరధామ్ ఆలయాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్శన సమయంలో ఆమె ఒక జాతి కుర్తా సెట్‌ను ధరించింది. ఆమె తన భర్తతో కలిసి ప్రార్థనలు చేసి, హారతి నిర్వహించి, భారతీయ సంప్రదాయాలతో తనకున్న లోతైన అనుబంధాన్ని గుర్తు చేసింది. ఇది చూసిన పలువురు అక్షతా మూర్తి రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బ్రిటన్ ప్రధాని భార్య అయినా అక్షతా మూర్తి సింపుల్ గా తన కాస్ట్యూమ్స్ ధరించడం చాలా గొప్ప విషయం అని అంతా అంటున్నారు. కాసింత ఆస్తి రాగానే మూలాలను మర్చిపోయే వ్యక్తులున్న ఈ రోజుల్లో అక్షతా మూర్తి ఓ దేశ ప్రధాని భార్య అయినా కానీ సింపుల్ గా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.