ఆర్టికల్ 370 రద్దు..ఇండియాకి ఎలా ఉప‌యోగ‌ప‌డింది?

ఆర్టికల్ 370 రద్దును ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 5న అభివర్ణించారు, ఇది జమ్మూ కాశ్మీర్‌లో శాంతి మరియు అభివృద్ధికి మార్గం సుగమం చేసింది అని ఆయన అన్నారు.  జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు సరిగ్గా నాలుగేళ్లు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ భారత్‌లో భూభాగమని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. 2019 వరకు ఆర్టికల్ 370 ముసుగులో గత 70 ఏళ్లుగా […]

Share:

ఆర్టికల్ 370 రద్దును ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 5న అభివర్ణించారు, ఇది జమ్మూ కాశ్మీర్‌లో శాంతి మరియు అభివృద్ధికి మార్గం సుగమం చేసింది అని ఆయన అన్నారు. 

జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు సరిగ్గా నాలుగేళ్లు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ భారత్‌లో భూభాగమని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది.

2019 వరకు ఆర్టికల్ 370 ముసుగులో గత 70 ఏళ్లుగా జమ్మూ, కశ్మీర్‌ పొరుగు దేశాల దాడులతో దోపిడీకి గురవుతూ వచ్చింది. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారతదేశంతో పూర్తిగా విలీనం కాలేదనే అభిప్రాయాన్ని సృష్టించింది. ఇది ఇతర దేశాల తో ఇబ్బంది కరమైన సమస్యగా మారింది. 

1947-48లో కాశ్మీర్‌పై పాకిస్తాన్ దాడిని ఎదుర్కోవడానికి భారత్ UN సహాయం కోరడంతో సమస్య మొదలైంది. కొద్ది కాలానికి అది పూర్తి స్థాయి భారత – పాక్ గొడవగా మారింది. ఈ సందర్భగా పాకిస్తాన్, దాని మిత్రదేశాలు భారత్‌ను అణచివేయడానికి కుట్ర పన్నాయ్ 

ఇంటి యనమానినే దొంగగా చిత్రీకరించే విధంగా మారిందని  మాజీ విదేశాంగ కార్యదర్శి అన్నారు. 

1990ల స్వాతంత్ర్య పోరాటం పేరుతో జమ్ము కశ్మీరులో  ఇస్లామిక్ జిహాద్‌, మతపరమైన తీవ్రవాదాన్ని పాకిస్తాన్ అన్ని విధాలుగా బలంగా ప్రోత్సహిస్తూ వచ్చింది. లోయలో పనిచేస్తున్న డై హార్డ్ ఆఫ్ఘన్ యుద్ధ అనుభవజ్ఞుల గురించి మీడియా కథనాలు ప్రజలతో పాటు భద్రతా దళాలలో కూడా భయాన్ని కలిగించింది. 

2019కి ముందు, పాకిస్తాన్ లెఫ్ట్-లిబరల్ మీడియా సాయంతో తప్పుడు కథనాలతో ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రయత్నించింది . జమ్ము కశ్మీర్ రెండు దేశాల మద్య పరిష్కరించలేని సమస్యగా చిత్రీకరించేందుకు కుట్ర చేసింది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి పాశ్చాత్య ఆలోచనా బృందాలు ‘జీలం’ సూత్రాల ‘చినాబ్’ అంటూ పరిష్కార మార్గాలను సూచించాయి. జూలై 2001లో ఆగ్రాను సందర్శించే సమయంలో  పాకిస్తాన్ నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్, అటల్ బిహారీ వాజ్‌పేయిని కాశ్మీర్ లోయపై చర్చకు పిలిపించారని ప్రచారం జరిగింది. 

సాయుధ ఇస్లామిక్ జిహాదీల సాయంతో కాశ్మీర్‌ను విడిచిపెట్టమని భారతదేశాన్ని బలవంతం చేసే ప్రయత్నంలో ముషారఫ్ తన పూర్వీకుల మాదిరిగానే కాశ్మీర్‌ను పాకిస్తాన్ సిర అని కూడా పిలిచాడు. 2001 డిసెంబర్  13న భారత పార్లమెంటులో 9/11 ఉగ్రదాడుల తర్వాత జైష్-ఏ-మహ్మద్ దాడి జరిగే వరకు పశ్చిమ దేశాలు, ప్రత్యేకించి US, UK, జర్మనీలు J&Kలో పాకిస్తాన్ ఆచరిస్తున్న సీమాంతర ఉగ్రవాదంపై మౌనంగా ఉన్నాయి. మే 2002లో కలుచక్‌లోని ఆర్మీ క్యాంప్‌పై పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా దాడి చేసిన తరువాత అంతా మలుపు తిరిగింది.  పాకిస్తాన్‌కు సైనిక పాఠం నేర్పడానికి భారతదేశం సరిహద్దు దాటి వెళ్లే స్థాయికి చేరుకుంది.

ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 A ని రద్దు చేసి, జమ్మూ, కాశ్మీర్, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాల కార్టోగ్రాఫిక్ సరిహద్దులను నిర్వచించే కొత్త మ్యాప్‌ను ప్రచురించడం ద్వారా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కాశ్మీర్‌ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల కొత్త మ్యాప్‌లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, ఉత్తర ప్రాంతాలు, 1963లో పాకిస్తాన్ అక్రమంగా చైనాకు అప్పగించిన షక్స్‌గామ్ లోయ, చైనా ఆక్రమించిన అక్సాయ్ చిన్‌లను భారత్‌లో కలుపుతూ కొత్త మ్యాపులు ప్రచురించారు. 

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ద్వైపాక్షిక, పర్యటనలకు విదేశాలకు వెళ్లినప్పుడు ఎవరూ కూడా జమ్ము కశ్మీర్‌లను ప్రస్తావించలేదు. భారత్‌లో జమ్ము, కాశ్మీర్‌ను కలుపుతూ లీగల్ పేపర్లలో కలిపినా ఎవరూ నోరు మెదపలేదు.  పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాద దాడులు అక్కడ జరుగుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో ఇస్లామాబాద్‌లోని రాజకీయ నాయకులు,  రావల్పిండిలోని జనరల్‌లు కొంత వెనక్కి తగ్గుతున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజా శాంతి ప్రతిపాదనలో “కశ్మీర్” అనే పదం ప్రస్తావన కూడా లేదు.